ఆన్‌లైన్‌లో, మీ ఏటీఎమ్ కార్డ్ పిన్ నెంబర్ మార్చటం ఎలా..?

32 లక్షల డెబిట్ కార్డుల వివరాలు హ్యాకర్ల చేతికి చిక్కినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో మీమీ ఏటీఎమ్ పిన్ నెంబర్లను మార్చుకునేందుకు పలు మఖ్యమైన సూచనలు.

|

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్, ఎస్ బ్యాంక్ వంటి ప్రముఖ బ్యాంక్‌లకు సంబంధించిన 32 లక్షల డెబిట్ కార్డుల వివరాలు హ్యాకర్ల చేతికి చిక్కినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయా బ్యాంక్‌లకు సంబంధించిన ఖాతాదారులు అప్రమత్తమవ్వాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది.

ఆన్‌లైన్‌లో మీ ఏటీఎమ్ కార్డ్ పిన్ నెంబర్ మార్చటం ఎలా..?

Read More : 6జీబి ర్యామ్‌,16 ఎంపీ కెమెరాలతో సామ్‌సంగ్ ఫోన్ లాంచ్ అయ్యింది

ముందస్తు సెక్యూరిటీ చర్యగా మీ డెబిట్ కార్ట్ పిన్ నెంబర్లను వీలైనంత త్వరగా మార్చివేయండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్, ఎస్ బ్యాంక్ ఖాతాదారులు ఆన్‌లైన్ ద్వారా తమ ఏటీఎమ్ కార్డ్ పిన్ నెంబర్లను మార్చుకునేందుకు పలు మఖ్యమైన సూచనలు...

 ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ యూజర్లు ఏం చేయాలంటే..?

ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ యూజర్లు ఏం చేయాలంటే..?

ముందుగా onlinesbi.com ద్వారా నెట్ బ్యాంకింగ్‌లోకి లాగిన్ అవ్వండి. ఆ తరువాత e-servicesలోని Online services విభాగాన్ని సెలక్ట్ చేసుకుని అందులోని ATM Card services సెక్షన్‌లోకి వెళ్లటం ద్వారా మీ డెబిట్ కార్డ్ పిన్ నెంబర్‌ను మార్చుకోవచ్చు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఐసీఐసీఐ డెబిట్ కార్డ్ యూజర్లు ఏం చేయాలంటే..?

ఐసీఐసీఐ డెబిట్ కార్డ్ యూజర్లు ఏం చేయాలంటే..?

ముందుగా మీ ఐసీఐసీఐ నెట్‌బ్యాంకింగ్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి.
మీ అకౌంట్ పేజీలో ఎడమ చేతి వైపు కనిపించే My Card Pin ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.ఇక్కడ మీకు డెబిట్ కార్డ్ పిన్ నెంబర్‌ను మార్చుకునే ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.ఇక్కడ Active debit card ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని మీ డెబిట్ కార్డ్ CVV నెంబర్‌ను ప్రొవైడ్ చేయవల్సి ఉంటుంది. ఆ తరువాత వన్‌టైమ్‌పాస్‌‌వర్డ్ ద్వారా మీరు వెరిఫై చేయబడతారు. తరువాతి స్టెప్‌లో మీ డెబిట్ కార్డ్ వెనుక ఉన్న corresponding lettersను సబ్మిట్ చేయవల్సి ఉంటుంది. తరువాతి పేజీలో మీ ఐసీఐసీఐ డెబిట్ కార్డ్‌కు సంబంధించి కొత్త పిన్ కోడ్‌ను సెలక్ట్ చేసుకుని సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.

హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్ కార్డ్ యూజర్లు ఏం చేయాలంటే..?
 

హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్ కార్డ్ యూజర్లు ఏం చేయాలంటే..?

ముందుగా మీ హెచ్‌డీఎఫ్‌సీ నెట్‌బ్యాంకింగ్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి.
మీ అకౌంట్ పేజీలోని Cards టాబ్ పై క్లిక్ చేయండి.
అందులో Debit Cards ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని ‘Request' బటన్ పై క్లిక్ చేయండి. Request విభాగంలో Instant PIN Generation అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఈ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని మీ వివరాలను పొందుపరచటం ద్వారా మీ డెబిట్ కార్డ్ పిన్ నెంబర్‌ను మార్చుకోవచ్చు.

యాక్సిస్ బ్యాంక్ డెబిట్ కార్డ్ యూజర్లు ఏం చేయలంటే..?

యాక్సిస్ బ్యాంక్ డెబిట్ కార్డ్ యూజర్లు ఏం చేయలంటే..?

ముందుగా మీ యాక్సిస్ బ్యాంక్ నెట్‌బ్యాంకింగ్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి. అక్కడ మీకు My Debit Cards ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని అందులోని active debit card విభాగంలో వెళ్లండి. అక్కడ More Services పై క్లిక్ చేసినట్లయితే Set Debit Card Pin ఆప్షన్ మీకు కనిపిస్తుంది. Go ఆప్షన్ పై ప్రెస్ చేసినట్లయితే మీ డెబిట్ కార్డ్ పిన్ నెంబర్‌ను మార్చుకునే అవకాశం లభిస్తుంది.

ఎస్ బ్యాంక్ డెబిట్ కార్డ్ యూజర్లు ఏం చేయలంటే..?

ఎస్ బ్యాంక్ డెబిట్ కార్డ్ యూజర్లు ఏం చేయలంటే..?

ముందుగా మీ ఎస్ బ్యాంక్ నెట్‌బ్యాంకింగ్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి. మీ అకౌంట్ పేజీలో కనిపించే mySPACE టాబ్ పై క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ క్రింద కనిపించే మూడవ ఆప్షన్ Debit Card PIN Re-generation/ Changeను సెలక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఓ డ్రాప్‌డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ డెబిట్ కార్డ్ వ్యాలిడిటీతో పాటు కొత్త పిన్ నెంబర్‌ను ఎంటర్ చేయవల్సి ఉంటుంది. మరోసారి కొత్త పిన్ ను రీఎంటర్ చేసి ముందుక ప్రొసీడ్ అవ్వండి. ఇప్పుడో confirmation స్ర్కీన్ మీ ముందు ప్రత్యక్షమవుతుంది. Confirm బటన్ పై క్లిక్ చేసిన వెంటనే OTP పేజీలోకి వెళతారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
How to Change SBI, ICICI, HDFC, Axis Bank, Yes Bank Debit Card PIN Online. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X