మీ ఆండ్రాయిడ్ ఫోన్ సక్రమంగా పనిచేస్తుందో లేదో తెలుసుకోవాలంటే..?

Written By:

ఓ స్మార్ట్‌ఫోన్ సక్రమంగా పనిచేయాలంటే ఫోన్‌లోని అన్ని విభాగాలు ఖచ్చితంగా స్పందించాల్సి ఉంటుంది. ఏ విభాగం టైమ్‌కు పనిచేయకపోయినా ఆ ప్రభావం ఫోన్ పనితీరు పై ఖచ్చితంగాఉంటుంది. మీ ఆండ్రాయిడ్ ఫోన్ సక్రమంగా పనిచేస్తుందో లేదో తెలుసుకోవాలంటే తరచూ ఓ చెకప్ ను నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకు ప్రత్యేకమైన యాప్స్ గూగుల్ ప్లే స్టోర్‌లో సిద్ధంగా ఉన్నాయి. ఆ వివరాలను చూసేద్దామా మరి..

Read More : ఈ టాయిలెట్‌కు నీరు అవసరం లేదు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గూగుల్ డివైస్ అసిస్ట్ (Google Device Assist)

మీ ఆండ్రాయిడ్ ఫోన్ సక్రమంగా పనిచేస్తుందో లేదో తెలుసుకోవాలంటే..?

ముందుగా గూగుల్ డివైస్ అసిస్ట్ (Google Device Assist) యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. మీరు నెక్సుస్ లేదా మోటో స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నట్లయితే ఈ APK fileను మాన్యువల్‌గా ఇన్‌స్టాల్ చేసుకోండి. గూగుల్ డివైస్ అసిస్ట్ యాప్ మీ ఫోన్ పనితీరుకు సంబంధించి అనేక సలహాలు, సూచనలు మీకు అందిస్తుంది.


http://www.apkmirror.com/apk/google-inc/device-assist/device-assist-114878475-release/device-assist-114878475-android-apk-download/

 

టెస్ట్ యువర్ ఆండ్రాయిడ్ (Test Your Android)

మీ ఆండ్రాయిడ్ ఫోన్ సక్రమంగా పనిచేస్తుందో లేదో తెలుసుకోవాలంటే..?

పేరుకు తగ్గట్టుగానే ఈ యాప్ మీ ఆండ్రాయిడ్ ఫోన్ ను పూర్తి స్థాయిలో టెస్ట్ చేసి చూస్తుంది. కలర్ ఫుల్ ఇంటర్ ఫేస్ ఇంకా టెక్స్ట్ తో వస్తోన్న ఈ యాప్ మీ ఫోన్ పనితీరుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని విశ్లేషణాత్మకంగా డిస్ ప్లే చేస్తుంది. డౌన్‌లోడ్ లింక్

 

ఫోన్ డాక్టర్ ప్లస్ (Phone Doctor Plus)

మీ ఆండ్రాయిడ్ ఫోన్ సక్రమంగా పనిచేస్తుందో లేదో తెలుసుకోవాలంటే..?

ఈ యాప్, మీ ఆండ్రాయిడ్ ఫోన్‌కు పర్సనల్ డాక్టర్ లా వ్యవహరిస్తుంది. ఫోన్ పనితీరును సమీక్షించే క్రమంలో అవసరమైన అన్ని రకాల చెకప్ లను నిర్వహిస్తుంది. ఈ యాప్ ద్వారా పోన్ సీపయూ ఇంకా బ్యాటరీ విభాగాలకు సంబంధించి హెల్త్ స్టేటస్ ను తెలసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ డౌన్‌లోడ్ లింక్

జెడ్ - డివైస్ టెస్ట్ (Z - Device Test)

మీ ఆండ్రాయిడ్ ఫోన్ సక్రమంగా పనిచేస్తుందో లేదో తెలుసుకోవాలంటే..?

ఈ యాప్, మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ యాక్సిలరోమీటర్ దగ్గర నుంచి జీపీఎస్ పనితీరు వరకు పూర్తి సమాచారాన్ని మీకు అందిస్తుంది. గూగుల్ ప్లే స్టోర్ డౌన్‌లోడ్ లింక్ 

 

Fix Dead Pixels (ఫిక్స్ డెడ్ పిక్సల్స్)

మీ ఆండ్రాయిడ్ ఫోన్ సక్రమంగా పనిచేస్తుందో లేదో తెలుసుకోవాలంటే..?

మీ స్మార్ట్ ఫోన్ డిస్ ప్లేలో ఏమైనా పిక్సల్ సమస్యలు ఉన్నట్లయితే ఆ సమస్యను ఈ యాప్ పరిష్కరిస్తుంది. వివిధ కలర్ బ్యాక్‌గ్రౌండ్‌లతో డిస్‌ప్లేను పరీక్షించే ఈ యాప్ డెడ్ పిక్సల్స్‌ను గుర్తించి వాటిని రీఫ్రెష్ చేసే ప్రయత్నం చేస్తుంది. గూగుల్ ప్లే స్టోర్ డౌన్‌లోడ్ లింక్ 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How To Check If Your Android Smartphone Is Functioning Properly!. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting