జియో బ్యాలెన్స్ చెక్ చేయడం ఎలా..?
జియో బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఎలాగో తెలుసా..?
ఏప్రిల్ 1 నుంచి జియో పెయిడ్ సర్వీసులను ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇకపై అందరూ జియో టారిఫ్ ఫ్లాన్లలో నచ్చిన దానిని సెలక్ట్ చేసుకుని జియో డేటా వాడుకోవచ్చని ముకేష్ అంబాని తెలిపారు. అయితే ఈ ప్లాన్లు పరిమిత స్థాయిలో మాత్రమే ఉన్నాయి. కాబట్టి జియో బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం తప్పనిసరి అవుతుంది. ఈ నేపథ్యంలో జియో బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఎలాగో ఓ సారి చూద్దాం.
30 ఎంపీ కెమెరాతో షియోమి కొత్త ఫోన్

స్టెప్ 1
మీ జియో కనెక్టెడ్ ఫోన్ నుంచి మై జియో యాప్ ని లాంచ్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసి నెక్ట్స్ మై జియో యాప్ బటన్ నొక్కండి.

స్టెప్ 2
అక్కడ మీరు యూజర్ నేమ్ , మొబైల్ నంబర్ , పాస్ వర్డ్ లతో లాగిన్ కావాల్సి ఉంటుంది.

స్టెప్ 3
లాగిన్ అయిన తరువాత మెనూ ఆప్సన్ లోకి కెళితే మీకు అక్కడ త్రి లైన్స్ మెను బటన్ కనిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేయండి.

స్టెప్ 4
అక్కడ మై ప్లాన్స్ అనే ఆప్సన్ కనిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేస్తే మీకు డేటా బ్యాలెన్స్ ,అలాగే బ్యాలన్స్ వ్యాలిడిటీ, ఎసెమ్మెస్ కాల్స్ వంటి వివరాలు కనిపిస్తాయి.

మీ కంప్యూటర్ ద్వారా కూడా
మీరు ఫోన్ లో డేటా పనిచేయకుంటే మీ కంప్యూటర్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. జియో. కామ్ లో కెళ్లి అక్కడ మీరు లాగిన్ అయితే మీకు మై ప్లాన్స్ వివరాలు కనిపిస్తాయి. అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications