మీ ల్యాప్‌టాప్‌కు ఇంటర్నెట్ లేకుండా జీమెయిల్ చెక్ చేసుకోవచ్చా..?

|

ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా జీమెయిల్‌లోని వివరాలు చూడొచ్చా..? సాధ్యమే అంటోంది జీమెయిల్ ఆఫ్‌లైన్ అప్లికేషన్. ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలనుకునే యూజర్ తప్పని సరిగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను తన పీసీ లేదా ల్యాప్‌టాప్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకోవాలి. ఇన్స‌స్టాలేషన్ అనంతరం క్రోమ్ వెబ్ స్టోర్‌లోకి లాగినై జీమెయిల్ ఆఫ్‌లైన్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీరు డౌన్‌లోడ్ చేసిన సదరు అప్లికేషన్ గూగుల్ క్రోమ్ అప్లికేషన్ పేజీలో నిక్షిప్తం కాబడి ఉంటుంది.

మీ ల్యాప్‌టాప్‌కు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా జీమెయిల్ చెక్ చేసుకోవచ్చా..?

తదుపరి చర్యగా ఆ అప్లికేషన్‌ను మీ పీసీలో ఇన్స్‌‌స్టాల్ చేసిన వెంటేనే ‘Allow Offline Mail', ‘Dont allow offline mail' అనే రెండు ఆప్షన్‌లతో కూడిన వెబ్‌పేజీ ప్రత్యక్షమవుతుంది. ‘Allow Offline Mail'ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే మీ జీమెయిల్ ఇన్‌బాక్స్‌లో ఉన్న మెయిల్స్‌కు సంబంధించిన వివరాలను జీమెయిల్ ఆఫ్‌లైన్ అప్లికేషన్ స్టోర్ చేస్తుంది. మీరు ఇంటర్నెట్‌ను ఆఫ్ చేసిన ప్రతిసారీ ఇన్‌బాక్స్‌లోని వివరాలు ఆఫ్‌లైన్ అప్లికేషన్‌లోకి చేరిపోతాయి. ప్రయాణ సందర్భాల్లో ఇంటర్నెట్ సాయంలేకుండానే ఆ వివరాలను మీరు తాపీగా చెక్ చేసుకోవచ్చు.

జీమెయిల్ ఆఫ్‌లైన్ అప్లికేషన్ డౌన్‌లోడ్ లింక్:

(గమనిక: జీమెయిల్ ఆఫ్‌లైన్ అప్లికేషన్‌ను పర్సనల్ కంప్యూటర్ లేదా పర్సనల్ ల్యాప్‌టాప్‌లలో మాత్రమే యాక్సిస్ చేసుకోవటం మంచిది).

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు ‘బెస్ట్ ప్లేస్‌లు'

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X