ఇక్కడ ఫిట్నెస్ ట్రాకర్స్ మద్య తేడా మరియు మీరు మీ కోసం సరైన దానిని ఎలా ఎంచుకోవాలనేది నేను మీకు తెలుపుతాను. ఎప్పుడూ కూడా మీ అవసరాలు మరియు లైఫ్ స్టయిల్ కి అనుగుణంగా ఫిట్నెస్ ట్రాకర్ ని ఎంచుకోవాలి. చాలా ఫిట్నెస్ ట్రాకర్స్ ధర $50 మరియు $250 మద్యలో ఉంటుంది. సాధారణంగా తక్కువ ధర కలిగిన ట్రాకర్స్ డిస్ప్లే ని కలిగి వుండవు. కాబట్టి మీరు డేటాను చూడటానికి స్మార్ట్ ఫోన్ ని చూడాలి.
మీరు వాకింగ్ వంటి ప్రైమరీ యాక్టీవిటీ కోసం ఫిట్నెస్ బ్యాండ్ కావాలనుకుంటే,అనవసరమైన ఫీచర్స్ తో వున్న ఖరీదైన దానిని కొనకూడదు ,కాబట్టి మీ యాక్టివిటీస్ కి ఏ విధమైన ట్రాకర్ సరిపోతుందని మీరు ముఖ్యంగా తెలుసుకోవాలి .
ఫిట్నెస్ ట్రాకర్స్ రకాలు:
మీరు మీ యాక్టివిటీస్ మరియు స్టయిల్ కి అనుగుణంగా ట్రాకర్ ని ఎంచుకోవచ్చు. బ్రేస్ లెట్స్ మరియు వాచెస్ ని లూస్ చేయటం కష్టం కానీ క్లిప్ ఆన్స్ చాలా సులభంగా పడిపోతాయి.బ్రేస్ లెట్స్ సన్నగా తేలికగా ఉండి మరియు చిన్న డిస్ప్లే మరియు నోటిఫికెషన్స్ కోసం LED లను కలిగి ఉంటాయి.
వాచ్ ఫిట్నెస్ ట్రాకర్లు పెద్దగా స్టయిలిష్ గా ఉంటాయి . ఇవి లార్జ్ డిస్ప్లే కలిగి మరియు యాక్టీవిటీ రిపోర్ట్స్ చూడటానికి ఉపయోగపడతాయి. క్లిప్ ఆన్స్ ని మీరు రన్నింగ్ షూస్ కి అటాచ్ చేయవచ్చు . ఇవి చాలా చిన్నగా ఉంటాయి అందుకే వీటిని తొందరగా కోల్పోయే అవకాశం వుంది .
డిజైన్:
డిస్ప్లే ,వాటర్ రెసిస్టెన్స్ మరియు బ్యాండ్ వంటి ఫీచర్స్ పరిగణించాలిసిన ముఖ్యమైన అంశాలు .
డిస్ప్లే :
క్లిప్ ఆన్ ట్రాకర్స్ సాధారణంగా డేటా చూపించటానికి డిస్ప్లే కలిగి లేవు, కాబట్టి మీరు యాక్టివిటీ తెలుసుకోవటానికి ఫోన్ ఉపయోగించాలి.ఇది కొంచెం అసౌకర్యంగా ఉంటుంది.
సులభంగా మీ ఆధార్ ను పీఎఫ్ అకౌంట్‌తో లింక్ చేసుకోండిలా..
బ్యాండ్ :
ఈ డివైసెస్ సాధారణంగా థిక్ మీ అవుట్ ఫిట్ కి సరిపోయెలా పర్ఫెక్ట్ గా వుండవు. క్లిప్ ఆన్ డివైసెస్ చిన్నగా మరియు వివేకంగా ఉంటాయి.
వాటర్ ప్రూఫ్ :
సాధారణంగా , ఫిట్నెస్ ట్రాకర్స్ స్ప్లాష్ రెసిస్టెంట్ తో వాటర్ రెపిలెంట్ కోటింగ్ తో ఉంటాయి. ఈ ఫిట్నెస్ ట్రాకర్లు వాటర్ ప్రూఫ్ మరియు స్విమ్మింగ్ చేసేటప్పుడు కూడా సౌకర్యవంతంగా ఉంటాయి.
బ్యాటరీ :
ఫిట్నెస్ ట్రాకర్ యొక్క బ్యాటరీ లైఫ్ చాలా ముఖ్యం.మీరు వర్క్ అవుట్ చేసేటప్పుడు డివైస్ ని ఛార్జ్ చేయలేరు.కాబట్టి లాంగ్ బ్యాటరీ గల డివైస్ ని కన్సిడర్ చేయాలిసిఉంటుంది.
హెల్త్ మరియు ఫిట్నెస్ మోనిటరింగ్
హార్ట్ రేట్ మోనిటరింగ్, యాక్టీవిటీ డిటెక్షన్,యాక్టీవిటీ రిపోర్ట్స్ ,క్యాలోరీస్ బర్న్ , స్లీప్ మోనిటరింగ్ , స్మార్ట్ అలారం ,ఇన్ యాక్టీవిటీ అలర్ట్స్ , నోటిఫికెషన్స్ , కనెక్టివిటీ మరియు మిగతా వాటిని కూడా కన్సిడర్ చేయాలి.
Gizbot ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి.Subscribe to Telugu Gizbot.