నా పీసీలో ఇంటర్నెట్ హస్టరీని క్లీన్ చేయటం ఏలా..?

|

పర్సనల్ కంప్యూటర్ వినియోగంలో రకరకాల సందేహాలు.. వ్యక్తిగత కంప్యూటర్లను వినియోగిస్తున్న అనేక మంది యూజర్లకు తమ పీసీ నిర్వహణకు సంబంధించి రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతంటాయి. ముఖ్యంగా అనేక సందర్భాల్లో పీసీ ఇంటర్నెట్ స్పీడ్ ఒక్కసారిగా తగ్గిపోతుంటుంది.

 
నా పీసీలో ఇంటర్నెట్ హస్టరీని క్లీన్ చేయటం ఏలా..?

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఈ సమస్యకు అనే కారణాలు ఉన్నప్పటికి, మీ బ్రౌజర్‌లోని హిస్టరీ ఇంకా కుకీలను క్లీన్ చేయకపోవటాన్ని ఒక ప్రధాన కారణంగా భావించవచ్చు. కంప్యూటర్ నిర్వహణలో భాగంగా మీ కంప్యూటర్ ఇంటర్నెట్ హిస్టరీతో పాటు అవవసర ఫైళ్లను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవటం తప్పనిసరి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా వివిధ నెట్ బ్రౌజర్లకు సంబంధించి ఇంటర్నెట్ హిస్టరీని క్లీన్‌చేసే మార్గాలను మీకు సూచిస్తున్నాం. వాటి వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..........


మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ ఇంటర్నెట్ హిస్టరీని క్లీన్ చేయటం ఏలా.. ?

ఇంటర్నెట్ వినియోగానికి సంబంధించి మీ పీసీలో వినియోగిస్తున్నది మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 7 ఇంకా ఆపై వర్షన్ అయితే, మీ బ్రౌజర్‌లోని హిస్టరీని క్లీన్ చేసేందుకు ముందుగా టూల్స్ మెనూలోకి ప్రవేశించండి. ఆ తరువాత ఇంటర్నెట్ ఆప్షన్స్‌లోకి వెళ్లి, సెట్టింగ్స్ బటన్ ను క్లిక్ చేసినట్లయితే బ్రౌజింగ్ హిస్టరీని క్లీన్ చేసుకోవచ్చు.

మొజిల్లా ఫైర్‌ఫాక్స్ వెబ్‌బ్రౌజర్‌లో ఇంటర్నెట్ హిస్టరీని క్లీన్ చేయటం ఏలా..?

ఇంటర్నెట్ వినియోగానికి సంబంధించి మీ పీసీలో వినియోగిస్తున్నది మొజిల్లా ఫైర్‌ఫాక్స్ వెబ్‌బ్రౌజర్ అయితే మీ బ్రౌజర్‌లో పేరుకున్న హిస్టరీని క్లిన్ చేసేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. కీబోర్డులో Ctrl + H ఆప్షన్‌ను క్లిక్ చేయటం ద్వారా స్ర్కాన్ ఎడమవైపు హిస్టరీ బార్ కనిపిస్తుంది. తరువాతి సూచనలను అనుసరించటం ద్వారా హిస్టరీని క్లీన్ చేసుకోవచ్చు.

గూగుల్ క్రోమ్ వెబ్ బ్రౌజర్‌లో ఇంటర్నెట్ హిస్టరీని క్లీన్ చేయటం ఏలా..?

ఇంటర్నెట్ వినియోగానికి సంబంధించి మీ పీసీలో వినియోగిస్తున్నది గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అయితే మీ బ్రౌజర్‌లో నిండుకుని ఉన్న హిస్టరీని క్లీన్ చేసేందుకు టూల్ బటన్ పై క్లిక్ చేసి హిస్టరీ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. తరువాతి సూచనలను అనుసరించటం ద్వారా హిస్టరీని క్లీన్ చేసుకోవచ్చు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X