గూగుల్ క్రోమ్‌లొ క్యాచీని క్లియర్ చేయడం ఎలా, సింపుల్ గైడ్

By Anil
|

ఇంటర్నెట్‌‌లో బ్రౌజ్ చేసే ప్రతి ఒక్కరికి గూగుల్ క్రోమ్ అనేది అందరికి తెలిసిన వెబ్ బ్రౌజర్. ఇంటర్నెట్ వాడే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే బోలెడన్ని సదుపాయాలు ఈ బ్రౌజర్‌లో గూగుల్ అందుబాటులో ఉంచుతోంది. అయితే చాలా తరచుగా,బ్రౌజర్ సంబంధిత సమస్యల్లో కొన్ని cache డేటా క్లియర్ చేయడం ద్వారా పరిష్కరించబడతాయి.మీరు Google Chrome ను ఉపయోగిస్తుంటే cache డేటా ని మరియు కుకీలు మరియు ఇతర సైట్ డేటాను కాకుండా, బ్రౌజింగ్ హిస్టరీ, cache images ని చాలా సులభంగా తొలిగించవచ్చు. అయితే ఇవన్నీ తొలిగించిన తరువాత కొన్ని వెబ్సైట్లు మొదటిసారిగా మళ్లీ లోడ్ చేస్తున్నప్పుడు కొంచెం నెమ్మదిగా లోడ్ అవుతాయని గుర్తుంచుకోండి, మీరు Chrome లోని Cache డేటాను ఎలా క్లియర్ చేయడం ఎలాగో ఇప్పుడు తెలుసుకోండి.

android

ఆండ్రాయిడ్ యూజర్లు Chrome లోని cache డేటాను ఎలా తొలిగించాలో తెలుసుకోండి

1. గూగుల్ Chrome ఓపెన్ చేయగానే మీ కుడి వైపు ఫై పక్కన ఉన్న మూడు డాట్స్ ను క్లిక్ చేయండి
2. privacy నొక్కి అందులో ఉన్న బ్రౌసింగ్ డాటాను క్లియర్ చేయండి
3. Advanced అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేయగానే Time Range కనిపిస్తుంది దాని కింద చివరిలో క్లియర్ డేటా అనే ఆప్షన్ ను క్లిక్ చేయండి
4. మీరు క్లియర్ చేయాలనుకునే డేటా మీద క్లిక్ చేయండి

android

Windows లేదా MAC యూజర్లు Chrome లోని cache డేటాను ఎలా తొలిగించాలో తెలుసుకోండి

1. గూగుల్ Chrome ఓపెన్ చేయగానే మీ కుడి వైపు ఫై పక్కన ఉన్న మూడు డాట్స్ ను క్లిక్ చేయండి
2.More Tools ఓపెన్ చేయగానే Clear Browsing History వస్తుంది అది క్లిక్ చేయండి
3. ఇప్పుడు డ్రాప్-డౌన్ మెను ద్వారా Time Range ను ఎంచుకోండి. మీరు చివరి గంట, ఒక రోజు, ఒక వారం లేదా అన్ని సమయల్లా cache ను తొలగించవచ్చు.
4.Settings లో రెండు Tabs ఉంటాయి అందులో ఒకటి Basic రెండవది Advanced. Basic ద్వారా మీ బ్రౌజింగ్ చరిత్ర, కుక్కీలు మరియు Cache చేసిన images క్లియర్ చేయడానికి మీకు అనుమతినిస్తుంది . Advanced ద్వారా స్వీయపూర్తి సమాచారం, సేవ్ చేసిన passwords మీడియా licence ను తొలిగించవచ్చు.మీరు డిలీట్ చేయాలనుకునే డేటా ఫై టిక్ చేసి డేటా ను క్లియర్ చేయండి .

Best Mobiles in India

English summary
How to Clear Cache in Chrome. To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X