ట్విట్టర్ హిస్టరీని డిలీట్ చేయడం ఎలా?

Posted By: Madhavi Lagishetty

సోషల్ మీడియా...మన జీవితంలో ఒక భాగం అయ్యింది. స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్స్, బంధువులు....ఇలా మీరు సోషల్ మీడియాలో ఎలా యాక్టివ్ గా ఉన్నారో చూసి మీ మీద ఒక అంచనాకు వస్తారు. అలాంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ట్విట్టర్ కూడా ఒకటి. ట్విట్టర్లో మీరు బాగా యాక్టివ్ గా ఉన్నట్లయితే...ట్విట్టర్ హిస్టరీ గురించి కొంచెం పట్టించుకోవల్సిందే. పాత ట్విట్టర్ హిస్టరీని ఎలా డిలీట్ చేయాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మెసేజ్ లను డిలిట్ చేయడం ఎలా?

DM whacker సహాయంతో ట్విట్టర్ నుంచి డైరెక్ట్ మెసేజ్ లను డిలీట్ చేయవచ్చు. కానీ ఇలా తొలగించడానికి ఒక కండీషన్ ఉంది. మీరు మెసేజ్ లను డిలీట్ చేయడానికి టూల్ను ఉపయోగించడానికి పాత ట్విట్టర్ ఇంటర్ స్పేస్ కు మారాల్సి ఉంటుంది.

పాత ట్విట్టర్ ఇంటర్ స్పేస్ కు ఎలా మారాలో తెలుసుకోవడానికి...ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి.

స్టెప్ 1. ట్విట్టర్ లోని ఏదైనా పేజీని ఓపెన్ చేసి...పైన ఉన్న కార్నర్ లో చూడగలిగే మీ పేరుపై క్లిక్ చేయండి. పాత ట్విట్టర్కు మారండి అనే ఆప్షన్ను సెలక్ట్ చేసుకోండి.

స్టెప్ 2. ఇప్పుడు dm whacker యొక్క అధికారిక పేజీని ఓపెన్ చేయండి. మీ వెబ్ బ్రౌజర్ యొక్క బుక్ మార్క్ లోని టూల్ యొక్క బుక్ మార్కర్ లింక్ను లాగండి.

స్టెప్ 3...డైరెక్ట్ మెసేజ్ పేజీని ట్విట్టర్లో విజిట్ చేయండి. Dm whacker బుక్ మార్క్ పై డైరెక్ట్ మెసేజ్ హిస్టరీని తొలగించడానికి క్లిక్ చేయండి.

పర్సనల్ మెసేజ్, ట్వీట్లను డిలీట్ చేయడం ఎలా?

ట్విట్టర్ నుంచి మీ వ్యక్తిగత మెసేజ్ లను తొలగించాలనుకుంట...ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.

స్టెప్ 1. ట్విట్టర్ లాగింగ్ చేయండి.

స్టెప్ 2. ఇప్పుడు మీ ప్రొఫైల్లో క్లిక్ చేసి...మీరు తొలగించాల్సిన ట్వీట్ మీద హోవర్ చేయండి.

స్టెప్ 3..డిలీట్ లింక్ పై క్లిక్ చేయండి. మీరు మీ ట్విట్టర్ నుంచి మెసేజ్ లను వ్యక్తిగతంగా తొలగించాలనుకుంటే..మెసేజ్ లపై క్లిక్ చేసి....తొలగించాల్సిన మెసేజ్ లో హోవర్ చేయండి. అంతే ఇప్పుడు తొలగించు లింక్ కనబడుతుంది. మెసేజ్ లను డిలీట్ చేయడానికి దానిపై క్లిక్ చేయండి.

అన్ని ట్వీట్లను డిలీట్ చేయడం ఎలా?

ట్విట్టర్లోని ట్వీట్ హిస్టరీని twitwipe ఉపయోగించి క్లియర్ చేయవచ్చు.

స్టెప్ 1. మీ వెబ్ బ్రౌజర్ నుంచి twitwipe.comని విజిట్ చేయండి.

స్టెప్ 2. ట్విట్టర్ తో సైన్ ఇన్ అవ్వండి పై క్లిక్ చేయండి. మీ అకౌంట్ ను అథంటికేట్ చేయడానికి అవసరమైన సమచారాన్ని అందించండి.

స్టెప్ 3. ట్విట్వైప్ ఈ అకౌంట్ ట్యాప్ క్లిక్ చేయండి. దీంతో ఆటోమెటిగ్గా మీ గత ట్వీట్లన్నీ డిలీట్ అవుతాయి.

UPI ద్వారా...అమెజాన్ పేమెంట్స్!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
If you are hyperactive on Twitter, you might consider your Twitter history for obvious reasons. In this post, we will guide you through the deletion process of your Twitter history.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot