జీమెయిల్ అకౌంట్‌ను తెలుగులోకి మార్చటం ఏలా..?

Posted By:

మీ జీమెయిల్ అకౌంట్ తెలుగులో కినిపించాలంటే... సెట్టింగ్స్‌లోని లాంగ్వేజ్ ఆఫ్సన్‌ను ఎంచుకుని ప్రస్తుత డిస్‌ప్లే భాషగా తెలుగును ఎంపిక చేుసుకోవాలి. ఆ సెట్టింగ్స్‌ను సేవ్ చేసినట్లయితే మీ జీమెయిల్ అకౌంట్‌లోని వివరాలు తెలుగు భాషలో దర్శనమిస్తాయి. తిరిగి ఇంగ్లీష్‌లోకి మార్చుకోవాలనిపిస్తే మరలా సెట్టింగ్స్‌లోకి ప్రవేశించి లాంగ్వేజ్ ఆప్షన్‌ను ఎంచుకుని ప్రస్తుత డిస్‌ప్లే భాషగా ఇంగ్లీష్‌ను ఎంపిక చేసుకున్నట్లయితే మీ జీమెయిల్ అకౌంట్ వివరాలు తిరిగి ఆంగ్లంలోకి మారిపోతాయి.

జీమెయిల్ అకౌంట్‌ను తెలుగులోకి మార్చటం ఏలా..?

మొబైల్ ఫోన్‌లోనూ ‘జీమెయిల్ తెలుగు'

ఫీచర్ ఫోన్ బ్రౌజర్ ద్వారా జీమెయిల్ అకౌంట్‌ను కలిగి ఉన్న తెలుగు వారు ఇక పై తమ మాతృభాషలోనే జీమెయిల్‌ను యాక్సిస్ చేసుకోవచ్చు. ఫీచర్ ఫోన్‌లలో జీమెయిల్ అకౌంట్‌లను నిర్వహిస్తున్న భారతీయులు తమతమ ప్రాంతీయ భాషల్లో జీమెయిల్‌ను యాక్సిస్ చేసుకునేందుకు వీలుగా గూగుల్ 6 ప్రాంతీయ భాషల్లో జీమెయిల్‌ వర్షన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

మొబైల్ ఫోన్‌ల‌లోని జీమెయిల్ అకౌంట్‌లను సపోర్ట్ చేసే ప్రాంతీయ భాషల జాబితాలో బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మరాఠీ, తమిళ ఇంకా తెలుగు వర్షన్‌లు ఉన్నాయి. వచ్చే రెండేళ్ల కాలంలో 50 కోట్ల మంది కొత్తగా ఇంటర్నెట్‌కు పరిచయమయ్యే అవకాశముందని

గూగుల్ విశ్లేషిస్తోంది. ఇంటర్నెట్ వినియోగం మొబైల్ ఫోన్‌ల ద్వారా ఉధృతమవుతున్న నేపధ్యంలో ప్రాంతీయ భాషలను పరిచయం చేయటం శుభపరిణామంగా గూగుల్ భావిస్తోంది. భాష ఎంపికలో భాగంగా సదరు యూజర్ సెటింగ్ అప్షన్ లోకి ప్రవేశించి భాషను ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot