రూ.500తో గెలాక్సీ నోట్ 9ను కంప్యూటర్‌లా మార్చేసుకోవచ్చు

సామ్‌సంగ్ నుంచి ఇప్పటి వరకు మార్కెట్లో లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో గెలాక్సీ నోట్ 9 ఎంతో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది.

By GizBot Bureau
|

సామ్‌సంగ్ నుంచి ఇప్పటి వరకు మార్కెట్లో లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో గెలాక్సీ నోట్ 9 ఎంతో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. కేవలం ఒక కేబుల్ సహాయంతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంప్యూటర్‌లా కన్వర్ట్ చేసుకునే అవకాశాన్ని సామ్‌సంగ్ కల్పిస్తోంది. స్మార్ట్‌ఫోన్ కంప్యూటర్ కలను నిజం చేసే క్రమంలో సామ్‌సంగ్ 2016లోనే DeX dock అనే కంప్యూటింగ్ స్టేషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

 

డెక్స్ డాక్ పీసీ ఎక్స్‌పీరియన్స్‌..

డెక్స్ డాక్ పీసీ ఎక్స్‌పీరియన్స్‌..

గెలాక్సీ ఎస్8తో పాటుగా ప్రపంచానికి పరిచయమైన ఈ డాక్ అప్పటి నుంచి అప్‌డేట్ అవుతూ వస్తోంది. డెక్స్ డాక్ పీసీ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరుగుపరిచే క్రమంలో 2017లో ట్రాక్‌ప్యాడ్ తరహా ఫీచర్‌ను గెలాక్సీ ఎస్9తో సామ్‌సంగ్ అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే డెక్స్ డాక్‌ను కొనుగోలు చేసేందుకు రూ.10,000 వరకు సామ్‌సంగ్ యూజర్లు వెచ్చించాల్సి రావటంతో ఈ ప్రొడక్టుకు అంతగా పాపులారిటీ లభించలేదు.

 

 

ఫోన్‌లోనే ఇంటిగ్రేట్ అయి వస్తోంది..

ఫోన్‌లోనే ఇంటిగ్రేట్ అయి వస్తోంది..

ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్నసామ్‌సంగ్ DeX dockను ఏకంగా ఫోన్‌లోనే ఇంటిగ్రేట్ చేసింది. దీంతో గెలాక్సీ నోట్ 9 యూజర్లు రూ.500 వెచ్చించి యూఎస్బీ టైప్-సీ లేదా హెచ్‌డిఎమ్ఐ అడాప్టర్‌ను కొనుగోలు చేయటం ద్వారా తమ డివైస్‌ను కంప్యూటర్‌లా మార్చుకునే వీలుంటుంది. యూఎస్బీ టైప్-సీ లేదా హెచ్‌డిఎమ్ఐ అడాప్టర్ ద్వారా గెలాక్సీ నోట్ 9ను మానిటర్‌కు కనెక్ట్ చేయటం ద్వారా పోర్టబుల్ కంప్యూటింగ్‌ను ఆస్వాదించే వీలుంటుంది. ఇదే సమయంలో గెలాక్సీ నోట్ 9ను ట్రాక్‌ప్యాడ్‌లా వినియోగించుకుంటూ మౌస్ సహాయంతో వర్చువల్ కీబోర్డును ఆపరేట్ చేసుకోవచ్చు.

 

 

సామ్‌సంగ్ డెక్స్ ప్యాడ్ కావాలంటే రూ.8,000
 

సామ్‌సంగ్ డెక్స్ ప్యాడ్ కావాలంటే రూ.8,000

గెలాక్సీ నోట్ 9 ద్వారా ప్రొఫెషనల్ కంప్యూటింగ్‌ను మీరు ఆస్వాదించాలనుకుంటున్నట్లయితే సామ్‌సంగ్ డెక్స్ ప్యాడ్ యాక్సెసరీని తప్పనిసరిగా మీరు కొనుగోలు చేయవల్సి ఉంటుంది. ఇండియన్ మార్కెట్లో ఈ యాక్సెసరీ ధర రూ.8,000గా ఉంటుంది. ఈ ప్యాడ్ రెండు యూఎస్బీ పోర్టులతో పాటు ఒక హెచ్‌డిఎమ్ఐ పోర్టును కలిగి ఉంటుంది.

 

 

కంప్యూటింగ్‌‌ మరింత సలువు..

కంప్యూటింగ్‌‌ మరింత సలువు..

ఇందులో ఒక యూఎస్బీ పోర్టుకు కీబోర్డు లేదా మౌస్‌ను కనెక్ట్ చేసుకుని మరొక పోర్టుకు ఎక్స్‌టర్నల్ హార్డ్ డ్రైవ్ ను కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. హెచ్‌డిఎమ్ఐ పోర్టుకు మానిటర్ కేబుల్‌ను కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధమైన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకోవటం ద్వారా కంప్యూటింగ్‌‌ను మరింత సులభతరం చేయవచ్చని సామ్‌సంగ్ భావిస్తోంది.

Best Mobiles in India

English summary
Samsung's all-new phablet Galaxy Note 9 has a unique capability that no other flagship smartphone launched so far offers.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X