వాట్సాప్ లో ఇలాంటి మెసేజ్ వచ్చిందా.... జాగ్రత్త....

|

సైబర్ క్రైమినల్స్ వినియోగదారులను మోసగించి వారి బ్యాంక్ అకౌంట్ల నుండి క్యూఆర్ కోడ్ స్కామ్ ద్వారా డబ్బును దొంగిలిస్తున్నారు. ఈ కుంభకోణంలో మోసగాళ్ళు పేమెంట్స్ చేయడానికి మరియు డబ్బును పంపించడానికి బాధితులకు తమ క్యూఆర్ కోడ్‌లను సాధారణంగా వాట్సాప్ ద్వారా షేర్ చేసుకుంటారు.

ఆన్‌లైన్‌
 

ప్రస్తుత కాలంలో నగరాల్లో ఇటువంటి కేసులు అకస్మాత్తుగా పెరిగాయి. చాలా సందర్భాలలో ఆన్‌లైన్‌లో ఫర్నిచర్ లేదా ఇతర వస్తువులను అమ్మడం కోసం ప్రకటనలను పోస్ట్ చేసిన వారిలో మోసగాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇటీవల సైబరాబాద్ పోలీసులు ఇలాంటి మోసాల గురించి పౌరులకు హెచ్చరికను కూడా జారీచేశారు. గత నెలలో గురుగామ్ నుండి ఇలాంటి కేసులు అనేకం నమోదయ్యాయి. ఈ QR కోడ్ మోసం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

జియోను మించిన BSNL న్యూ ఇయర్స్ ఆఫర్స్....

సైబర్ నేరస్థులు

**** సైబర్ నేరస్థులు డబ్బును స్వీకరించడానికి బాధితుడి యొక్క బ్యాంక్ అకౌంట్ సమాచారాన్ని తమతో పంచుకోవాలని అడుగుతారు.

**** మోసగాళ్ళు తమ అకౌంట్ లోకి డబ్బును స్వీకరించడానికి QR కోడ్‌ను వాట్సాప్ ద్వారా షేర్ చేస్తారు.

ఆన్‌లైన్‌ సేల్స్ కోసం ఇండియాలో ఇ-స్టోర్ ను ప్రారంభించిన ACER

PIN

**** ఇది వాస్తవానికి డబ్బును సేకరించడానికి అభ్యర్థన మాత్రమే. PIN ను స్కాన్ చేసి నమోదు చేయడం ద్వారా బాధితుడు డబ్బును పంపవలసిందిగా అభ్యర్థనను పంపుతాడు.

**** అతను / ఆమె QR కోడ్‌ను స్కాన్ చేసి పిన్‌లోకి ప్రవేశించిన తర్వాత బ్యాంకు అకౌంట్ నుండి మొత్తం డబ్బును దొంగలించడం జరుగుతుంది.

ఒకే సారి మూడు ఫోన్లను ఛార్జ్ చేసే షియోమి 60W ఫాస్ట్ ఛార్జర్‌

QR కోడ్‌
 

**** పౌరులు తప్పనిసరిగా గుర్తుంచుకోవలసిన ఒక విషయం ఎక్కడైనా ఏదైనా పేమెంట్ చేయడానికి లేదా డబ్బును స్వీకరించడానికి మాత్రమే QR కోడ్‌ను స్కాన్ చేయాలి. అంతే కానీ మరెక్కడా QR కోడ్‌ను ఉపయోగించరాదు.

**** QR కోడ్ అనేది సాధారణ ఇంటర్నెట్ లింక్ లాంటిది. దాని మూలం గురించి మీకు తెలియకపోతే దానిపై క్లిక్ చేయవద్దు.

Most Read Articles
Best Mobiles in India

English summary
How cybercriminals use WhatsApp to steal Your money

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X