ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించుకోబడుతోన్న ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యూప్‌లలో వాట్సాప్ ఒకటి. ఈ ప్లాట్‌ఫామ్‌ను దేశవ్యాప్తంగా 100 కోట్లకు పైగా యూజర్లు వినియోగించుకుంటున్నారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్ ప్లాట్‌ఫామ్‌లతో పాటు డెస్క్‌టాప్ కంప్యూటర్లలో కూడా ఈ మెసేజింగ్ సర్వీసును ఉపమోగించుకోవచ్చు. ఈ యాప్ మార్కెట్లో లాంచ్ అయిన నాటి నుంచి ఇప్పటి వరకు అనేక విప్లవాత్మక మార్పులు చోటుచేసుకన్నాయి.
వాట్సాప్ ఈ మధ్య కాలంలో లాంచ్ చేసిన కీలక ఫీచర్లలో 'Delete for Everyone’ ఒకటి. ఈ ఫీచర్ ద్వారా పొరపాటున పంపిన మెసేజ్‌లను వెనక్కితీసుకునే వీలుంటుంది. మెసేజ్ పంపిన 7 నిమిషాల్లోపు మాత్రమే రీకాల్ చేసే వీలుంటుంది. అయితే, ఇప్పుడు మేము సూచించబోతోన్న ఓ ట్రిక్ ద్వారా 7 నిమిషాల తరువాత కూడా అవతలి వ్యక్తికి పంపిన వాట్సాప్ మెసెజ్‌లను డిలీట్ చేసుకునే వీలుంటుంది. ఆ ప్రొసీజర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...
స్టెప్ 1 :
ముందుగా మీ ఫోన్‌కు సంబంధించిన ఇంటర్నెట్ కనెక్షన్‌ను పూర్తిగా టర్నాఫ్ చేసుకోండి. ఆ తరువాత సెట్టింగ్స్ ప్యానల్‌లోకి వెళ్లండి.
స్టెప్ 2 :
సెట్టింగ్స్‌లోని యాప్స్ సెక్షన్‌లోకి వెళ్లి వాట్సాప్‌ను సెలక్ట్ చేసుకుని Force Stop ఆప్షన్ పై టాప్ చేయండి.
స్టెప్ 3 :
పైన పేర్కొన్న ప్రాసెస్ విజయవంతంగా పూర్తి అయిన తరువాత మరొకసారి సెట్టింగ్స్‌లోకి వెళ్లి 'ఆటోమెటిక్ డేట్ అండ్ టైమ్’ అప్‌డేట్ ఆప్షన్‌ను డిసేబుల్ చేసుకోండి.
స్టెప్ 4 :
తదుపరి స్టెప్‌లో భాగంగా ఫోన్‌లోని టైమ్ అలానే డేట్‌ను వాట్సాప్ చాట్‌లో మెసేజ్ పంపిన సమయం అలానే తేదీకి మార్చుకోండి.
స్టెప్ 5 :
తేదీ అలానే సమాయాన్ని అడ్జస్ట్ చేసుకున్న తరువాత డిలీట్ చేయలనుకుంటోన్న మెసేజ్ పై కొద్ది సెకన్ల పాటు హోల్డ్ చేసిన ఉంచినట్లయితే డిలీట్ ఆప్షన్ డస్ట్‌బిన్ ఐకాన్‌లో మీకు కనిపిస్తుంది. ఈ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే 'Delete For Me’, 'Delete For Everyone’ పేర్లతో రెండు ఆప్షన్‌లు మీకు కనిపిస్తాయి. అందులో 'Delete For Everyone’ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్నట్లయితే మెసేజ్ పూర్తిగా డిలీట్ కాబడుతుంది. ఈ ప్రాసెస్ పూర్తయిన తరువాత ఫోన్ డేట్ అలానే టైమ్ సెట్టింగ్‌ను సాధారణ స్థితికి తీసుకువచ్చేయండి.
అమెజాన్‌కి పోటీగా Flipkart Republic Day Sale, భారీ డిస్కౌంట్లు షురూ..
Gizbot ఇన్‌స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి.Subscribe to Telugu Gizbot.