మీ ఫోన్‌లో Google search హిస్టరీని డిలీట్ చేయటం ఎలా..?

Posted By: BOMMU SIVANJANEYULU

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల బ్రౌజింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింతగా మెరుగుపరిచే క్రమంలో సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ తన Google search appను మరింతగా ఆధునీకరిస్తోన్న విషయం తెలిసిందే. గూగుల్ కొన్ని నెలల క్రితం తన సెర్చ్ యాప్‌కు సంబంధించి ఓ అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఆ అప్‌డేట్ తరువాత నుంచి మీరు గమనించినట్లయితే, యూజర్ సెర్చ్ హిస్టరీకి సంబంధించిన రిజల్ట్స్‌ను స్ర్కీన్ షాట్స్ రూపంలో గూగల్ భద్రపరచటం మొదలుపెట్టింది.

మీ ఫోన్‌లో Google search హిస్టరీని డిలీట్ చేయటం ఎలా..?

ఈ స్ర్కీన్ షాట్స్‌ను మీరు చూడాలనుకుంటున్నట్లయితే గూగుల్ సెర్చ్ యాప్‌లోకి వెళ్లి, మెయిన్ స్ర్కీన్ క్రింది భాగంలో కనిపించే క్లాక్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే, మీ సెర్చ్ హిస్టరీకి సంబంధించిన స్ర్కీన్ షాట్స్ కనిపిస్తాయి.

మీకు కావల్సిన తేదీకి సంబంధించిన సెర్చ్ హిస్టరీని ఇక్కడ పొందే వీలుంటుంది. గూగుల్ అందిస్తోన్న ఈ ఫీచర్‌ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ ఫీచర్‌ను బేష్ అంటుంటే, మరికొందరు మాత్రం ప్రైవసీకి పెద్ద ముప్పు అని చెబుతున్నారు.

గూగల్ సెర్చ్ యాప్‌లో సేవ్ కాబడుతోన్న ఈ స్ర్కీన్‌షాట్‌లను ప్రైవసీ ముప్పుగా భావిస్తోన్న యూజర్లు ఓ సింపుల్ హ్యాక్‌ను ప్రయోగించటం ద్వారా స్ర్కీన్‌షాట్‌లను డిసేబుల్ చేయటంతో పాటు డిలీట్ కూడా చేయవచ్చు.

స్ర్కీన్‌షాట్‌లను డిలీట్ చేసే క్రమంలో ముందుగా గూగల్ సెర్చ్ యాప్‌ను ఓపెన్ చేసి మెయిన్ స్ర్కీన్ పై కనిపించే హిస్టరీ ఐకాన్ పై టాప్ చేయండి. వెంటనే గత ఏడు రోజులకు సంబంధించిన సెర్చ్ ఫలితాలు స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతాయి. వీటిలో ఒక్కో స్ర్కీన్‌షాట్‌ను స్వైప్ అప్ చేయటం ద్వారా అవి డిలీట్ కాబడతాయి.

ఈ ఫీచర్‌నే శాస్వుతంగా డిసేబుల్ చేయాలనుకుంటున్నట్లయితే యాప్ మెయిన్ స్ర్కీన్‌లోకి వెళ్లి టాప్ లెఫ్ట్ కార్నర్‌లో కినిపించే మూడు సమాంతర లైన్స్ (three horizontal lines) పై క్లిక్ చేయండి. ఇప్పుడు మెయిన్ మెనూ కనిపిస్తుంది. మెనూలోని సెట్టింగ్స్ ఆప్షన్‌లోకి వెళ్లి Accounts & Privacy పై టాప్ చేయండి. ఇప్పుడు మరో స్ర్కీన్ ఓపెన్ అవుతుంది. అక్కడ కనిపించే Enable Recent Optionను టర్నాఫ్ చేసుకోవటం ద్వారా సెర్చ్ హిస్టరీకి సంబంధించిన స్ర్కీన్ షాట్స్ అనేవే స్టోర్ అవ్వవు.

మీ ఫోన్‌లో Google search హిస్టరీని డిలీట్ చేయటం ఎలా..?

ఇంటర్నెట్ నుంచే పూర్తిగా డిలీట్ అవ్వాలనుకుంటున్నారా..?

ఇంటర్నెట్‌లో మీకు సంబంధించిన డేటాను క్లియర్ చేయటమనేది పూర్తిగా సాధ్యం కాకపోయినప్పటికి 95% వరకు డేటాను మీరు క్లియర్ చేసుకునే అవకాశముంది. ఇప్పటికే మీరు ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్ వంటి ప్రముఖ సోషల్ సైట్‌లలో అకౌంట్‌లను ఓపెన్ చేసుకుని ఉండి ఉంటారు. మీరు ఇంటర్నెట్ నుంచి పూర్తిగా నిష్ర్కమించే క్రమంలో ఈ అకౌంట్‌ల నుంచి పూర్తిగా డీయాక్టివేట్ కావల్సి ఉంటుంది.

కొన్ని సోషల్ మీడియా అకౌంట్‌ల నుంచి పూర్తిగా డీలిట్ అవ్వటం సాధ్యపడదు. కాబట్టి మీ సమాచారం పూర్తిగా డిలీట్ అయ్యేందుకు ఆస్కారం ఉండదు. ఓ ఆన్‌లైన్ అకౌంట్‌ను పూర్తిగా డిలీట్ చేయాలంటే బలమైన కారణాన్ని చూపాల్సి ఉంటుంది. కాబట్టి, ముందస్తుగా జాగ్రత్తగా మీ అకౌంట్స్ తాలుకా చాటింగ్ హిస్టరీని పూర్తిగా క్లియర్ చేసేయండి.

ఇంటర్నెట్‌లో మీకంటూ వ్యక్తిగత బ్లాగ్స్ లేదా వెబ్‌సైట్‌లు ఉన్నట్లయితే వాటిని పూర్తిగా డిలీట్ చేసే ప్రయత్నం చేయండి. మీకు సంబంధించిన వివరాలను కస్టమర్ డేటాబేస్‌లో ఫీడ్ చేసే అవకాశముంది. ఈ డేటా ఇంటర్నెట్‌లో కనిపించే అవకాశం ఉంది కాబట్టి సంబంధిత ప్రొవైడర్‌ను సంప్రదించి, మీ తాలుకా డేటాను తొలగించమని చెప్పండి. మీ తాలుకా మెయిల్ అకౌంట్‌లను పూర్తిగా డీయాక్టివేట్ చేసి, అన్ని మెయిలింగ్ లిస్ట్‌లను క్యాన్సిల్ చేసుకోండి.

షాకిస్తోన్న Redmi Note 5 స్పెసిఫికేషన్స్!

గూగుల్, యాహూ, బింగ్ వంటి ప్రముఖ సెర్చ్ ఇంజిన్‌లలో మీ బ్రౌజింగ్ హిస్టరీని పూర్తిగా క్లియర్ చేసుకోండి. మీ కంప్యూటర్‌లో ఇంటర్నెట్ కనెక్షన్ తాలుకా హిస్టరీ అలానే కుకీలను తొలగించటంతో పాటు ఇంటర్నెట్ ప్రోగ్రామ్‌ను రిమూవ్ చేయండి.

ఇంటర్నెట్‌లో మీరు రాసిన న్యూస్ ఆర్టికల్స్, మీరు చేసిన కామెంట్స్, బ్లాగ్ ఐటమ్స్ ఇంకా ఆడియో ఫైల్స్‌ను తొలిగించటమనేది అసాధ్యం. అలానే మీరు ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని కూడా తొలగించలేరు.

English summary
How to delete your Google search history on Android. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot