ఇంటర్నెట్ నుంచి పూర్తిగా డిలీట్ అవ్వాలనుకుంటున్నారా..?

ఇంటర్నెట్ నుంచి పూర్తిగా విముక్తి పొందాలనుకుంటున్నారా..? అయితే ఈ విషయాలు తెలుసకోండి. మీలోని కళాత్మకతకు మరింత సానపెట్టాలనుకుంటున్నట్లయితే, సాంకేతికతకు స్వస్తిపలికి ప్రకృతితో స్నేహం చేయండంటూ ఇటీవల ఓ సర్వే పిలుపునచ్చింది.

Read More : అత్యంత రహస్యంగా మైక్రోసాఫ్ట్ ఫోన్!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇంటర్నెట్‌లో మీకు సంబంధించిన డేటా..

టెక్నాలజీ పై ఆధారపడటం మానకుని సహజసిద్ధమైన ప్రకృతిలో సహవాసం చేయటం ద్వారా మేధస్సు మరింత ధృడపడగలదని విశ్లేషకులు అభిప్రాయడుతున్నారు. ఇంటర్నెట్‌లో మీకు సంబంధించిన డేటాను క్లియర్ చేయటమనేది పూర్తిగా సాధ్యం కాకపోయినప్పటికి 95% వరకు డేటాను మీరు క్లియర్ చేసుకునే అవకాశముంది. ఆ ప్రక్రియను ఇప్పుడు చూద్దాం..

ఇంటర్నెట్ మాద్యమంగా..

ఇప్పటివరకు మీరు ఇంటర్నెట్ మాద్యమంగా అనేక ఆన్‌లైన్ అకౌంట్‌లను ఓపెన్ చేసి ఉంటారు. వీటి ద్వారా అనేక కార్యకలాపాలు నిర్వహించి ఉంటారు. ఈ క్రమంలో అనేక పరిచయాలను మీరు పెంచుకుని ఉండొచ్చు. ఒక్కసారిగా వీటిని తెంచుకునే ముందు ఆలోచించటం మంచిది. ఎందుకంటే, ఒక్కసారి క్లోజ్ చేసిన అకౌంట్‌ను అదే పేరుమీద మళ్లీ రీస్టార్ట్ చేయటమనేది కష్టమైన ప్రక్రియ.

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సోషల్ మీడియా అకౌంట్స్..

ఇప్పటికే మీరు ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్ వంటి ప్రముఖ సోషల్ సైట్‌లలో అకౌంట్‌లను ఓపెన్ చేసుకుని ఉండి ఉంటారు. మీరు ఇంటర్నెట్ నుంచి పూర్తిగా నిష్ర్కమించే క్రమంలో ఈ అకౌంట్‌ల నుంచి పూర్తిగా డీయాక్టివేట్ కావల్సి ఉంటుంది.

బలమైన కారణాన్ని చూపాల్సి ఉంటుంది

కొన్ని సోషల్ మీడియా అకౌంట్‌ల నుంచి పూర్తిగా డీలిట్ అవ్వటం సాధ్యపడదు. కాబట్టి మీ సమాచారం పూర్తిగా డిలీట్ అయ్యేందుకు ఆస్కారం ఉండదు. ఓ ఆన్‌లైన్ అకౌంట్‌ను పూర్తిగా డిలీట్ చేయాలంటే బలమైన కారణాన్ని చూపాల్సి ఉంటుంది. కాబట్టి, ముందస్తుగా జాగ్రత్తగా మీ అకౌంట్స్ తాలుకా చాటింగ్ హిస్టరీని పూర్తిగా క్లియర్ చేసేయండి.

బ్లాగ్స్ లేదా వెబ్‌సైట్‌లు ఉన్నట్లయితే..

ఇంటర్నెట్‌లో మీకంటూ వ్యక్తిగత బ్లాగ్స్ లేదా వెబ్‌సైట్‌లు ఉన్నట్లయితే వాటిని పూర్తిగా డిలీట్ చేసే ప్రయత్నం చేయండి.

మీ ఫోన్ కంపెనీ..

 మీకు సంబంధించిన వివరాలను కస్టమర్ డేటాబేస్‌లో ఫీడ్ చేసే అవకాశముంది. ఈ డేటా ఇంటర్నెట్‌లో కనిపించే అవకాశం ఉంది కాబట్టి సంబంధిత ప్రొవైడర్‌ను సంప్రదించి, మీ తాలుకా డేటాను తొలగించమని చెప్పండి.

మెయిల్ అకౌంట్‌లను పూర్తిగా..

మీ తాలుకా మెయిల్ అకౌంట్‌లను పూర్తిగా డీయాక్టివేట్ చేసి, అన్ని మెయిలింగ్ లిస్ట్‌లను క్యాన్సిల్ చేసుకోండి. గూగుల్, యాహూ, బింగ్ వంటి ప్రముఖ సెర్చ్ ఇంజిన్‌లలో మీ బ్రౌజింగ్ హిస్టరీని పూర్తిగా క్లియర్ చేసుకోండి.

అవి మీరు తొలగించలేరు!

మీ కంప్యూటర్‌లో ఇంటర్నెట్ కనెక్షన్ తాలుకా హిస్టరీ అలానే కుకీలను తొలగించటంతో పాటు ఇంటర్నెట్ ప్రోగ్రామ్‌ను రిమూవ్ చేయండి. ఇంటర్నెట్‌లో మీరు రాసిన న్యూస్ ఆర్టికల్స్, మీరు చేసిన కామెంట్స్, బ్లాగ్ ఐటమ్స్ ఇంకా ఆడియో ఫైల్స్‌ను తొలిగించటమనేది అసాధ్యం. అలానే మీరు ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని కూడా తొలగించలేరు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to Delete Yourself from the Internet. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot