కంప్యూటర్ వైరస్ ఏలా వ్యాప్తిచెందుతుంది..?

Posted By:

కంప్యూటర్ ఇంకా సెల్‌ఫోన్‌లు సంకేతాలతో కూడిన ప్రోగ్రామింగ్ ఆధారంగా స్పందిస్తాయి. టెక్నికల్ పరిభాషలో చెప్పాలంటే కంప్యూటర్ ఇంకా సెల్‌ఫోన్‌లలో రెండు రకాల ఫీచర్లు ఉంటాయి. వాటిలో ఒకటి హార్డ్‌వేర్ మరొకటి సాఫ్ట్‌వేర్. కంప్యూటర్ ఇంకా సెల్‌ఫోన్‌లలో చూడడానికి అనువుగా ఉండే భాగాలనే హార్డ్‌వేర్‌గా, చూడటానికి వీలుకాని ప్రోగ్రామ్‌లను సాఫ్ట్‌వేర్‌గా పిలుచుకుంటున్నాం. సాఫ్ట్‌వేర్ పోగ్రామింగ్ వ్యవస్థ సెల్‌ఫోన్ ఇంకా కంప్యూటర్‌లకు జీవం లాంటిది.

కంప్యూటర్ వైరస్ ఏలా వ్యాప్తిచెందుతుంది..?

కొందరు ఆకతాయలు సెల్‌ఫోన్ ఇంకా కంప్యూటర్‌లలోని సాఫ్ట్‌‍వేర్ ప్రోగ్రామింగ్‌లను టార్గెట్ చేసుకుని మెసపూరిత అంశాలతో కూడిన అవాంఛనీయమైన సాఫ్ట్‌వేర్‌లను సృష్టించి వీటిని ఇంటర్నెట్ ద్వారా విస్తరింపచేస్తారు. ఈ వైరస్‌లు ఒక పరికరం నుంచి మరో పరికరంలోకి వ్యాపిస్తూ సదరు పరికరాలను పనితీరును దెబ్బతీస్తాయి. రోగాలను వ్యాప్తి చేసే వైరస్‌లు ఏలాగైతే ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతాయో అలాగే కంప్యూటర్ వైరస్‌లు కూడా ఒక పీసీ నుంచి మరొక పీసీలకు వ్యాపిస్తాయి.

ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన నేపధ్యంలో పర్సనల్ కంప్యూటర్లతో పాటు ల్యాప్‌టాప్‌ల వినియోగం పెరిగిపోయింది. ఈ క్రమంలో వీటి పై దాడిచేసే వైరస్‌లు ముప్పు అధికమైంది. వైరస్ వ్యాప్తిచెందిన పీసీలో పనితీరు మందగిస్తుంది.. అప్లికేషన్‌లు ఆలస్యంగా స్పందిస్తాయి. ఈ సమస్య మరింత ఉధృతమయితే పీసీని రన్ చెయ్యటం కష్టతరమవుతుంది. ఈ వైరస్‌లను నియంత్రించే కమ్రంలో అనేకమైన యాంటీ వైరస్ ప్రోగ్రామ్‌లు పుట్టుకొచ్చాయి. ఈ సాఫ్ట్‌వేర్‌లను మందుగానే పీసీలో లోడ్ చేసుకున్నట్లయితే వివిధ వైరస్‌ల ముప్పునుంచి బయపడొచ్చు. అంతర్జాలంలో ఉచితంగా లభ్యమవుతున్న ఉత్తమ - 13 ఉచిత యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌లు మీ పీసీ కోసం....క్లిక్ చేయండి

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot