మీ మొబైల్ నుంచి ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా..?

Written By:

యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఇటీవలే 'ఎంఆధార్ (mAadhaar)' పేరిట ఆధార్ యాప్‌ను విడుదల చేసిన విషయం విదితమే. ఈ యాప్ ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫ్లాట్ ఫాం మీద లభిస్తోంది. దీన్ని ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇకపై మొబైల్ యూజర్లు మొబైల్ ద్వారా ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చూద్దాం.

షియోమికి షాక్, ఒకేసారి 3 ఫోన్లతో..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్టెప్ 1

యాప్‌ డౌన్‌లోడ్ అయిన తరువాత దాన్ని ఓపెన్ చేయగానే మొదట యాప్‌కు ఓ పాస్‌వర్డ్‌ను అడుగుతుంది. 8 నుంచి 12 క్యారెక్టర్లు వచ్చే విధంగా యూజర్లు పాస్‌వర్డ్ సెట్ చేసుకుని ముందుకు వెళ్లాలి.

స్టెప్ 2

అనంతరం వచ్చే సెక్షన్‌లో యూజర్లు తమ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. లేదంటే ఆధార్ క్యూఆర్ కోడ్‌ను కూడా స్కాన్ చేసి ముందుకు సాగవచ్చు.

ఓటీపీ కన్‌ఫర్మేషన్

తరువాత వచ్చే విభాగంలో ఓటీపీ కన్‌ఫర్మేషన్ అడుగుతుంది. మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే ఎస్‌ఎంఎస్‌ను అందులో ఎంటర్ చేయాలి.

ఆధార్ కార్డు డిస్‌ప్లే

అనంతరం వచ్చే సెక్షన్‌లో ముందు క్రియేట్ చేసుకున్న యాప్ పాస్‌వ‌ర్డ్‌ను ఎంట‌ర్ చేయాలి. ఆపైన వ‌చ్చే విభాగంలో ఆధార్ కార్డు డిస్‌ప్లే అవుతుంది. దానిపై క్లిక్ చేసి మ‌ళ్లీ యాప్ పాస్‌వ‌ర్డ్‌ను ఎంట‌ర్ చేయాలి.

ట‌చ్ చేస్తే ఆధార్ కార్డు రెండో వైపు

అనంత‌రం మీ ఆధార్ కార్డు తెర‌పై ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది. దాన్ని ట‌చ్ చేస్తే ఆధార్ కార్డు రెండో వైపు కూడా క‌నిపిస్తుంది. ఈ క్ర‌మంలో ఫోన్ తెరను స్క్రీన్ షాట్ తీయ‌డం ద్వారా మీ ఆధార్ కార్డును ఫోన్‌లోకి ఇమేజ్ రూపంలో సేవ్ చేసుకోవ‌చ్చు.

ఎం ఆధార్ యాప్ లింక్ ఇదే

https://play.google.com/store/apps/details?id=in.gov.uidai.mAadhaarPlus

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to Download and Use mAadhaar App- Aadhaar Card on your Mobile Read more at Gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting