Instagram ప్రొఫైల్ ఫోటోలను ఫుల్ రిసల్యూషన్‌తో డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..?

|

సోషల్ మీడియాలో ఫోటో షేరింగ్‌కు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా చిత్రీకరించిన ఫోటోలను సెకన్ల వ్యవధిలో సోషల్ మీడియా యప్‌లలో పోస్ట్ చేసేస్తున్నారు. ఫోటోలను మరింత అందంగా తీర్చిదిద్దటంలో ఫోటో ఎడిటింగ్ యాప్స్ దోహదపడతాయి. ఫోటోలను పూర్తిస్థాయిలో ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయటంలో ఇన్‌స్టాగ్రామ్ (Instagram) యాప్ దోహదపడుతోంది.

How to download Instagram profile pictures in full resolution

సెప్టంబర్ 2017లో రివీల్ అయిన పలు లెక్కల ప్రకారం ఇన్‌స్టాగ్రామ్ అప్లికేషన్‌కు ప్రపంచవ్యాప్తంగా 800 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు. అక్టోబర్ 2015 నాటికి ఈ యాప్‌లో మొత్తం 40 బిలియన్ల ఫోటోలు అప్‌లోడ్ అయ్యాయి. ఏప్రిల్ 2017 నాటికి ఇన్‌స్టాగ్రామ్ డైరెక్ట్‌ను 375 మిలియన్ల మంది యాక్టివ్ యూజర్లను కలిగి ఉంటుంది. జూన్ 2017 నాటికి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ సదుపాయాన్ని 250 మిలియన్ యూజర్లు యాక్టివ్‌గా ఉపయోగించుకుంటున్నారు.

సాధారణంగా మొబైల్ ఫోన్‌లతో చిత్రీకరించిన ఫోటోలు దీర్ఘచతురస్రాకరంలో ఉంటాయి. ఇన్‌స్టాగ్రామ్ అప్లికేషన్ ఈ ఫోటోలను చతురస్రాకారంలోకి మార్చేస్తుంది. తరువాతి క్రమంలో ఫోటోను నచ్చిన విధంగా ఎడిట్ చేసుకుని మిత్రులకు షేర్ చేసుకోవచ్చు. నేటి ప్రత్యేక కథనంలో బాగంగా Instagram ప్రొఫైల్ ఫోటోలను ఏ మాత్రం క్వాలిటీ దెబ్బతినకుండా ఫుల్ రిసల్యూషన్‌తో డౌన్‌లోడ్ చేసుకునే ప్రొసీజర్‌ను మీకు సూచించటం జరుగుతోంది..

స్టెప్ 1 : ముందుగా 'InstaPP' అనే అప్లికేషన్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని మీ
ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి.

స్టెప్ 2 : ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ విజయవంతంగా పూర్తై యాప్ లాంచ్ అయిన తరువాత హోమ్ పేజీలో సెర్చ్ బార్ పేరుతో ఓ ఆప్షన్ మీకు కనిపిస్తుంది.

స్టెప్ 3 :
ఆ సెర్చ్ బార్‌లో మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటోన్న Instagram ఫోటోకు సంబంధించి ప్రొఫైల్ నేమ్‌ను ఎంటర్ చేసినట్లయితే డౌన్‌లోడింగ్ ప్రాసెస్ మొదలవుతుంది.

స్టెప్ 4 : ఇమేజ్ పూర్తిగా డౌన్‌లోడ్ అయిన తరువాత మీకు కావల్సిన ఫైల్ లేదా ఫోల్డర్‌లో ఆ ఇమేజ్‌ను భద్రపరుచుకోవచ్చు.

విండోస్ లేదా మ్యాక్ పీసీలోకి Instagram ప్రొఫైల్ ఫోటోలను డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి...

స్టెప్ 1 : ముందుగా మీ ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌లో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను ఓపెన్ చేయండి.

స్టెప్ 2 :
యాప్ ఓపెన్ అయిన తరువాత ఇన్‌స్టాగ్రామ్ సెర్చ్ బార్‌లో మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటోన్న ఫోటోకు సంబంధించి ప్రొఫైల్ నేమ్‌ను ఎంటర్ చేసినట్లయితే సెర్చింగ్ ప్రాసెస్ మొదలవుతుంది.

స్టెప్ 3 :
మీరు సెర్చ్ చేసిన ఫోటో ఐడెంటిఫై అయిన తరువాత ఆ ఫోటోకు సంబంధించిన యూఆర్ఎల్‌ను అడ్రస్ బార్ నుంచి కాపీ చేసుకోండి.

స్టెప్ 4 : తదుపరి స్టెప్‌లో భాగంగా DownloadGram (https://downloadgram.com/) అనే

వెబ్‌సైట్‌లోకి వెళ్లి, ముందుగా కాపీ చేసుకున్న ఆటో-జెనరేటెడ్ ఇన్‌స్టాగ్రామ్ లింక్‌ను అక్కడ పేస్ట్ చేయండి.

స్టెప్ 5 : ఇమేజ్ పూర్తిగా డౌన్‌లోడ్ అయిన తరువాత మీకు కావల్సిన ఫైల్ లేదా ఫోల్డర్‌లో ఆ ఇమేజ్‌ను భద్రపరుచుకోవచ్చు.

<strong>Airtel ప్లాన్లలో మార్పులు, జియో రూ.399, రూ.149కి గట్టి పోటీ</strong>Airtel ప్లాన్లలో మార్పులు, జియో రూ.399, రూ.149కి గట్టి పోటీ

Best Mobiles in India

Read more about:
English summary
Instagram is one of the most popular medium, where millions of photos are shared each and every. In this article, we have compiled a list of step that guides you to download the full resolution photo from Instagram.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X