యాపిల్ అప్‌డేట్: ఐఓఎస్ 8.1ను డౌన్‌లోడ్ చేసుకోండిలా

Posted By:

యాపిల్ తన లేటెస్ట్ వర్షన్ ఐఓఎస్ 8 ఆపరేటింగ్ సిస్టంకు మైనర్ అప్‌డేట్‌లను జోడిస్తూ ఐఓఎస్ 8.1ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో ఐఓఎస్ 8 ప్లాట్‌ఫామ్‌లో తలెత్తిన సెల్యూలర్ నెట్‌వర్క్ ఇంటర్‌ఫేస్ సమస్యతో పాటు తలెత్తిన ఇతర  బగ్‌లను ఐఓఎస్ 8.1లో పరిష్కరించారు. యాపిల్ పే, ఓఎస్ ఎక్స్ యోసీమైట్ తదితర ఫీచర్లను ఈ కొత్త అప్‌డేట్ సపోర్ట్ చేస్తుంది. ఐఓఎస్ 8.1 ప్రస్తుతం యాపిల్ ఐఫోన్ యూజర్ల కోసం అందుబాటులో ఉంది. డౌన్‌లోడ్ చేసుకునేందుకు పలు సూచనలు...

ఐఓఎస్ 8.1ను డౌన్‌లోడ్ చేసుకోండిలా

-  ఐఓఎస్ 8.1 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను అందుకునే స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 4ఎస్ ఆపై వర్షన్ అయి ఉండాలి. ఐప్యాడ్ 2 ఆపై వర్షన్‌లను  ఐఓఎస్ 8.1 సపోర్ట్ చేస్తుంది.

-  ఐఓఎస్ 8.1 సాఫ్ట్‌‍వేర్ అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేసుకునే క్రమంలో ముందుగా హోమ్‌ స్ర్కీన్‌లోని సెట్టింగ్స్ ఆప్షన్‍‌ను సెలక్ట్ చేసుకోండి.

-  సెట్టింగ్స్‌లోకి ప్రవేశించిన తరువాత జనరల్ ఆఫ్షన్‌‍ను సెలక్ట్ చేసుకోండి.

-  జనరల్ ఆప్షన్‌లోని సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పై క్లిక్ చేసినట్లయితే. అందుబాటులో ఉన్న సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు స్ర్కీన్ పై కనిపిస్తాయి.

-  ఐఓఎస్ 8.1 అందుబాటులో ఉన్నట్లయితే.. డౌన్‌లోడ్ అండ్ ఇన్స్‌స్టాల్ పై క్లిక్ చేయండి.

-  తదుపరి చర్యగా ఐఓఎస్ 8.1 మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అవుతుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
How to Download iOS 8.1 Now. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting