ఫేస్‌బుక్ వీడియోలను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసా..?

|

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వెబ్‌సైట్‌లలో నిత్యం అనేక కొత్త వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. వీటిలో కొన్ని వీడియోలు బాగా వైరల్ అవుతంటాయి. దీంతో వీటిని పదేపదే చూడాలని అనిపిస్తుంటుంది. అయితే, ప్రతిసారి సంబంధిత పేజీలోకి వెళ్లి ఆ వీడియోలను చూడటం వల్ల బోలేడంత సమయాన్ని వృధా చేయటంతో పాటు డేటాను కూడా ఖర్చు చేస్తుంది.

 
ఫేస్‌బుక్ వీడియోలను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసా..?

కాబట్టి, నచ్చిన ఫేస్‌బుక్ వీడియోలను ఎప్పటికప్పుడు డౌన్‌లోడ్ చేసుకుని సేవ్ చేసుకోవటం ద్వారా
వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్లే చేసుకుని చేసుకోవచ్చు. ఫేస్‌బుక్ వీడియోలను అఫీషియల్‌గా డౌన్‌లోడ్ చేసుకునేందుకు ప్రస్తుతానికైతే ఏవిధమైన డైరెక్ట్ ఆప్షన్ అందుబాటులో లేదు. అయితే, పలు థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా ఈ డౌన్‌లోడింగ్ ప్రాసెస్ సాధ్యమవుతుంది. ఆ ప్రొసీజర్‌ను ఇప్పుడు తెలుసుకుందాం...

యాపిల్ ఐఫోన్ యూజర్లు ఫేస్‌బుక్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..?

యాపిల్ ఐఫోన్ యూజర్లు ఫేస్‌బుక్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..?

ఫేస్‌బుక్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునేందుకు అనేక అప్లికేషన్స్ iOS App స్టోర్‌లో సిద్ధంగా ఉన్నప్పటికి వాటి వల్ల అంతగా ఉపయోగం లేదు. అయితే, MyMedia అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లటం ద్వారా ఐఫోన్ యూజర్లు తమ ఫేస్‌బుక్ వీడియోలను సెకన్ల వ్యవధిలో డౌన్‌లోడ్ చేసుకునే వీలుంటుంది.

ముందుగా ఐఫోన్ యూజర్లు MyMedia యాప్‌ను తమ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది. ఈ యాప్ వీడియోలను డౌన్‌‌లోడ్ చేసుకునేందుకు అవసరమైన లింక్‌లను ప్రొవైడ్ చేస్తుంది. యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న తరువాత యూజర్, తన ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి వెళ్లి డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్న వీడియోను సెలక్ట్ చేసకుని ప్లే చేయవల్సి ఉంటుంది.

వీడియో ప్లే అవుతోన్న సమయంలో బోటమ్-రైట్ కార్నర్‌లో కనిపించే "Share" బటన్ పై క్లిక్ చేసి "Copy Link" ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. లింక్ కాపీ అయిన తరువాత MyMedia యాప్‌లోకి వెళ్లి మెయిన్ స్ర్కీన్ పై కనిపించే డౌన్‌లోడ్ ఫీల్డ్‌లో ఆ లింక్‌ను పేస్ట్ చేయాల్సి ఉంటుంది.

లింక్ పేస్ట్ అయిన తరువాత "Download the file" ఆప్షన్ పై క్లిక్ చేసి వీడియో పేరును ఎంటర్ చేసినట్లయితే డౌన్‌లోడింగ్ ప్రాసెస్ పూర్తవుతుంది. FBDown SaveFrom, DownVids వంటి యాప్స్ ద్వారా కూడా ఫేస్‌బుక్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Instagram వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..?
 

Instagram వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..?

Instagram వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఐఫోన్ యూజర్లు Grab for IG అనే యాప్ సర్వీసును వినియోగించుకోవల్సి ఉంటుంది. ఈ యాప్‌లోకి ఐన్‌స్టాగ్రామ్ ఐడీ, పాస్‌వర్డ్ ద్వారా ‌సైన్ఇన్ కావల్సి ఉంటుంది.

యాప్‌లోకి సైన్‌ఇన్ అయిన తరువాత "Authorize" బటన్ పై ప్రెస్ చేసినట్లయితే ఇన్‌స్టాగ్రామ్ వీడియో యూఆర్ఎల్స్‌కు సంబంధించిన యాక్సిస్ Grab for IG యాప్‌కు యాక్సిస్ లభిస్తుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు EasyDownloader లేదా Insta Save యాప్స్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునే వీలుంటుంది.

సోనీ నుంచి మరో సంచలన కెమెరా ‘A7R III'సోనీ నుంచి మరో సంచలన కెమెరా ‘A7R III'

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఫేస్‌బుక్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..?

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఫేస్‌బుక్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..?

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు EasyDownloader యాప్ ద్వారా ఫేస్‌బుక్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునే వీలుంటుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న తరువాత యూజర్ తన ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి వెళ్లి, డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్న వీడియోను ఓపన్ చేసినట్లయితే డౌన్‌లోడ్ ద ఫైల్ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే వీడియో విజయవంతంగా డౌన్‌లోడ్ కాబడుతుంది.

Best Mobiles in India

Read more about:
English summary
Most of us do take videos just to upload it on our social media account to get instant gratification and nothing else.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X