ఫోన్ ట్యాపింగ్ ఎలా చేస్తారు, ఎవరు చేస్తారు ?

ఫోన్ ట్యాపింగ్‌ దేశ వ్యాప్తంగా ఈ పదం ఏదో ఓ సంధర్భంలో మారుమోగుతూనే ఉంటుంది.

|

ఫోన్ ట్యాపింగ్‌ దేశ వ్యాప్తంగా ఈ పదం ఏదో ఓ సంధర్భంలో మారుమోగుతూనే ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎన్నో అంతర్గత విషయాలు బయటకు రావడం ఆ తరువాత వారు అనేక సమస్యలను ఎదుర్కోవడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం.. ఈ మధ్య తెలంగాణాలో అలాగే ఇంతకుముందు ఓ రాష్ట్ర సీఎం విషయంలో ఈ ట్యాపింగ్ విషయాలు కలకలం రేపాయి కూడా. ఈ ట్యాపింగ్ రెండు రకాలుగా చేయవచ్చు. ఒకటి చట్టబద్ధం. రెండోది చట్టవిరుద్ధం. ఈ నేపథ్యంలో అసలు ఫోన్ ట్యాపింగ్ ఎలా చేస్తారు. అసలు ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు ఎవరెవరికి అధికారం ఉంటుందో ఒక్కసారి తెలుసుకుందాం.

 

సెల్ఫీలే దిగడమే కాదు, ఈ సీక్రెట్ కోడ్‌లు కూడా ప్రయత్నించండిసెల్ఫీలే దిగడమే కాదు, ఈ సీక్రెట్ కోడ్‌లు కూడా ప్రయత్నించండి

ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు..

ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు..

సాధారణంగా ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు మూడు నుంచి నాలుగు వర్క్ స్టేషన్లు, డెస్క్ టాప్ మానిటర్లు, హెడ్ ఫోన్లతో కూడిన ఒక గది ఉంటే చాలు. ఈ గది మొత్తాన్ని సీసీ టీవీ కెమెరా నిఘాలో ఉంచుతారు.

సెట్టింగ్స్‌ను..

సెట్టింగ్స్‌ను..

వీటితో పాటు సెల్‌ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు సరిపడ సర్వర్లు, రికార్డింగ్‌ పరికరాలు, టెలికం సర్వీస్‌ ప్రొవైడర్లు అందజేసే కేబుల్స్‌ ఉంటే చాలు. ఫోన్ ట్యాపింగ్ చేయడం కోసం చేయాల్సిన సెట్టింగ్స్‌ను పరికరాలు అందజేసిన వారే చేసిపెడతారు.

ఏసీబీ అధికారులు

ఏసీబీ అధికారులు

వీటి ద్వారా ఏసీబీ అధికారులు తమకు కావలనుకున్న వారి సంభాషణలను రికార్డు చేస్తారు. 

 రూ. 10 నుంచి 15 లక్షల వరకూ
 

రూ. 10 నుంచి 15 లక్షల వరకూ

ఇలా రికార్డు చేసే ఒక్కో సర్వర్ ఖరీదు సుమారు రూ. 10 నుంచి 15 లక్షల వరకూ ఉంటుంది. ఇవి మాత్రమే కాదు 'స్టింగ్ రే పరికరాలు'ను ఉపయోగించి కూడా ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చు.

స్టింగ్‌ రే పరికరాలు

స్టింగ్‌ రే పరికరాలు

అయితే, స్టింగ్‌ రే పరికరాలు ఆ సిగ్నళ్లను డిజేబుల్‌ చేసి, సురక్షితంకాని 2జీ నెట్‌వర్క్‌లోకి వెళ్లేలా చేస్తాయి. అలా వెళ్లగానే సులభంగా ట్యాప్‌ చేస్తాయి.

ఈ అధికారులకే సాధ్యం

ఈ అధికారులకే సాధ్యం

మన దేశంలో సీబీఐ, రా, ఐబీ, ఈడీ, జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ, డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌, నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో, ఆదాయపన్ను విభాగం, రాష్ట్ర పోలీసు విభాగం అధికారులు మాత్రమే వీటి ద్వారా ట్యాపింగ్‌ చేయడానికి అధికారాన్ని కలిగి ఉన్నారు.

సెల్ టవర్లు ఎక్కువైన దృష్ట్యా

సెల్ టవర్లు ఎక్కువైన దృష్ట్యా

ఇటీవల కాలంలో సెల్ టవర్లు ఎక్కువైన దృష్ట్యా టవర్ మీద కూడా ట్యాపింగ్ పరికరాన్ని ఏర్పాటు చేసి కాల్స్‌ను ట్యాపింగ్ చేసే వెసులుబాటు ఉంది. దీని ద్వారా ఆ టవర్ ప్రాంతంలో ఉన్న అన్ని నెంబర్లనూ ట్యాప్ చేసే అవకాశం ఉంటుంది.

గరిష్టంగా ఒక ఫోన్‌ను మూడు నెలల పాటు

గరిష్టంగా ఒక ఫోన్‌ను మూడు నెలల పాటు

ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని, కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా దాదాపుగా 9 వేల ఫోన్ల ట్యాపింగ్‌కు ఉత్తర్వులు ఇస్తోంది. గరిష్టంగా ఒక ఫోన్‌ను మూడు నెలల పాటు ట్యాప్ చేయవచ్చు.

ఉగ్రవాదులు, మిలిటెంట్లు విషయంలో

ఉగ్రవాదులు, మిలిటెంట్లు విషయంలో

అయితే ప్రతి రెండు నెలలకొకసారి ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఉగ్రవాదులు, మిలిటెంట్లు విషయంలో అనుమతి తీసుకోకుండానే 72 గంటల పాటు నిఘా సంస్ధలు ఒక ఫోన్‌ని ట్యాప్ చేయవచ్చు. ఆ తర్వాత ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తే, 48 గంటల్లో ఆ ఫోన్ సంభాషణలను ధ్వంసం చేయాల్సి ఉంటుంది.

చట్టవిరుద్ధంగా ఎలా చేస్తారు..?

చట్టవిరుద్ధంగా ఎలా చేస్తారు..?

చట్టబద్ధంగా చేయాలంటే అన్ని పరికరాలు సమకూర్చుకోవాలి. కానీ, చట్టవ్యతిరేకంగా చేయాలంటే అన్ని పరికరాలు, యంత్ర సామాగ్రి అక్కర్లేదు.

ఫోన్‌ ఇంటర్‌సెప్షన్‌ మిషన్‌

ఫోన్‌ ఇంటర్‌సెప్షన్‌ మిషన్‌

ల్యాప్‌టాప్‌ పరిమాణంలో ఉండే ఒక ఫోన్‌ ఇంటర్‌సెప్షన్‌ మిషన్‌ను కారులో ఉంచి, ఎవరి ఫోన్‌ ట్యాప్‌ చేయాలో వాళ్ల ఇల్లు లేదా ఆఫీసు సమీపంలో పార్క్‌ చేయాల్సి ఉంటుంది.

ట్యాప్‌ చేయాల్సిన నంబర్‌ను

ట్యాప్‌ చేయాల్సిన నంబర్‌ను

ట్యాప్‌ చేయాల్సిన నంబర్‌ను మిషన్‌లోకి ఫీడ్‌ చేస్తారు. వాళ్లకు ఎప్పుడు కాల్‌ వచ్చినా, కాల్‌ వెళ్లినా వెంటనే అది రికార్డయిపోతుంది.

మూడేళ్ల జైలుశిక్ష..

మూడేళ్ల జైలుశిక్ష..

ఈ మిషన్లను అక్రమంగా దిగుమతి చేసుకుంటున్నారు. ఇలాంటి మిషన్లను ఉపయోగించి ట్యాప్‌ చేసినట్లు బయటపడితే.. టెలిగ్రాఫ్‌ చట్టంలోని సెక్షన్‌ 26(బి) ప్రకారం మూడేళ్ల జైలుశిక్ష విధించే అవకాశముంది.

Best Mobiles in India

English summary
How to Tap a Cell Phone With Just the Number and Spy on Mobile More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X