ఐఫోన్ Xఎస్, Xఎస్ మ్యాక్స్, Xఆర్ లకు ఇ-సిమ్ యాక్టివ్ చేయడం ఎలా...?
సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ ఆపిల్ కొద్దీ నెలల క్రితం తన కొత్త ఐఫోన్లు అయిన ఐఫోన్ Xఎస్, Xఎస్ మ్యాక్స్, Xఆర్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే .
సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ ఆపిల్ కొద్దీ నెలల క్రితం తన కొత్త ఐఫోన్లు అయిన ఐఫోన్ Xఎస్, Xఎస్ మ్యాక్స్, Xఆర్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే . ఈ ఫోన్లు ప్రస్తుతం దాదాపుగా అన్ని దేశాల మార్కెట్లలో వినియోగదారులకు లభిస్తున్నాయి. అయితే అప్పట్లో ఐఫోన్ల లాంచింగ్ ఈవెంట్ సందర్భంగా ఆపిల్ ఈ కొత్త ఐఫోన్లలో డ్యుయల్ సిమ్ ఫీచర్‌ను అందిస్తున్నట్లు వెల్లడించగా, ప్రస్తుతం ఆ ఫీచర్ యూజర్లకు లభిస్తున్నది . ఇప్పటికే జియో, ఎయిర్‌టెల్‌లు ఆపిల్ నూతన ఐఫోన్లకు ఇ-సిమ్ సపోర్ట్‌ను అందిస్తున్నట్లు ప్రకటించగా, ప్రస్తుతం ఎయిర్‌టెల్ ఇ-సిమ్ యాక్టివేషన్‌ను అందిస్తున్నది. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్ వినియోగదారులు తమ నూతన ఐఫోన్లలో ఇ-సిమ్‌ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఈ శీర్షిక ద్వారా తెలుపుతున్నాము. ఓ లుక్కేయండి...

ఎయిర్‌టెల్ వినియోగదారులు ఐఫోన్ Xఎస్, Xఎస్ మ్యాక్స్, Xఆర్ లకు ఇ-సిమ్‌ను ఎలా యాక్టివేట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం....
- ఐఫోన్ Xఎస్, Xఎస్ మ్యాక్స్, Xఆర్ వినియోగదారులు తమ ఫోన్‌ను లేటెస్ట్ ఐఓఎస్ వెర్షన్ ఐఓఎస్ 12.1కు అప్‌డేట్ చేయాలి.
- ఇ-సిమ్ రిజిస్ట్రేషన్ కోసం eSIM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి రిజిస్టర్ మెయిల్ ఐడీని ఎంటర్ చేసి ఆ మెసేజ్‌ను 121కు ఎస్‌ఎంఎస్ పంపాలి.
- ఎయిర్‌టెల్ నుంచి వినియోగదారుడి మెయిల్‌కు ఓ క్యూఆర్ కోడ్ వస్తుంది.
- ఫోన్ లేదా పీసీలో మెయిల్ ఓపెన్ చేయాలి.
- ఐఫోన్ లో సెట్టింగ్స్‌లోకి వెళ్లి సెల్యులార్ విభాగంలో, యాడ్ సెల్యులార్ ప్లాన్ ఆప్షన్‌ను ఎంచుకుని ముందుకు సాగితే అక్కడ క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలని చూపిస్తుంది.
- అనంతరం ఇ-సిమ్ చేంజ్ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేయమంటూ ఒక మెసేజ్ వస్తుంది. దానికి 60 సెకండ్లలోగా 1 అని రిప్లయి ఇవ్వాలి.
ఇ-సిమ్ చేంజ్ రిక్వెస్ట్‌ను కన్‌ఫాం చేస్తూ కస్టమర్‌కు ఓ కాల్ వస్తుంది.
- తరువాత కొన్ని గంటల్లోగా ఇ-సిమ్ యాక్టివేట్ అవుతుంది.

ఇ-సిమ్ యాక్టివేట్ అవగానే...
ఇ-సిమ్ యాక్టివేట్ అవగానే యూజర్లు తమ ఐఫోన్లలో రెండు సిమ్‌లను ఉపయోగించుకోవచ్చు. అయితే ఒక సిమ్‌ను ప్రైమరీగా, మరోసిమ్‌ను సెకండరీగా పెట్టుకున్నానే రెండు సిమ్‌లను వాడుకోవాల్సి ఉంటుంది.

ప్రైమరీగా సెట్ చేసుకున్న సిమ్‌తో యూజర్లు మొబైల్ డేటాను....
ప్రైమరీగా సెట్ చేసుకున్న సిమ్‌తో యూజర్లు మొబైల్ డేటాను, వాయిస్, ఎస్‌ఎంఎస్‌లు, ఐమెసేజ్, ఫేస్‌టైం వంటి సదుపాయాలను వాడుకోవచ్చు. అదే సెకండరీ సిమ్‌తో అయితే కేవలం వాయిస్, ఎస్‌ఎంఎస్‌లను మాత్రమే వాడుకునేందుకు వీలు ఉంటుంది.


Click it and Unblock the Notifications








