విండోస్ ల్యాప్ టాప్ ట్రాకింగ్ ఫీచర్ ఎలా ప్రారంభించాలి!

Posted By: Madhavi Lagishetty

సుమారు రెండేళ్ల కిందట మైక్రోసాఫ్ట్ విండోస్ కోసం ఒక పెద్ద అప్ డేట్ ను మైక్రోసాఫ్ట్ రిలీజ్ చేసింది. ఇందులో డివైస్ ను కనుగొనుట సహా అన్ని ఫీచర్స్ పరిచయం చేసింది. ఆన్ చేసిన తర్వాత...మీ డివైస్ ను క్రమం తప్పకుండా చెక్ చేసి, స్టోర్ చేయడానికి విండోస్ డివైస్ అనుమతిస్తుంది. మీ డివైస్ ను పోగట్టుకున్నట్లయితే లేదా దొంగింలించబడితే దానిని కనుగొనడంలో మీకు సహాయపడుతుంది.

విండోస్ ల్యాప్ టాప్ ట్రాకింగ్ ఫీచర్ ఎలా ప్రారంభించాలి!

అయితే..ఇది డివైస్ ట్రాకింగ్ కోసం మాత్రమే. రిమోట్ గా మీ pc ని తుడిచేయదు లేదా లాక్ చేయదు. మీరు మీ డివైస్ ను వెబ్ క్యామ్ ఉపయోగించి ఫోటోతో ఒక అలారం ప్లే చేయలేరు లేదా స్నాప్ కూడా తీయలేరు. ఇది మీ డివైస్ యొక్క స్థానాన్ని మాత్రమే చూపుతుంది. మైక్రోసాఫ్ట్ భవిష్యత్తులో మరిన్ని ఫీచర్లను యాడ్ చేయగలదు, కానీ అది ఇప్పుడు కాదు.

అదనంగా, మీరు చెక్ చేసి దాని స్థానాన్ని నివేదించడానికి ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం. ఈ ఫీచర్ ఖచ్చితంగా పని చేయాలని మీరు కోరుకుంటే...మీ డివైస్ లో మైక్రోసాఫ్ట్ అకౌంట్ అవసరం. డివైస్ను GPSచిప్, సెల్యులార్ కనెక్షన్ లేదా ఇతర ప్రదేశాలని గుర్తించడంలో తప్పనిసరింగా ఉండాలి.

విండోస్ ల్యాప్ టాప్ ట్రాకింగ్ ఫీచర్ ఎలా ప్రారంభించాలి!

ఈ విషయం గురించి మీరు ట్రెడిషనల్ డెస్క్ టాప్ కంప్యూటర్లలో లేదా పాత ల్యాప్ టాప్లో కూడా కనుగొనలేరు. ఏమైనప్పటికి, మీరు ఈ ఆధునిక రోజుల్లో టాబ్లెట్లలో, హైబ్రిడ్ డివైస్లలో కనుగొనవచ్చు. కాబట్టి ఈ విషయాలు మీరు మనసులో ఉంచుకోవాలి. ఎంపికను ప్రారంభించడానికి ఈ క్రింది ఆప్షన్లను ఫాలో అవ్వండి.

స్టెప్ 1...

మెనూ స్టార్ట్ చేయాలి. మెనూ మీద క్లిక్ చేసి, సెట్టింగులను ఎంచుకోవాలి.

స్టెప్ 2...

అప్ డేట్ & సెక్యూరిటికి వెళ్లండి _> సెట్టింగ్స్ యాప్ లో డివైస్ను కనుగొనండి.

విండోస్ ల్యాప్ టాప్ ట్రాకింగ్ ఫీచర్ ఎలా ప్రారంభించాలి!

స్టెప్3...

ఆప్షన్ ను ఆన్ చేయడానికి , మీరు మైక్రోసాఫ్ట్ అకౌంట్ లోకి లాగిన్ అవ్వాలి.

స్టెప్ 4...

ఈ ఫీచర్ను ఎనేబుల్ చేయడానికి ఛేంజ్ బటన్ పై క్లిక్ చేయండి.

విండోస్ ల్యాప్ టాప్ ట్రాకింగ్ ఫీచర్ ఎలా ప్రారంభించాలి!

స్టెప్ 5...

అలాగే ప్రాంప్ట్ చేయబడినప్పుడు “ సేవ్ మై డివైస్” స్థానాన్ని క్రమానుగతంగా సేవ్ చేయి ఆప్షన్ ను ఆన్ చేయండి.

స్టెప్ 6...

మీరు మీ డివైస్ను ట్రాక్ చేయాలనుకుంటే, మీరు “account.microsoft.com/devices” కి వెళ్లవచ్చు.

English summary
Two years back Microsoft rolled out a big update for Windows 10 by introducing a couple of features including Find My Device. these are the things you need to keep in mind. Follow the below steps to enable the option.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot