ప్రయాణంలో మీ ల్యాప్‌టాప్‌‌కు ఉచిత ఇంటర్నెట్

Posted By:

ప్రయాణంలో మీ ల్యాప్‌టాప్‌‌కు ఉచిత ఇంటర్నెట్

కమ్యూనికేషన్ అవసరాల రిత్యా మనలో చాలా మంది ప్రయాణాల్లో ల్యాప్‌టాప్‌లను క్యారీ చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో మనం తీసుకువెళుతున్న ల్యాప్‌టాప్‌కు ఇంటర్నెట్ యాక్సెస్ అవసరమైతే ఏం చేస్తాం..? జర్నీ సమయంలో మీ ల్యాప్‌టాప్‌‌కు ఉచిత ఇంటర్నెట్‌ను అందించే పలు క్రేజీ మార్గాలను ఇప్పుడు చూద్దాం..

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ప్రయాణంలో మీ ల్యాప్‌టాప్‌‌కు ఉచిత ఇంటర్నెట్

వై-ఫై హాట్‌స్పాట్స్

ప్రయాణంలో మీ ల్యాప్‌టాప్‌కు ఉచితంగా ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేసుకునేందుకు మొదటి ఆప్షన్ వై-ఫై హాట్‌స్పాట్. హైస్పీడ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పుణ్యమా అంటూ పబ్లిక్ ప్రాంతాల్లో ‘వై-ఫై హాట్‌స్పాట్స్' పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. మీ ల్యాపీలోని వై-ఫై నెట్‌వర్క్ ద్వారా ఈ హాట్‌స్పాట్ హబ్‌కు కనెక్టై అత్యవసర కార్యకలాపాలను ఉచితంగా నిర్వహించుకోవచ్చు.

హాట్‌స్పాట్ షీల్డ్ వంటి సెక్యూరిటీ యాప్‌లను మీ డివైస్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా మీ సమచారం మొత్తం ఎన్‌క్రిప్ట్ కాబడుతుంది తద్వారా ఇలాంటి పబ్లిక్ ప్రాంతారల్లో సురక్షితంగా బ్రౌజింగ్‌ను మీరు ఆస్వాదించవచ్చు.

ప్రయాణంలో మీ ల్యాప్‌టాప్‌‌కు ఉచిత ఇంటర్నెట్

వై-‌ఫై ఫైండర్

ఒక వేళ వై-ఫై హాట్‌స్పాట్‌లు మీకు కనిపించనట్లయితే రెండవ ఆప్షన్ క్రింద మీ స్మార్ట్‌ఫోన్‌లోని వై-ఫై ఫైండర్  యాప్‌ను ఓపెన్ చేసి సమీపంలో ఉన్న ఉచిత వై-ఫై హాట్‌స్పాట్‌లకు సంబంధించి శోధించండి. మీరు వాడుతున్నది ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ అయితే గూగుల్ ప్లే‌స్టోర్‌లో, యాపిల్ ఐఫోన్ అయితే ఐట్యూన్స్ స్టోర్‌లో, విండోస్ యూజర్ అయితే విండోస్ స్టోర్‌లో రకరకాల వై-ఫై ఫైండర్ యాప్స్ సిద్ధంగా ఉన్నాయి.

ప్రయాణంలో మీ ల్యాప్‌టాప్‌‌కు ఉచిత ఇంటర్నెట్

స్మార్ట్‌ఫోన్ ద్వారా

పైన సూచించిన రెండు ప్రయత్నాలు బెడిసి కొట్టినట్లయితే ఆఖరి ప్రయత్నంగా మీ స్మార్ట్‌ఫోన్ ఇంటర్నెట్‌ను ల్యాప్‌టాప్‌కు వై-ఫై లేదా యూఎస్బీ కేబుల్ ద్వారా టిథర్ చేయండి. మీ ఫోన్ స్పెసిఫికేషన్ల సామర్థ్యం అలానే మీరు వినియోగిస్తోన్న డేటా  ప్లాన్‌ను బట్టి టిథరింగ్ ప్రక్రియ ఉంటుంది. మీరు వాడుతోన్న మొబైల్ ప్లాట్‌ఫామ్‌ను బట్టి అనేక రకాల థర్డ్ పార్టీ టిథరింగ్ యాప్స్ ఆన్‌లైన్‌లో సిద్ధంగా ఉన్నాయి.

English summary
How to find free Internet for your laptop while traveling. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting