ఫోన్ ఏదైనా ‘ఐఎమ్ఈఐ’ నెంబర్ తెలుసుకోవటం ఏలా..?

Posted By:

ప్రతి మొబైల్ లేదా స్మార్ట్‌ఫోన్‌కు ఐఎమ్ఈఐ (IMEI)నెంబర్ తప్పనిసరిగా కేటాయించటం జరుగుతుంది. భవిష్యత ఉపయోగం కోసం ఈ నెంబరును భద్రపరుచటం మంచిది. ఫోన్ అపహరణకు గురైన సమయంలో పోలీసులను ఆశ్రయించాల్సి వస్తే తప్పనిసరిగా సదరు మొబైల్ ఐఎమ్ఈఐ (IMEI)నెంబర్‌ను ఎఫ్ఐఆర్ పత్రంలో పొందుపరచాల్సి ఉంటుంది. మొబైల్‌ను కనుగొనటంలో ఐఎమ్ఈఐ నెంబర్ కీలక పాత్ర పోషిస్తుంది.

ఫోన్ ఏదైనా ‘ఐఎమ్ఈఐ’ నెంబర్ తెలుసుకోవటం ఏలా..?

దేశ వ్యాప్తంగా మొబైల్ చోరీలు ఏటా అధిక శాతంలో నమోదవుతున్నాయి. మొబైల్ చోరీలను చేధించే క్రమంలో అనేక విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ప్రతీ మొబైల్ ఫోన్‌కు ఐఎమ్ఈఐ (IMEI)నెంబరు కీలకం. ఈ నెంబర్ సరిలేని నకిలీ మొబైల్ హ్యాండ్‌సెట్‌లను బ్లాక్ మార్కెట్లో యథేచ్చగా విక్రయిస్తున్నారు.

యూఎస్ఎస్‌డి కోడ్ ద్వారా:

ఫోన్ ‘ఐఎమ్ఈఐ' నెంబర్‌ను తెలుసుకునేందుకు ఇదుకో సులువైన పద్ధతి. ఏ మోడల్ ఫోన్‌లో అయినా సరే *#06#'కు డయిల్ చేయటం ద్వారా 15 అంకెలతో కూడిన మీ ఫోన్ ఐఎమ్ఈఐ నెంబరును తెలుసుకోవచ్చు.

ఫోన్ ఏదైనా ‘ఐఎమ్ఈఐ’ నెంబర్ తెలుసుకోవటం ఏలా..?


ఐఎమ్ఈఐ నెంబర్‌ ఫోన్ పై ఎక్కడ ఉంటుంది..?

మీరు ఐఫోన్ 5 లేదా ఆఫై వర్షన్ ఐఫోన్‌ను వాడుతున్నట్లయితే డివైస్ బ్యాక్ ప్యానల్ పై  ‘ఐఎమ్ఈఐ' నెంబర్‌ను చూడొచ్చు. ఐఫోన్ 4ఎస్ లేదా పాత వర్షన్ ఐఫోన్‌లను వాడుతున్నట్లయితే సిమ్ ట్రే పై  ‘ఐఎమ్ఈఐ' నెంబర్‌ను చూడొచ్చు.

ఫోన్ ఏదైనా ‘ఐఎమ్ఈఐ’ నెంబర్ తెలుసుకోవటం ఏలా..?

ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి తెలుసుకోవాలంటే..?

ఆండ్రాయిడ్ యూజర్లు తమ ఫోన్‌లోని Settings > About > IMEIలోకి వెళ్లటం ద్వారా ఐఎమ్ఈఐ నెంబర్‌ను తెలుసుకోవచ్చు.

ఫోన్ ఏదైనా ‘ఐఎమ్ఈఐ’ నెంబర్ తెలుసుకోవటం ఏలా..?

ఐఫోన్ యూజర్లు తమ ఫోన్‌లోని Settings > General > Aboutలోకి వెళ్లి IMEI నెంబర్‌ను తెలుసుకోవచ్చు.

చాలా వరకు స్మార్ట్‌ఫోన్‌లలో  ‘ఐఎమ్ఈఐ' నెంబర్‌ను ఫోన్ వెనుక భాగంలోని బ్యాటరీ క్రింద భాగంలో చూడొచ్చు.

English summary
How to Find IMEI Number of Any Phone. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot