Just In
- 11 hrs ago
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- 16 hrs ago
గూగుల్, వాట్సాప్ లాగా Twitter లో కూడా పేమెంట్ ఫీచర్! వివరాలు!
- 18 hrs ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- 1 day ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
Don't Miss
- News
union budget: మరికొద్ది గంటల్లో పార్లమెంటులో కేంద్ర బడ్జెట్, ఆశలు, అంచనాలు
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Movies
Kranti Day 5 Collections దర్శన్ మూవీ స్ట్రాంగ్‌గా.. తొలివారంలోనే లాభాల్లోకి.. ఎంత ప్రాఫిట్ అంటే?
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
గూగుల్ అసిస్టెంట్ ప్రతిస్పందనల్లో సమస్యలు తలెత్తుతున్నాయా? అయితే ఈ పద్దతులను అనుసరించండి.
వాయిస్ అసిస్టెంట్స్ మన జీవన విధానాలను మరింత సరళతరం చేశాయి అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. మార్కెట్లో అనేకరకాల వాయిస్ అసిస్టెంట్ డివైజులు కూడా లభిస్తున్నాయి. గూగుల్ అసిస్టెంట్ మిగిలిన అన్ని వాయిస్ అసిస్టెంట్ డివైజులతో పోల్చినప్పుడు గట్టి పోటీదారునిగా మార్కెట్లో నిలదొక్కుకుంది. అప్లికేషన్స్ తెరవడం, వాతావరణ పరిస్థితులు తెలుపడం, ఆటలు ఆడడం, కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, పాటలను ప్లే చేయడం వంటి అంశాల నుండి, మీకు సమీపంలోని ఉత్తమ రెస్టారెంట్లను కనుగొనడం వరకు గూగుల్ అసిస్టెంట్ తన సమాధానాల ద్వారా అనేక రకాల విధులను నిర్వహిస్తుంది. ఇటీవల గూగుల్ అసిస్టెంట్లో గమనించిన సమస్యల్లో ఒకటి, మీ ప్రశ్నలకు వాయిస్ కూడిన సమాధానం కాకుండా, బదులుగా టెక్స్ట్ సందేశాన్ని ప్రతిస్పందనగా ప్రదర్శించడం లేదా సమాధానాలు ఇవ్వకపోవడం జరుగుతుంది.

గూగుల్ అసిస్టెంట్తో సంభాషించడం అనేక మందికి ఆసక్తిగా ఉంటుంది, దీనికి కారణం ప్రత్యేకించి ఒక వ్యక్తితో వాస్తవంగా మాట్లాడి విధులను నిర్వహించుకుంటున్న అనుభూతికి లోనుచేయడమే. కానీ, పైన చెప్పినట్లు వాయిస్ రూపంలో కాకుండా, టెక్స్ట్ రూపంలో సమాధానమివ్వడం లేదా ప్రతిస్పందించకపోవడం వంటి సమస్యలు కొంతమేర నిరుత్సాహాన్ని ఇస్తాయి. ఇటువంటి సమస్య ఉత్పన్నమైనట్లు భావిస్తే, ఈ వ్యాసం మీకోసమే.

మీ పరికరాన్ని రీస్టార్ట్ చేయండి :
ఒక్కోసారి మనకు తెలిసిన కొన్ని పాత విషయాలే, సమస్యలకు సమాధానాలుగా ఉంటాయి. కానీ, సమస్యను పూర్తి స్థాయిలో నిలువరిస్తుంది అని చెప్పలేము కానీ, ఒక చాయిస్ అయితే ఉంటుంది. అందులో ఒకటి మీ పరికరాన్ని రీస్టార్ట్ చేయడం. రీస్టార్ చేసిన పిదప, ఒకసారి గూగుల్ అసిస్టెంట్ తనిఖీ చేయండి.

కాచీ క్లియర్ చేయడం :
మీ ఫోన్ రీస్టార్ట్ చేయబడినా కూడా, సమస్య పరిష్కరించబడని పక్షంలో మీరు ప్రయత్నించవలసిన తదుపరి అంశం, మీ గూగుల్ అప్లికేషన్ నుండి కాచీ క్లియర్ చేయడం.
స్టెప్ 1 : డివైజ్ సెట్టింగ్స్ తెరచి, అందులో ఆప్స్ /అప్లికేషన్ మేనేజర్ / ఆప్స్&నోటిఫికేషన్స్ విభాగంలోనికి వెళ్ళండి.
స్టెప్ 2 : ఈ అప్లికేషన్స్ విభాగంలో, గూగుల్ మీద క్లిక్ చెయ్యండి.
స్టెప్ 3 : అందులో క్లియర్ కాచీ అని ఉన్న బటన్ను నొక్కండి. క్లియరింగ్ క్యాచీ పై క్లిక్ చేయడం వలన మీ పరికరం నుండి ఎటువంటి విలువైన డేటా తొలగించబడదు. మీరు క్లియర్ డేటా / క్లియర్ స్టోరేజ్ క్లిక్ చేయలేదు కాబట్టి.
స్టెప్ 4 : ఇప్పుడు మన ఫేవరేట్ ఆప్షన్ అనుసరించండి : అదే పరికరాన్ని రీస్టార్ట్ చేయడం. తర్వాత మరల గూగుల్ అసిస్టెంట్ తో సంభాషించి, సమస్య పరిష్కృతం అయినదో లేదో గమనించండి.

ఇన్ ఫుట్ మోడ్ తనిఖీ చేయండి:
గూగుల్ అసిస్టెంట్ మీతో సరిగ్గా వ్యవహరించలేకపోవడానికి కారణం మీరే కూడా అయి ఉండవచ్చు. మీరు బహిరంగ ప్రదేశాలలో, ప్రజల మధ్యలో ఉన్న సమయంలో గూగుల్ అసిస్టెంట్ వాయిస్ ఇవ్వడం కొంచం ఇబ్బందిగా ఉంటుంది అవునా ? ఈ సమస్యకు గూగుల్ అసిస్టెంట్లో పరిష్కారం కూడా అందుబాటులో ఉంటుంది. క్రమంగా వాయిస్ ద్వారా కాకుండా, టైప్ చేయడం ద్వారా గూగుల్ అసిస్టెంట్ తో వ్యవహరించవచ్చు. ప్రత్యుత్తరంగా వాయిస్ ద్వారా కాకుండా, టెక్స్ట్ రూపంలోనే గూగుల్ అసిస్టెంట్ సమాధానం ఇస్తుంది.
గూగుల్ అసిస్టెంట్ మీతో కమ్యూనికేట్ చేయలేని కారణాల్లో ఒకటిగా, మీ గూగుల్ అసిస్టెంట్ సెట్టింగ్స్లో "ప్రిఫర్డ్ ఇన్పుట్ మోడ్" లో మొదటిసారి అప్లికేషన్ కాన్ఫిగరింగ్ సమయంలో "టైపింగ్" ఎంచుకోవడం కూడా కారణంగా ఉండవచ్చు. మీరు సమాధానాలను వాయిస్ రూపంలో కోరుకుంటున్న ఎడల, దీనిని టెక్స్ట్ నుండి వాయిస్ గా మార్చవలసి ఉంటుంది. సెట్టింగ్స్ మార్చుట కొరకు, దిగువ ఇవ్వబడిన దశలను అనుసరించవలసి ఉంటుంది.
స్టెప్ 1 : గూగుల్ అసిస్టెంట్ అప్లికేషన్ తెరచి, ఎక్స్ప్లోర్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.
స్టెప్ 2 : ఎక్స్ప్లోరర్ స్క్రీన్ వెళ్ళిన తర్వాత, ఎగువ కుడి మూలలో ఉన్న మూడు చుక్కల ఐకాన్ మీద క్లిక్ చేసి, ఆపై మెనులో సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి.
స్టెప్ 3 : అందులో అసిస్టెంట్ సెట్టింగ్స్ విభాగంలో 'ఫోన్' అనే ఎంపికపై క్లిక్ చేయండి.
స్టెప్ 4 : ప్రిఫర్డ్ ఇన్ ఫుట్ ఎంపికకు వెళ్లి, దాని పాపప్ మెను నుండి, కీబోర్డ్ బదులుగా వాయిస్ ఎంచుకోండి.

టర్నింగ్ – ఆన్ స్పీచ్ అవుట్ ఫుట్ :
ఇన్ ఫుట్ మోడ్ కింద విభాగంలో, గూగుల్ స్పీచ్ అవుట్పుట్ ఉంటుంది. దీనిలో రెండు ఎంపికలు ఉంటాయి. ఒకటి "ఆన్" రెండు "హ్యాండ్స్-ఫ్రీ ఓన్లీ". మీరు సమాధానాలను వినాలని కోరుకుంటున్న ఎడల, 'ఆన్' ఆప్షన్ ఎంచుకోవలసి ఉంటుంది. మీరు "హ్యాండ్స్-ఫ్రీ ఓన్లీ" ఎంచుకున్న ఎడల, గూగుల్ అసిస్టెంట్ ప్రత్యుత్తరం వాయిస్ రూపంలో వినపడదు అని గుర్తుపెట్టుకోండి.
మీడియా వాల్యూమ్ పెంచడం, అప్లికేషన్స్ అప్డేట్ చేయడం లేదా ఓకే గూగుల్ కమాండ్ ఉచ్చరిస్తూ అసిస్టెంట్ ఓపెన్ చేయడం వంటివి కూడా గూగుల్ అసిస్టెంట్ సమస్యకు పరిష్కారంగా ఉండగలవు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470