ఆండ్రాయిడ్ మొబైల్స్‌‌ని ఓవర్ హీట్ సమస్య నుండి గట్టెక్కించడం ఎలా ?

|

మీరు ఆండ్రాయిడ్ మొబైల్ వాడుతున్నట్లయితే మీ మొబైల్స్ ఒక్కోసారి బాగా హీటెక్కుతూ ఉంటాయి.ఈ వేడి దెబ్బకి ఒక్కోసారి మొబైల్స్ పేలిపోయే ప్రమాదం కూడా ఉంది. మొబైల్ హీటెక్కడానికి అనేక రకాల కారణాలు ఉంటాయి. సాధారణంగా కనిపించే కారణాలతో మనం చాలా ఇబ్బందులు పడుతుంటాం. అయితే ఈ సమస్యను అధిగమించేందుకు కొన్ని రకాల చిట్కాలు ఉన్నాయి. ఈ చిట్కాలు పాటించినట్లయితే మన ఫోన్ ని ఓవర్ హీట్ నుండి రక్షించుకోవచ్చు. ఆ చిట్కాలేంటో ఓ సారి చూద్దాం.

ఆండ్రాయిడ్ నుండి PCకి ఫైల్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి 5 బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్

ఒరిజినల్ ఛార్జర్
 

ఒరిజినల్ ఛార్జర్

ప్రతి కంపెనీ మొబైల్ తయారీ సమయంలో దాని మీద డూప్లికేట్ ఛార్జింగ్ కేబుల్స్ ఉపయోగించకూడదని రాసి ఉంటుంది. దీని వల్ల ఫోన్ బ్యాటరీ పాడయ్యే ప్రమాదం ఉంది. ఫోన్ హీటెక్కడానికి కూడా ఇది ప్రధాన కారణం. కాబట్టి ఒరిజినల్ ఛార్జర్ ని మాత్రమే ఉపయోగించండి.

ఛార్జింగ్ పెట్టే సమయంలో చెక్ చేసుకోండి..

ఛార్జింగ్ పెట్టే సమయంలో చెక్ చేసుకోండి..

మీరు మీ ఫోన్ ఛార్జింగ్ సమయంలో ఇది చెక్ చేసకోవాలి. డే సమయంలో అయితే కేవలం 70 నుంచి 80 శాతం వరకు మాత్రమే ఛార్జింగ్ ఉండేలా చూసుకోండి. రాత్రి వేళ అయితే 100 శాతం ఛార్జింగ్ అయ్యేలా చూసుకోండి.

వైఫై

వైఫై

వైఫై కి ఫోన్ హీటింగ్ కి సంబంధం ఉండకపోవచ్చు. కాని ఒక్కోసారి దీని వల్ల కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. వైఫై ఉన్న సమయంలో బ్యాక్ గ్రౌండ్ యాప్స్ రన్ అవుతూ ఉంటాయి. కాబటటి వైఫై ఉన్న సమయంలో ఈ యాప్స్ ని మీరు చెక్ చేసుకోండి.

బ్లూటూత్
 

బ్లూటూత్

మీరు బ్లూటూత్ కాని జీపీఎస్ కాని అవసరం ఉన్నప్పుడే ఆన్ చేయడం. అనవసర టైంలో ఆన్ చేయడం వల్ల బ్యాటరీ త్వరగా ఛార్జ్ అయిపోతూ ఉంటుంది. దీనివల్ల ఫోన్ హీట్ కూడా ఎక్కుతుంది.

Multi-Tasking

Multi-Tasking

చాలామంది ఈ ఫీచర్ బాగుందని దీన్ని ఉపయోగిస్తుంటారు. అయితే ఇది బ్యాటరీని తినేస్తుంది. మీకు తెలియకుండానే వెనుక యాప్స్ రన్ అవుతుంటాయి. కాబట్టి దీనికి కొంచెం దూరంగా ఉండండి.

Don’t Overuse

Don’t Overuse

మీ ఫోన్ వాడకం వీలయినంతగా తగ్గిస్తే చాలా మంచింది. 24 గంటలు దానితోనే ఉండటం వల్ల మీ మొబైల్ కే కాకుండా మీకు కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Heavy streaming

Heavy streaming

యూట్యూబ్ వాడకాన్ని పూర్తిగా తగ్గిస్తే చాలామంచిది. లైవ్ స్ట్రీమింగ్ జోలికి వెళ్లకండి ఒక వేళ వెళ్లినా వీలయినంత తక్కువ సమయం కేటాయించండి.

Heavy gaming

Heavy gaming

ఫోన్ ఉంటే అందరూ గేమ్స్ మీదకే తమ దృష్టిని మరల్చుతారు.అయితే ఇది చాలా ప్రమాదం. దీన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నించండి.

Avoid Plastic and Leather Case

Avoid Plastic and Leather Case

ఫోన్ అందంగా కనపడాలని ఏవేవో కవర్లు వేస్తుంటారు. వాటి జోలికి వెళ్ళవద్దు. ముఖ్యంగా Plastic, Leather Caseల జోలికి అసలు వెళ్లవద్దు.

Damaged Battery, Water Damage

Damaged Battery, Water Damage

బ్యాటరీ డ్యామేజి అయిందని తెలిస్తే దాన్ని వెంటనే మార్చుకోవడం చాలా ఉత్తమం. లేకుంటే ఫోన్ పేలిపోయే ప్రమాదం ఉంది.అలాగే మీ ఫోన్ ని వాటర్ కి వీలయినంత దూరంగా ఉంచండి. ముఖ్యంగా స్నానం చేసే సమయంలో మ్యూజిక్ వినడం లాంటి పనులు చేయవద్దు.

Dim Your Screen Brightness

Dim Your Screen Brightness

మీరు ఫోన్ వాడే సమయంలో ఫోన్ బ్రైట్ నెస్ ని వీలయినంతగా తగ్గించుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఎక్కువ బ్రైట్ నెస్ మీ ఫోన్ బ్యాటరీని తినేస్తుంది. కాబట్టి మీకు ఎంత కావాలో అంత మాత్రమే సెట్ చేసుకోండి.

Clean Junk files, కూలింగ్ యాప్స్

Clean Junk files, కూలింగ్ యాప్స్

జంక్ ఫైల్స్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోండి. దీనికోసం కొన్ని రకాల యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని వాడండి. అలాగే ఫోన్ కూలింగ్ యాప్స్ వాడండి. Cooling Master-Phone Cooler,Device Cooler Heat Minimizer,Device Cooler - Cooling Master,Coolify లాంటి యాప్స్ వాడటం ద్వారా మీ ఫోన్ కూల్ గా ఉంచుకోవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
How To Fix Overheating Issues of Android Devices more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X