Home
How to

మీ ఫోన్‌ నీటిలో పడిందా..?

By Sivanjaneyulu

అనుకోకుండా మీ స్మార్ట్ ఫోన్ నీటిలో పడిందా..?, అలా ఏలా జరిగిందబ్బా అని మీలో మీరే కుములిపోకుండా సాధ్యమైనంత వరకు మీ ఫోన్‌ను కాపాడుకునేందుకు ఈ ఉపయుక్తమైన చిట్కాలను పాటించినట్లయితే నీటిలో తడిచిన మీ ఫోన్ సాధారణ స్థితికి వచ్చేసే అవకాశముంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

మీ ఫోన్‌ నీటిలో పడిందా..?

మీ ఫోన్ నీటిలో తడిచిన వెంటనే చేయకూడని పనులు ఫోన్‌ను ఎట్టి పరిస్థితిల్లోనూ ఆన్ చేయవద్దు. బటన్లను ప్రెస్ చేయటం కాని, ఫోన్‌ను షేక్ చేయటం కాని చేయవద్దు. మీకు ఫోన్ గురించి తెలిసి ఉంటేనే ఓపెన్ చేయకండి లేకుంటే ఫోన్‌ను ఓపెన్ చేయవద్దు.

మీ ఫోన్‌ నీటిలో పడిందా..?

మీకేమి తెలియకుండా ఫోన్‌ను ఇష్టమొచ్చినట్లు ఓపెన్ చేయటం వల్ల ఫోన్‌కు వారంటీ కోల్పొవల్సి వస్తుంది. తడిచిన ఫోన్ పై గాలిని ఊదే ప్రయత్నం చేయకండి. నీళ్లు లోపలి భాగాల్లోకి వెళ్లే ప్రమాదముంది. మీకు అవగాహన లేకుండా ఏ విధమైన హీట్ డ్రైయర్‌ను ఫోన్ పై ఉపయోగంచవచద్దు.

మీ ఫోన్‌ నీటిలో పడిందా..?

ఇలా చేయండి

ముందుగా ఫోన్‌ను ఓపెన్ చేసి సిమ్ అలానే మైక్రోఎస్డీ కార్డ్‌లను తొలగించండి. అలానే బ్యాటరీని కూడా ఫోన్ నుంచి వేరు చేయండి. క్లాత్ లేదా పేపర్ తీసుకుని చాలా సున్నితంగా ఫోన్‌లోని తడి ప్రాంతాలను డ్రై చేసే ప్రయత్నం చేయండి. చమ్మ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే వాక్యుమ్‌ను ఉపయోగించి డివైస్‌ను డ్రై అయ్యేలా చూడండి.

మీ ఫోన్‌ నీటిలో పడిందా..?

ఫోన్ తడిబారిన ప్రదేశం సాధారణ స్థాయికి వచ్చిన తరువాత జిప్‌లాక్ బ్యాగ్‌లో బియ్యాన్ని వేసి ఆ బియ్యంలో ఫోన్‌ను రెండు రోజుల పాటు కప్పి ఉంచండి. ఇలా గాలికూడా చేరలేని బిగుతైన వాతావరణంలో ఫోన్‌ను ఉంచటం వల్ల ఏదైనా చమ్మ మిగిలి ఉంటే ఆవిరైపోతుంది.

మీ ఫోన్‌ నీటిలో పడిందా..?

ఆ తరువాత ఫోన్‌ను బ్యాగ్ లోపలి నుంచి బయటకు తీసి బ్యాటరీ ఇంకా సిమ్‌లను అమర్చి స్విచ్ ఆన్ చేయండి. మీ ఫోన్ ఖచ్చితంగా పనిచేస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
How to fix a phone dropped in water. Read more in Telugu Gizbot....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X