Home
How to

ఐఫోన్‌ Xలో వైట్ స్క్రీన్ ఇష్యూని ఫిక్స్ చేయడం ఎలా ?

టెక్ గెయింట్ దిగ్గజం ఆపిల్ అత్యాధునిక హార్డ్ వేర్ తో పాటు సరికొత్త టెక్నాలజీతో తన కొత్త ఐఫోన్ ఎక్స్ ని రిలీజ్ చేసిన సంగతి అందరికీ విదితమే.

టెక్ గెయింట్ దిగ్గజం ఆపిల్ అత్యాధునిక హార్డ్ వేర్ తో పాటు సరికొత్త టెక్నాలజీతో తన కొత్త ఐఫోన్ ఎక్స్ ని రిలీజ్ చేసిన సంగతి అందరికీ విదితమే. ఈ ఫోన్ కి కంపెనీ నుంచి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్ అప్ డేట్ల వస్తూనే ఉన్నాయి.ఈ కొత్త ఓఎస్ ఎప్పటికప్పుడు కొత్త అప్ డేట్లను అందిపుచ్చుకుంటూ యూజర్లకు సరికొత్త అనుభూతిని అందిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే పాత అప్ డేట్లను కంపెనీ ప్రతి సంవత్సరంగా మార్చుకుంటూ వాటికి కొత్త అప్ డేట్లను అందిస్తూ వస్తోంది. ఇదిలా ఉంటే ఆపిల్ కంపెనీ కొత్త iOS 12 అప్ డేట్ ని ఈ మధ్య రిలీజ్ చేసింది. ఐఫోన్ ,ఐప్యాడ్ లు ఈ కొత్త ఫీచర్ ద్వారా 30 శాతం వేగంగా రన్ అవుతాయి. ఈ ఫీచర్ యూజర్లకు మంచి వార్త అయినప్పటికీ ఇందులో కొన్ని సమస్యలు వస్తున్నాయని యూజర్లు గగ్గోలు పెడుతున్నారు.

అప్ డేట్ సమయంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని చెబుతున్నారు....

అప్ డేట్ సమయంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని చెబుతున్నారు....

ఈ కొత్త ఫీచర్ అప్ డేట్ సమయంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. దీన్ని అప్ డేట్ చసే సమయంలో బగ్స్ ఇబ్బంది పెడుతున్నాయని దీని వల్ల ఫోన్ సనిచేయడం లేదని ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి.

ఈ సమస్య ఐఫోన్ ఎక్స్ యూజర్లకే వచ్చింది...

ఈ సమస్య ఐఫోన్ ఎక్స్ యూజర్లకే వచ్చింది...

మొదటగా ఈ సమస్య ఐఫోన్ ఎక్స్ యూజర్లకే వచ్చింది. ఈ కొత్త అప్ డేట్ ద్వారా యూజర్లు రాంగ్ మెసేజులు, ఛార్జింగ్ సమస్యలు, ఐమెసేజుల్లో ఇబ్బందులు, స్క్రీన్ రూపు రేఖలు మారిపోవడం, బ్యాటరీ డ్రెయిన్ కావడం, యాప్స్ పనిచేయకోవడం వంటి అనేక రకాల సమస్యలను ఎదుర్కున్నారు. ఈ విషయం మీదనే కంపెనీకి యూజర్లు ఫిర్యాదులు మీద ఫిర్యాదులు చేశారు.

 

 

 

iOS 12 అప్‌డేట్ తర్వాత...

iOS 12 అప్‌డేట్ తర్వాత...

iOS 12 అప్‌డేట్ తర్వాత చాలా మంది యూజర్లకు వాట్సప్ పనిచేయడం మానేసింది. అక్కడ స్క్రీన్ మొత్తం వైట్ గా మారిపోయింది. కాంటాక్ట్ట్స్ ఏమీ కనిపించడం లేదు. మెసేజ్ డెలివరీలో ఎటువంటి సమస్య లేదు కాని రిసీవ్ నోటిఫికేషన్లతోనే పెద్ద సమస్య వచ్చింది. వచ్చిన నోటిఫికేషన్ ఓపెన్ చేసిన తర్వాత స్క్రీన్ మొత్తం తెల్లగా మారిపోయి ఏమి కనిపించడం లేదని తెలుస్తోంది.

 కొన్ని ట్రిక్స్ పాటించడం ద్వారా దీని నుంచి బయటపడే అవకాశం ఉంది...

కొన్ని ట్రిక్స్ పాటించడం ద్వారా దీని నుంచి బయటపడే అవకాశం ఉంది...

అయితే ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాలమంది ప్రయత్నించినా అది సాధ్య పడటం లేదు. అయితే కొన్ని ట్రిక్స్ పాటించడం ద్వారా దీని నుంచి బయటపడే అవకాశం ఉంది.ఈ స్టెప్స్ ఫాలో అవడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడే అవకాశం ఉంది.

స్టెప్ 1

ముందుగా మీ ఐఫోన్ అన్ లాక్ ఓపెన్ చేయండి.

స్టెప్ 2

మెయిన్ మెనూలోకి వెళ్లండి.

స్టెప్ 3

వాట్సప్ ఐకాన్ ని ట్యాప్ చేసి గట్టిగా పట్టుకోండి.

స్టెప్ 4

అప్పుడు అక్కడ విగ్లే స్టార్ట్ అవుతుంది. టాప్ రైట్ కార్నర్ మీద పాప్ అప్ లో ఉండే లిటిట్ క్రాస్ మీద క్లిక్ చేయండి.

స్టెప్ 5

దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీ ఐఫోన్ ఎక్స్ లో వాట్సప్ అన్ ఇన్ స్టాల్డ్ అవుతుంది.

స్టెప్ 6

అది అయిన తరువాత మీ ఫోన్ ని రీస్టార్ట్ చేయండి.ఆ తర్వాత మీరు ఐఫోన్ యాప్ స్టోర్ నుండి కొత్తగా వాట్సప్ ని ఇన్ స్టాల్ చేయండి.

 

 

వాట్సప్ ఇన్ స్టాల్ చేసిన తర్వాత....

వాట్సప్ ఇన్ స్టాల్ చేసిన తర్వాత....

మీ ఫోన్ లో వాట్సప్ ఇన్ స్టాల్ చేసిన తర్వాత రీ స్టోర్ బ్యాకప్ చేసుకోండి. మీ పాత డేటా మొత్తం తిరిగి యధావిధి స్థానానికి వస్తుంది. ఈ టెక్నిక్ ద్వారా మీరు మీ ఫోన్ వైట్ స్క్రీన్ సమస్య నుండి బయటపడవచ్చు. దీంతో పాటు మీరు వాడే ఇతర యాప్ లలో కూడా ఇలాంటి సమస్యలు ఎదురైతే వెంటనే మీరు ఆ యాప్ ని అన్ ఇన్ స్టాల్ చేసి ఫోన్ రీ స్టార్ట్ చేయడం ద్వారా సమస్య నుండి గట్టెక్కవచ్చు.

 

 

Best Mobiles in India

English summary
How to fix white screen issue in iPhone X.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X