ఫోన్ స్టేటస్ బార్ పై ఇంటర్నెట్ రీడింగ్ తెలుసుకోవటం ఎలా..?

Posted By: BOMMU SIVANJANEYULU

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఓపెన్ సోర్స్ కావటంతో ఈ ప్లాట్‌ఫామ్‌ను పలు మొబైల్ తయారీ కంపెనీలు తమకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేస్తూ, తమకు అనుకూలమైన UIలను స్మార్ట్‌ఫోన్‌లలో పొందుపరిచటం జరుగుతోంది. అయితే, చాలా మంది యూజర్లకు ఈ కస్టమ్ యూజర్ ఇంటర్‌ఫేస్‌లు రుచించక పోవటంతో సాంప్రదాయ స్టాక్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ల వైపు చూస్తున్నారు. ప్యూర్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో ఇన్ బిల్డ్ కాబడిన స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో లభ్యమవుతున్నప్పటికి వాటికి కొన్ని కంపెనీల ఫోన్లలో మాత్రమే ఇంటర్నెట్ రీడర్ అనేది స్టేటస్ బార్‌లో యాడ్ అయి ఉంటుంది.

ఫోన్ స్టేటస్ బార్ పై ఇంటర్నెట్ రీడింగ్ తెలుసుకోవటం ఎలా..?

స్టేటస్ బార్ పై ఇంటర్నెట్ రీడర్ అందుబాటులో ఉండటం వల్ల యూజర్లు మొబైల్ డేటా వినియోగానికి సంబంధించిన తీరుతెన్నులను గ్రాఫ్ రూపంలో తెలుసుకునే వీలుంటుంది. ఈ సదుపాయం అందుబాటులో లేని యూజర్లు తమ ఫోన్ స్టేటస్ బార్‌లో ఇంటర్నెట్ రీడర్‌ను యాక్సిస్ చేసుకోవాలంటే ఓ యాప్‌ను ఆశ్రయించాల్సి ఉంది. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్టెప్ 1

ముందుగా గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి 'Internet Speed Meter' అనే అప్లికేషన్‌ను మీ ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి.

స్టెప్ 2

ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ పూర్తై యాప్ లాంచ్ అయిన తరువాత మీ డేటా యూసేజ్‌కు సంబంధించిన సమచారాన్ని మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ రూపంలో యాప్ చూపించటం జరుగుతంది. స్టేటస్ బార్ మధ్యలో కనిపించే అప్‌లోడ్/డౌన్‌లోడ్ మీటర్ ద్వారా డేటా యూసేజ్‌ను తెలుసుకునే వీలుంటుంది.

స్టెప్ 3

'Internet Speed Meter' అప్లికేషన్‌ను ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసుకునే వీలుంటుంది. మీటర్ పొజీషన్‌ను డివైస్‌లో ఎక్కడికి కావాలంటే అక్కడికి మార్చుకునే వీలుంటుంది. ఇదే సమయంలో డేటా లిమిట్స్‌ను కూడా ఆల్టర్ చేసుకోవచ్చు.

స్టెప్ 4

యాప్‌ను మీకు కావల్సిన విధంగా కస్టమైజ్ చేసుకునే క్రమంలో ముందుగా యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఫ్లోటింగ్ విడ్జెట్ పొజీషన్‌లను మార్చుకోవటంతో పాటు అపీరియన్స్, నోటిఫికేషన్స్ ఇంకా లాంక్ స్ర్కీన్ ఫీచర్లు అడ్జస్ట్ చేసుకోవల్సి ఉంటుంది.

 

ఎన్‌పెర్ఫ్ (nPerf)

మీ మొబైల్ కనెక్షన్ స్పీడుతో పాటు క్వాలిటీ వివరాలను తెలిపేందుకు nPerf పేరుతో మరో అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్‌లో సిద్ధంగా ఉంది. ఈ యాప్ ద్వారా స్ట్రీమింగ్, బ్రౌజింగ్, డౌన్‌లోడింగ్, అప్‌లోడింగ్‌కు ఖర్చవుతోన్న డేటా రిజల్ట్స్‌ను కూడా తెలుసుకునే వీలుంటుంది.

ఫిబ్రవరి 4న భూగ్రహం మొత్తం అంధకారం, వదంతులపై స్పందించిన నాసా..

డౌన్‌లోడింగ్ స్పీడుతో పాటు అప్‌లోడింగ్ స్పీడ్ వివరాలు..

ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇన్‌స్టాల్ చేసుకున్న తరువాత, యాప్ హోమ్ పేజ్ పై కనిపించే "Start Test" ఆప్షన్ పై టాప్ చేసినట్లయితే ఇంటర్నెట్ స్పీడుకు సంబంధించిన టెస్టింగ్ ప్రాసెస్ మొదలవుతుంది. టెస్ట్ ముగిసిన వెంటనే డౌన్‌లోడింగ్ స్పీడుతో పాటు అప్‌లోడింగ్ స్పీడ్ వివరాలు డిస్‌ప్లే కాబడతాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Android gives a lot of independence when it comes to tweaking their OS.Since some phones don't come with internet reader on their Android status bar, we have compiled a list of steps to make it possible on any Android phones.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot