ఆధార్ లేకుండా కొత్త సిమ్ కార్డు పొందడం ఎలా ?
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు ఆధార్ తప్పని సరి కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ప్రజా పంపిణీ, గ్రాస్ రాయితీలకు ఆధార్ కార్డు తప్పని సరిగా ఇవ్వాలని తెలిపింది
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు ఆధార్ తప్పని సరి కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ప్రజా పంపిణీ, గ్రాస్ రాయితీలకు ఆధార్ కార్డు తప్పని సరిగా ఇవ్వాలని తెలిపింది. ఆధార్‌లో పేర్కొన్న వ్యక్తిగత సమాచారం ఎవరికీ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పింది. ఆధార్ తప్పని సరి కాదని పత్రికలు, టీవీల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.ఈ నేపథ్యంలో కొత్త సిమ్ తీసుకోవాలనుకునేవారు ఆధార్ కార్డు లేకుండా కొత్త సిమ్ ఎలా పొందాలి. ప్రాసెస్ ఏంటి అనే అంశాలను మీకు అందిస్తున్నాం ఓ స్మార్ట్ లుక్కేయండి.

ఇతర వ్యక్తిగత ఐడెండిటీ కార్డులు
DoT (department of telecommunication) అఫిషియల్ గా కొన్ని వ్యక్తిగత కార్డు వివరాలతో సిమ్ కార్డు తీసుకోవచ్చని తెలిపింది. వీటిల్లో డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్టు, ఓటరు ఐడి, అడ్రస్ ఫ్రూప్ లాంటి వాటితో కొత్త సిమ్ కార్డును తీసుకోవచ్చు. మీరు సిమ్ కార్డు తీసుకునే వ్యక్తి దగ్గరకు వెళితే అతను మీ లైవ్ ఫోటోతో మీ వివరాలను స్కాన్ చేసి సిమ్ రిజిస్ట్రేన్ చేస్తాడు. ఈ ప్రాసెస్ మొత్తం డిజిటల్ గా చాలా ఫాస్ట్ గా జరిగిపోతుంది. ఈ ప్రాసెస్ తరువాత సిమ్ రిజిస్ట్రేషన్ చేసే వ్యక్తి ఓ యునిక్యూ ఐడీని మీకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మొత్తం KC ప్రాసెస్ ద్వారా జరుగుతుంది.

డిజిటల్ కెవైసి సిస్టం
కాగా ఇప్పటికే భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ లు కొత్త డిజిటల్ కెవైసి సిస్టం ద్వారా ఢిల్లీ, యుపి లాంటి ప్రాంతాల్లో సిమ్ రిజిస్ట్రేషన్లను ప్రారంభించాయి. ఈ ప్రాసెస్ లో మీరు ఆధార్ నంబరు ఇవ్వకపోయినా మీ సిమ్ డియాక్టివేట్ కాదు.

సిమ్ రిజిస్ట్రేషన్ సమయంలో...
వారు సిమ్ రిజిస్ట్రేషన్ సమయంలో మీకు ఇచ్చే కెవైసి నంబర్ ద్వారా మీరు కొత్త సిమ్ కార్డు యాక్టివేషన్ ఎప్పుడైనా పొందవచ్చు. తరువాత మీరు ఎటువంటి ఫ్రూపులు సబ్ మిట్ చేయనవరం లేదు. కేవలం ఆ కెవైసి నంబర్ ఒక్కటి ఉంటే సరిపోతుంది. ఈ నంబర్ ద్వారానే మీరు డాట్ కి కంప్లయిట్లు లాంటివి చేయవచ్చు.


Click it and Unblock the Notifications








