మీ బ్యాంక్ పాస్‌వర్డ్‌లను హ్యాకర్లు ఎలా లూటీ చేస్తారంటే..?

ఆన్‌లైన్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయ్.. సైబర్ నేరగాళ్లు ప్రమాదకర వైరస్‌లను వ్యాపింపజేస్తూ నెటిజనులు వ్యక్తిగత వివరాలను దొంగిలిస్తున్నారు. ముఖ్యంగా హ్యాకర్లు బ్యాంక్ అకౌంట్‌లకు సంబంధించిన వివరాలను దొంగిలించేందుకు రకరకాల వ్యూహాలను రచిస్తున్నారు. వాటి నుంచి మిమ్మల్ని అప్రమత్తం చేసేందుకు పలు సూచనలు..

Read More : Vivo కొత్త స్మార్ట్‌ఫోన్ V5s లాంచ్ అయ్యింది, ధర రూ.18,990

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బ్యాంక్ ప్రతినిధులమంటూ కాల్స్ చేస్తుంటారు..?

మీ బ్యాంక్ అకౌంట్ వివరాలను అడుగుతూ ఫోన్ కాల్ వస్తే స్పందించకండి. మీరు గుర్తుంచుకోవల్సిన విషయం ఏమిటంటే బ్యాంకు నిర్వాహకులు ఏ సందర్భంలోనూ ఫోన్ కాల్ ద్వారా వ్యక్తి గత వివరాలను కోరరు.

వర్చువల్ కీబోర్డులను మాత్రమే ఎంచుకోండి

ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేసే సందర్భంలో మాన్యువల్ కీబోర్డును కాకుండా ఆయా ఈ - బ్యాంకులు అందించే వర్చువల్ కీబోర్డులను మాత్రమే ఎంచుకోండి. ఇలా చేయటం ద్వారా హ్యాకర్లు మీ పాస్‌వర్డ్‌లను గుర్తించే వీలుండదు.

యాంటీ వైరస్ రక్షణ లేకుండా..?

యాంటీ వైరస్ రక్షణ లేని పీసీలను నెట్ బ్యాంకింగ్‌కు ఉపయోగించొద్దు. సరైన రక్షణ వ్యవస్థలేని పీసీలను హ్యాకర్లు సలువుగా ఆధీనంలోకి తీసుకోగలరు. కాబట్టి, యాంటీ వైరస్ తప్పనిసిరి.

అలా చేయకండి..

బ్యాంక్ అకౌంట్ ఇంకా పాస్‌వర్డ్ వివరాలను ఎవ్వరికి చెప్పకండి. వాటిని పుస్తకాల్లో కూడా రాయకండి. ఒకవేళ రాసుకున్నట్లయితే వాటిని ఇతరులు తెలుసుకోకుంగా జాగ్రత్తలు తీసుకోండి.

అన్ని అకౌంట్‌లకు ఒకే పాసవర్డ్‌ వద్దు...

అన్ని ఆన్‌లైన్ అకౌంట్‌లకు ఒకే పాసవర్డ్‌ను పెట్టకండి. ఇలా చేయటం వల్ల మీ పాసవర్డ్‌ అనుకోకుండా లీకైనట్లయితే మొత్తం అన్ని అకౌంట్స్ హ్యాక్ అయ్యే ప్రమాదం పొంచి ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How hackers take over your bank Account passwords. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting