వాట్సాప్‌లోని ‘లాస్ట్ సీన్’ టైమ్ స్టాంప్‌ను హైడ్ చేయటం ఏలా..?

Posted By:

వాట్స్‌యాప్ గురించి అంతగా అవగాహన లేని చాలమంది వినియోగదారులు గతంలో తమ మెసేజ్‌ల పక్కన కనిపించే గ్రే కలర్ టిక్ మార్క్‌లను చూసి అవతలి వాళ్లు మన సందేశాలను చదివేసారని భావించే వారు. వాస్తవానికి వాటి అర్థం అదికాదు. ఒక గ్రే టిక్ ఉంటే మీరు పంపిన సందేశం వాట్స్‌యాప్ సర్వర్‌కు చేరినట్లు, రెండు గ్రే‌టిక్స్ ఉంటే అవతలి వ్యక్తి ఫోన్‌కు ఆ మెసేజ్ వెళ్లినట్లని అర్థం. తాజాగా అందుబాటులోకి వచ్చిన బ్లూటిక్స్ ఫీచర్ అవతలి వ్యకి మన సందేశాలు చదివిన పిదప ఆ ధృవీకరణను రెండు బ్లూ ‌టిక్ మార్క్స్ రూపంలో మనకు చూపిస్తుంది.

నేటి ప్రత్యేక హౌ టూ శీర్షికలో భాగంగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ వాట్సాప్‌ అకౌంట్‌లోని ‘లాస్ట్‌ సీన్' టైమ్‌స్టాంప్‌ ఫీచర్‌ను హైడ్ చేసుకునేందుకు చిట్కాలను క్రింది స్లైడ్ షో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వాట్సాప్‌లోని ‘లాస్ట్ సీన్’ టైమ్ స్టాంప్‌ను హైడ్ చేయటం ఏలా..?

మీ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ 2.1 లేదా ఆ తరువాతి వర్షన్ పై పనిచేసేదిగా ఉండాలి.

వాట్సాప్‌లోని ‘లాస్ట్ సీన్’ టైమ్ స్టాంప్‌ను హైడ్ చేయటం ఏలా..?

తదుపరి చర్యంలో భాగంగా మీ ఫోన్ సెక్యూరిటీ ట్యాబ్‌లోని సెట్టింగ్స్ మెనూలోకి ప్రవేశించి ‘Download from Unknown Sources' ను ఎనేబుల్ చేయండి.

వాట్సాప్‌లోని ‘లాస్ట్ సీన్’ టైమ్ స్టాంప్‌ను హైడ్ చేయటం ఏలా..?

ఆ తరువాత వాట్సాప్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి www.whatsapp.com/Android/ విభాగంలోని ఏపీకే (అప్లికేషన్) ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసకోండి.

వాట్సాప్‌లోని ‘లాస్ట్ సీన్’ టైమ్ స్టాంప్‌ను హైడ్ చేయటం ఏలా..?

ఏపీకే ఫైల్ మీ డివైస్‌‌లో డౌన్‌లోడ్ అయిన తరువాత 'Package Installer', Verify and Install' అనే రెండు ఆప్షన్‌లను చూపుతుంది. వాటిలో మొదటి ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.

వాట్సాప్‌లోని ‘లాస్ట్ సీన్’ టైమ్ స్టాంప్‌ను హైడ్ చేయటం ఏలా..?

This application will make changes to WhatsApp అనే మేసెజ్ మీకు అందుతుంది. యాప్‌ను ఆల్టర్ చేసేందుకు మెసెజ్‌ను స్వాగతించండి.

వాట్సాప్‌లోని ‘లాస్ట్ సీన్’ టైమ్ స్టాంప్‌ను హైడ్ చేయటం ఏలా..?

తదుపరి చర్యగా మీ వాట్సాప్ అకౌంట్ అప్‌డేట్ కాబడుతుంది.

వాట్సాప్‌లోని ‘లాస్ట్ సీన్’ టైమ్ స్టాంప్‌ను హైడ్ చేయటం ఏలా..?

ఇప్పుడు మీ అకౌంట్ సెట్టింగ్స్‌లోని Privacy మెనూలోకి వెళ్లినట్లయితే Everyone, My Contacts, Nobody అనే మూడు సెలక్టివ్ ఆప్షన్‌లతో ‘లాస్ట్ సీన్' టైమ్ స్టాంప్ మోడ్ కనిపిస్తుంది. వాటిలో నచ్చిన ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to hide ‘Last Seen’ timestamp on WhatsApp. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot