కీబోర్డ్ టైపింగ్ మెరుగుపడాలంటే..?
విద్యార్థులు మొదలుకుని వ్యాపారుల వరకు టెక్నాలజీ ప్రపంచలో రాణించాలంటే ‘కీబోర్డ్ టైపింగ్' పై అవగాహన కలిగి ఉండాల్సిందే. పాతరోజుల్లో టైపింగ్‌లో నిష్ణాత సాధించాలంటే ఇన్స్‌స్టిట్యూట్‌కి వెళ్లి లోయర్ లేదా హయ్యర్ తరగతులతో శిక్షణ పొందాల్సి వచ్చేది. కాలానుగుణంగా చోటుచేసకున్న మార్పులు ఆన్‌లైన్ టైపింగ్ అప్లికేషన్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఈ యాప్స్ సౌలభ్యతతో ఆన్‌లైన్ ద్వారానే కీబోర్డ్ టైపింగ్ నేర్చుకోవచ్చు. వీడియోగేమ్ మాదిరిగా డిజైన్ చేయబడిన ఈ అప్లికేషన్స్ టైపింగ్‌ను ఆడుతూ..పాడుతూ నేర్చుకుంటున్న అనుభూతిని కలిగిస్తాయి.
టైపింగ్ సులువుగా నేర్చుకునేందుకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కీబర్.కామ్ (www.keybr.com) ఓ సులభమైన మార్గం. ఒకే క్లిక్‌తో సాధన ప్రారంభించవచ్చు. ఈ అప్లికేషన్‌ను ఓపెన్ చేసిన వెంటనే హోం పేజీలో విజువల్ గ్రాఫిక్స్‌తో కూడిన కీబోర్డ్ లేఅవుట్ దర్శనమిస్తుంది.

దాని ఆధారంగా వేళ్లని కదుపుతూ పైన కనిపించే టైక్స్ట్ మేటర్‌ని టైప్ చేయాలి. ఏర్పాటు చేసిన స్టేటస్ బార్‌లో స్పీడ్ వేగం ఇంకా చేసిన తప్పులు కనిపిస్తాయి.


Click it and Unblock the Notifications








