ఫోన్ బ్యాటరీ బ్యాకప్‌ను పెంచే చిట్కాలు

|

నేటితరం కమ్యూనికేషన్ అవసరాలను తీర్చటంలో స్మార్ట్‌ఫోన్‌లు క్రీయాశీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ డివైజుల ద్వారా అనేక సౌలభ్యతలను యూజర్లు పొందుతున్నారు. అనేక అప్లకేషన్‌లను స్మార్ట్‌ఫోన్ రన్ చెయ్యటం కారణంగా బ్యాటరీ బ్యాకప్ త్వరగా అయిపోతుంటుంది. కనీస అవగాహనతో పలు జాగ్రత్తులను పాటించటం వల్ల బ్యాటరీ సామర్ధ్యాన్ని కొంత మేర పొదుపు చేసేకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

సంచలనం రేపుతున్న శాటిలైట్ ఫోటోలు!

ఫోన్ బ్యాటరీ బ్యాకప్‌ను పెంచే చిట్కాలు!

ఫోన్ బ్యాటరీ బ్యాకప్‌ను పెంచే చిట్కాలు!

డిస్‌ప్లే:

బ్యాటరీ చార్జ్ త్వరగా తగ్గిపోటానికి గల ప్రధాన కారణం స్ర్కీన్. స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లేలు పెద్దవిగా ఉండటంతో ఎక్కువ శక్తిని వినియోగించుకుంటాయి. స్ర్ర్ర్కీన్ బ్రైట్‌నెస్‌ను అవసరానికి సరిపడా ఎంపిక చేసుకోవాలి. ఈ చర్యతో బ్యాటీరీ పవర్ కొంత మేర ఆదా అవుతుంది.

 

ఫోన్ బ్యాటరీ బ్యాకప్‌ను పెంచే చిట్కాలు!

ఫోన్ బ్యాటరీ బ్యాకప్‌ను పెంచే చిట్కాలు!

బ్లూటూత్ వెంటనే ఆఫ్:

బ్లూటూత్‌ను అవసరానికే ఉపయోగించుకోవాలి. చాలా మంది ఈ అప్లికేషన్‌ను ఆన్ చేసి వదిలేస్తారు. బ్లూటూత్ రన్ అయ్యే సందర్భంలో ఎక్కువ శక్తి కావల్సి ఉంటుంది, కాబట్టి ఈ అప్లికేషన్‌తో పని పూర్తి కాగానే ఆఫ్ చెయ్యటం మర్చిపోవద్దు.

 

ఫోన్ బ్యాటరీ బ్యాకప్‌ను పెంచే చిట్కాలు!

ఫోన్ బ్యాటరీ బ్యాకప్‌ను పెంచే చిట్కాలు!

డేటా వినియోగంలో జాగ్రత్త:

మ్యూజిక్ లేదా వీడియోలను స్ట్రీమ్ చేయ్యటం, 3జీ కనెక్టువిటీ సాయంతో డేటాను డౌన్‌లోడ్ చెయ్యటం వంటి సందర్భాల్లో బ్యాటరీ పవర్ ఎక్కువగా ఖర్చవుతుంది. కాబట్టి అవసరానికి మాత్రమే వీటిని వినియోగించుకోవాలి. బ్యాటరీలో పవర్ తక్కువుగా ఉన్నప్పుడు 3జీ కనెక్షన్‌ను ఆఫ్ చెయ్యటం మంచిది. ఆండ్రాయిడ్ యూజర్లు తమ తమ స్మార్ట్‌ఫోన్‌లలో పవర్ మేనేజిమెంట్ అప్లికేషన్‌లను నిక్షిప్తం చేసుకోవటం వల్ల బ్యాటరీని మరింత ఆదాచేసుకోవచ్చు.

 

ఫోన్ బ్యాటరీ బ్యాకప్‌ను పెంచే చిట్కాలు!

ఫోన్ బ్యాటరీ బ్యాకప్‌ను పెంచే చిట్కాలు!

కంప్యూటర్ డౌన్‌లోడ్ స్పీడ్ పెరగాలంటే..?

ఎప్పటికప్పుడు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ఐఎస్‌పీ)ని సంప్రదించి ఇంటర్నెట్ కనెక్షన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలి. డౌన్‌లోడింగ్ సమయంలో డెస్క్‌టాప్ పై తెరిచి ఉంచిన అప్లికేషన్‌లను క్లోజ్ చెయ్యటం మంచిది. అన్ని ఫైళ్లు ఒకేసారి కాకుండా ముఖ్యమైన వాటిని ముందుగా డౌన్‌లోడ్ చేసుకోవాలి. డేటా డౌన్‌లోడింగ్ విషయంలో సమయ పాలన అవసరం. సంబంధిత ఫైల్‌ను అందరూ ఒకేసారి డౌన్‌లోడ్ చెయ్యటం ప్రారంభిస్తే లోడింగ్ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశముంది.  డౌన్‌లోడ్ ఇన్స్‌టాలర్ అనే అప్లికేషన్‌ను ఇన్స్‌టాల్ చేసుకుని ట్రై చేసి చూడండి. ఈ ఫీచర్ డౌన్‌లోడింగ్ ప్రక్రియను వేగిరితం చేస్తుంది.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X