Home
How to

గూగుల్ పేకి షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు, మీరు వాడుతున్నారా ?

By Gizbot Bureau

పేమెంట్స్ చేయడానికి వినియోగదారులు ఎక్కువగా ఉపయోగిస్తున్న యాప్‌లలో 'గూగుల్ పే’ ఒకటి. వినియోగదారుడి ఫోన్ నంబర్, బ్యాంకు డిటెయిల్స్ ఆధారంగా ఈ యాప్ పని చేస్తుంటుంది. క్షణాల్లో డబ్బులు అవతలి వ్యక్తికి చేరుతుండటంతో.. ఈ యాప్ బాగా పాపులర్ అయ్యింది. అలాంటి యాప్‌పై కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆర్బీఐ లైసెన్స్ లేకుండానే గూగుల్ పే కార్యకలాపాలు నిర్వహిస్తుందంటూ ఢిల్లీ హైకోర్టులో అభిజిత్ మిశ్రా అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. పేమెంట్స్‌ అండ్‌ సెటిల్‌మెంట్స్‌ చట్టాన్ని ఈ యాప్ ఉల్లంఘిస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

జర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా, గూగుల్‌ సంస్థలకు నోటీసులు

జర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా, గూగుల్‌ సంస్థలకు నోటీసులు

గూగుల్‌ పే పై దాఖలైన పిటీషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా, గూగుల్‌ సంస్థలకు నోటీసులు జారీచేసింది. ఎలాంటి అధికారిక ధృవీకరణ లేకుండానే గూగుల్‌ యాప్‌ కార్యకలాపాలు ఎలా సాగిస్తోందని కోర్టు ప్రధానంగా ఆర్‌బీఐని ప్రశ్నించింది.

డిజిటల్‌ లావాదేవీలకు

డిజిటల్‌ లావాదేవీలకు

దీనిపై తమ స్పందన తెలియజేయాలని ఆర్‌బీఐ, గూగుల్‌ ఇండియాకు నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి రాజేంద్ర మీనన్, జస్టిస్ ఎ.జె. భంభాని నేతృత్వంలోని బెంచ్‌ ఆదేశించింది. డిమానిటైజేషన్‌ తరువాత డిజిటల్‌ లావాదేవీలకు పెరిగిన ప్రాధాన్యత నేపథ్యంలో డిజిటల్‌ పేమెంట్‌ యాప్‌లు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఆ కోవలోదే గూగుల్‌కు చెందిన మొబైల్‌ పే మెంట్‌ యాప్‌ గూగుల్‌ పే.

అభిజిత్‌ మిశ్రా అనే వ్యక్తి

అభిజిత్‌ మిశ్రా అనే వ్యక్తి

గూగుల్‌ పే యాప్‌ పేమెంట్స్‌ అండ్‌ సెటిల్‌మెంట్స్‌ చట్టాన్ని ఉల్లంఘించిందని, నగదు బదిలీకి సంబంధించి ఈ యాప్‌కు కేంద్ర బ్యాంకు నుంచి సరైన ధ్రువీకరణ లేదంటూ అభిజిత్‌ మిశ్రా అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

అధికారిక పేమెంట్‌ సిస్టమ్‌ ఆపరేటర్స్‌ జాబితాలో

అధికారిక పేమెంట్‌ సిస్టమ్‌ ఆపరేటర్స్‌ జాబితాలో

ఈ ఏడాది మార్చి 20న ఆర్‌బీఐ విడుదల చేసిన అధికారిక పేమెంట్‌ సిస్టమ్‌ ఆపరేటర్స్‌ జాబితాలో గూగుల్‌ పే పేరు లేదని కూడా ఆయన పేర్కొన్నారు. మిశ్రా పిటిషన్‌పై దర్యాప్తు చేపట్టిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

సంస్థకు అన్నీ అనుమతులు ఉన్నాయి

సంస్థకు అన్నీ అనుమతులు ఉన్నాయి

ఇదిలా ఉంటే ఢిల్లీ హైకోర్టు నోటీసుల నేపథ్యంలో గూగుల్ పే అన్ని అనుమతుల్ని కలిగి ఉన్నట్లు ఆ సంస్థ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. తమ భాగస్వామ్య బ్యాంకులకు ఓ టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్‌గా సేవలందిస్తున్నట్లు చెప్పారు.

ఆర్బీఐ నిబంధనల ప్రకారం

ఆర్బీఐ నిబంధనల ప్రకారం

ఆయా బ్యాంకుల ఖాతాదారుల చెల్లింపులను చేస్తున్నామని, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా పేమెంట్స్‌కు అనుమతినిస్తున్నామని వివరించారు. ఇది పేమెంట్ ప్రాసెసింగ్ లేదా సెటిల్మెంట్‌లో భాగం కాదని, ఇందుకు ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఎటువంటి లైసెన్సులు అక్కర్లేదన్నారు.

డేటా సమాచారాన్ని

డేటా సమాచారాన్ని

కాగా, డేటా సమాచారాన్ని స్థానికంగానే భద్రపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఈ విషయంలో భాగస్వామ్య బ్యాంకులు, ప్రభుత్వ సహకారం తీసుకుంటున్నట్లు గూగుల్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

Best Mobiles in India

English summary
How is Google Pay operating without authorisation: Delhi HC asks RBI more News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X