సిమ్ కార్డు యూజర్లకు షాక్, ఆధార్ లింక్ చేయకుంటే బ్లాక్, ఆఖరుతేదీ ఇదే !

సిమ్ వాడే యూజర్లకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. తమ సిమ్ నంబరుతో ఆధార్‌ను అనుసంధానం చేయకుంటే ఇక మొబైల్ సేవలు నిలిచిపోనున్నాయి.

By Hazarath
|

సిమ్ వాడే యూజర్లకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. తమ సిమ్ నంబరుతో ఆధార్‌ను అనుసంధానం చేయకుంటే ఇక మొబైల్ సేవలు నిలిచిపోనున్నాయి. ఆధార్-సిమ్ అనుసంధానానికి ప్రభుత్వం వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు గడువు ఇచ్చింది.

ఈ వారం యూజర్లను ఆకట్టుకున్న కథనాలుఈ వారం యూజర్లను ఆకట్టుకున్న కథనాలు

sim

ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ లింకింగ్‌ను మరింత వేగవంతం చేయాలని నిర్ణయించింది. అన్ని సిమ్‌కార్డులను ఆధార్ నంబరుతో నిజనిర్ధారణ చేసుకోవాలని, ఆధార్ నంబరుతో అనుసంధానం కాని సిమ్‌లను ఫిబ్రవరి 2018 తర్వాత డీయాక్టివేట్ చేయాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. సిమ్ కార్డుకి ఆధార్ ఎలా అనుసంధానం చేయాలో తెలుసుకుందాం.

ఇండియాకి రాకముందే ఈ ఫోన్‌ని 2.5 లక్షల మంది బుక్ చేసుకున్నారుఇండియాకి రాకముందే ఈ ఫోన్‌ని 2.5 లక్షల మంది బుక్ చేసుకున్నారు

బయెమెట్రిక్ ద్వారా

బయెమెట్రిక్ ద్వారా

మీరు ఏ సిమ్ అయితే వాడుతున్నారో ఆ సిమ్ స్టోర్ కెళ్లి మీ ఆధార్ వివరాలను సిమ్ కి అటాచ్ చేయమంటే బయెమెట్రిక్ ద్వారా వాళ్లు అటాచ్ చేస్తారు. ఇది ఉచితంగా చేస్తారు. అయితే కొన్ని చోట్ల డబ్బులు వసూలు చేస్తున్నారన్న వాదనలు కూడా వినబడుతున్నాయి.

ఫామ్ నింపి ఆధార్ కార్డ్ జీరాక్స్ జ‌త‌చేసి..

ఫామ్ నింపి ఆధార్ కార్డ్ జీరాక్స్ జ‌త‌చేసి..

రెండో ప్రాసెస్ కింద . మొబైల్ నెంబ‌ర్ ను ఆధార్ నెంబ‌ర్ తో అనుసంధానం చేయాలంటే మొబైల్ నెట్ వ‌ర్క్ ప్రొవైడ‌ర్ స్టోర్ కు వెళ్లి వాళ్లు ఇచ్చే ఫామ్ నింపి ఆధార్ కార్డ్ జీరాక్స్ జ‌త‌చేసి వాళ్లకు అందించాలి. ఫామ్ ఇచ్చిన రెండు నుంచి మూడు రోజుల్లో మొబైల్ నెంబ‌ర్ తో ఆధార్ అనుసంధానం అవుతుంది.

కొత్తగా సిమ్ తీసుకునేవాళ్లకు

కొత్తగా సిమ్ తీసుకునేవాళ్లకు

కొత్తగా సిమ్ తీసుకునేవాళ్లకు క‌స్ట‌మ‌ర్ బ‌యోమెట్రిక్, ఆధార్ బ‌యోమెట్రిక్ మ్యాచ్ అయితేనే మొబైల్ నెట్ వ‌ర్క్ సిమ్ కార్డ్స్ ను యాక్టివేట్ చేస్తున్నాయి. దీనిపై సుప్రీం కోర్టు ఆర్డ‌ర్స్ కూడా ఇచ్చింది.

ఫిబ్ర‌వ‌రి 2018 వ‌ర‌కే గ‌డువు

ఫిబ్ర‌వ‌రి 2018 వ‌ర‌కే గ‌డువు

మొబైల్ నెంబ‌ర్ ను ఆధార్ నెంబ‌ర్ తో లింక్ చేసుకోవ‌డానికి ఫిబ్ర‌వ‌రి 2018 వ‌ర‌కే గ‌డువు గా పేర్కొంటూ ఫిబ్ర‌వ‌రి 2017 లోనే సుప్రీం తీర్పు చెప్పింది. స‌రిగ్గా ఒక సంవ‌త్స‌రం లోపున ప్ర‌తి మొబైల్ నెంబ‌ర్ ను ఆధార్ నెంబ‌ర్ తో వెరిఫై చేసుకోవాల్సిందిగా సుప్రీం పేర్కొన్న‌ది.

2018 లోపు

2018 లోపు

ఒక‌వేళ ఫిబ్ర‌వ‌రి 2018 లోపు మొబైల్ నెంబ‌ర్ ను ఆధార్ తో లింక్ చేసుకోలేక‌పోతే ఆ మొబైల్ నెంబ‌ర్ సిమ్ ను డియాక్టివేట్ చేయాల్సిందిగా టెలికం కంపెనీల‌కు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.

త‌ప్పుడు ఐడెంటిటీతో సిమ్

త‌ప్పుడు ఐడెంటిటీతో సిమ్

మొబైల్ ఆప‌రేట‌ర్స్ వ‌ద్ద క‌స్ట‌మ‌ర్ కు సంబంధించిన బ‌యోమెట్రిక్ స్టోర్ అవ్వ‌క‌పోవ‌డం, క‌స్ట‌మ‌ర్ ప‌ర్స‌న‌ల్ డేటా కూడా మొబైల్ నెట్ వ‌ర్క్స్ కు యాక్సెస్ లేక‌పోవ‌డంతో త‌ప్పుడు ఐడెంటిటీతో సిమ్ తీసుకునే వాళ్లు పెరిగిపోతున్నారు. దీంతో సిమ్ ని ఉపయోగించే ఉగ్ర‌వాదులు, క్రిమిన‌ల్స్, మోస‌గాళ్ల‌ు పెరిగిపోతున్నారు.

ఫోన్ నెంబ‌ర్ తో ఆధార్ సీడింగ్ వ‌ల్ల

ఫోన్ నెంబ‌ర్ తో ఆధార్ సీడింగ్ వ‌ల్ల

ఫోన్ నెంబ‌ర్ తో ఆధార్ సీడింగ్ వ‌ల్ల త‌ప్పుడు చిరునామాతో సిమ్ కార్డులు తీసుకొని దుశ్చ‌ర్య‌ల కోసం వాటిని ఉప‌యోగించే వారికి అడ్డుక‌ట్ట వేయొచ్చ‌ని కేంద్రం కూడా భావిస్తున్న‌ది.

Best Mobiles in India

English summary
How to link Aadhaar with mobile number, if you have still not linked SIM to UIDAI card Read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X