సులభంగా మీ ఆధార్ ను పీఎఫ్ అకౌంట్‌తో లింక్ చేసుకోండిలా..

Posted By: M KRISHNA ADITHYA

ఈపీఎఫ్ఓ (ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) ఇప్పుడు ఆన్‌లైన్ సేవలను మరింత విస్తృత‌పరుస్తోంది. ముఖ్యంగా మీ యూఎఎన్ నంబర్ ను ఆధార్ కార్డుకు లింక్ చేసుకోవడాన్ని మరింత సరళతరం చేశారు. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడే చూద్దాం.

సులభంగా మీ ఆధార్ ను పీఎఫ్ అకౌంట్‌తో లింక్ చేసుకోండిలా..

ఆధార్ లింక్ ఇప్పుడు ప్రతీ అవసరానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనితో ముడిపెడుతున్నాయి. ముఖ్యంగా మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్స్, పాన్ కార్డ్, పాస్ పోర్ట్ సహా తదితర అన్ని సర్వీసులకు ఆధార్ లింక్ తప్పనిసరి అయ్యింది. ప్రస్తుతం మీ ఈపీఎఫ్ ను ఆధార్ తో లింక్ చేయడం అనేది తప్పనిసరి అయ్యింది.

సాధారణంగా మాన్యువల్ గా ఈపీఎఫ్ ఫారం నింపేటప్పుడే యూఎఎన్ నెంబర్ తో పాటు ఆధార్ నెంబర్ ను జత చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఈపీఎఫ్ఓ పూర్తిగా ఆన్ లైన్ విధానాన్ని అవలంబిస్తోంది. ఈపీఎఫ్ఓ సైట్ లోకి వెళ్లి కూడా మీ పీఎఫ్ నెంబర్ తో ఆధార్ ను లింక్ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యూఎఎన్ నెంబర్ ను ఆధార్ తో లింక్ చేసుకోండిలా..

మీ పన్నెండు అంకెల యుఎఎన్ ( యూనివర్సల్ అకౌంట్ నెంబర్) ను ఈపీఎఫ్‌వో ద్వారా పొందాల్సి ఉంటుంది. అయితే ఆన్‌లైన్ లో మీ యుఎఎన్ నెంబర్ ను ఈపీఎఫ్ పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా తెలుసుకోవచ్చు.

మొదటి స్టెప్ :

మొదటగా ఈపీఎఫ్‌వో సైట్ లోకి వెళ్లండి. ఆన్ లైన్ సర్వీసుల కింద ఉన్న ఈ కెవైసీ పోర్టల్ ను క్లిక్ చేయండి.

రెండో స్టెప్ :

అక్కడ యుఎఎన్ నెంబర్ కాలమ్ లో నెంబర్ వేయండి. అలాగే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ జనరేట్ ఆప్షన్ ను క్లిక్ చేయండి.

మూడో స్టెప్ : మీ మొబైల్ ఫోన్ లో ఓటీపీ మెసెజ్ వచ్చిన అనంతరం. ఆ నెంబర్ ను కన్ఫార్మ్ ఓటీపీలో టైప్ చేయండి. తర్వాత దాని కిందే ఉన్న 12 అంకెల ఆధార్ నెంబర్ తో దాన్ని జత చేసి సబ్‌మిట్ ఆప్షన్ క్లిక్ చేయండి.

నాలుగో స్టెప్ : అనంతరం మీకు స్క్రీన్ పై మీకు యుఎఎన్ నెంబర్, అలాగే ఆధార్ నెంబర్ ప్రత్యక్షమవుతాయి. దాని కిందే ప్రొసీడ్ ఫర్ వెరిఫికేషన్ ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి.

ఇప్పుడు మీ పీఎఫ్ ఖాతాలో ఉన్న పూర్తి పేరు, జన్మ తేదీలు ఆధార్ తో పోల్చే ప్రక్రియ జరుగుతుంది. ఈ ప్రక్రియ సక్సెస్ అయితే మీ ఈపీఎఫ్ అకౌంట్ ఆధార్ తో లింక్ జరిగినట్లే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
The EPFO has launched an online service that allows members to link their PF account’s UAN number with Aadhaar. Here’s how to go about it.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot