Liquid Cooling System అంటే ఏమిటి ? అది ఎలా పనిచేస్తుంది

ఈ మధ్య తరచుగా Liquid Cooling System అనే పదాన్ని ఎక్కువుగా వింటున్నాం. దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు మార్కెట్లోకి రాబోతున్న మొబైల్స్ దాదాపు ఈ Liquid Cooling System తోనే వస్తున్నాయి.

By Anil
|

ఈ మధ్య తరచుగా Liquid Cooling System అనే పదాన్ని ఎక్కువుగా వింటున్నాం. దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు మార్కెట్లోకి రాబోతున్న మొబైల్స్ దాదాపు ఈ Liquid Cooling System తోనే వస్తున్నాయి.ఇంతకీ ఈ Liquid Cooling System అంటే ఏంటి ఇది ఎలా పనిచేస్తుంటుంది ఇది మీరు వాడే మొబైల్స్ కి ఎంత అవసరమో అనేది ఈ శీర్షిక ద్వారా మీకు తెలుపుతున్నాము .ఓ లుక్కేయండి

మొదటగా కంప్యూటర్ కే....

మొదటగా కంప్యూటర్ కే....

ఇది కేవలం మొబైల్స్ కే కాదు మీరు వాడే కంప్యూటర్ కి కూడా చాల అవసరమైంది. నిజానికి ఈ Liquid Cooling System టెక్నాలజీ మొదటగా కంప్యూటర్ కీ వచ్చింది ఇప్పుడు మైబైల్స్ లో కూడా వస్తుంది . కంప్యూటర్ CPU హీట్ అవ్వకుండా ఉండాలని ఈ Liquid Cooling System ని తీసుకొచ్చారు.

ఇది ఎలా పని చేస్తుందంటే....

ఇది ఎలా పని చేస్తుందంటే....

దీనికి ఒక రేడియేటర్ ను ఉపయోగించబడుతుంది. ఈ రేడియేటర్ కి రెండు రంధ్రాలు ఉంటాయి ఈ రెండు రంద్రాలలో నుంచి ట్యూబ్స్ కనెక్ట్ చేసి ఆ ట్యూబ్స్ ను తీసుకొని వెళ్లి CPU వద్ద ఉన్న ఫ్యాన్ యొక్క కాపర్ ప్లేట్ కి ఈ రెండు ట్యూబ్స్ కు కనెక్ట్ చేయబడుతుంది. ట్యూబ్ కి రెండో సైడ్ రేడియేటర్ ఉంటుంది ఆ రేడియేటర్ లో liquid ఉంటుంది అందులో నీళ్లు అయినా నింపవచ్చు లేదా బయట మార్కెట్ లో అందుబాటులో ఉన్న కూలింగ్ లిక్విడ్ ని అయిన నింపవచ్చు. అందులో నీళ్లు డ్రెయిన్ అయ్యే కొద్దీ అందులో నీళ్లు నింపుతూ ఉండాలి. ఎప్పుడైతే CPU హీట్ అవుతుందో కనెక్ట్ చేసిన ఒక ట్యూబ్ నుంచి హాట్ వాటర్ రేడియేటర్లోకి పోతుంటుంది.CPU కి ఉన్న బయట ఫ్యాన్ ద్వారా రేడియేటర్ లో ఉన్న వాటర్ కూల్ అవుతూ ఉంటుంది. కూల్ అయిన తరువాత కనెక్ట్ చేసిన రెండో ట్యూబ్ ద్వారా CPU వద్దకు కూలింగ్ వాటర్ చేరుతుంది. ఈ విధంగా కంప్యూటర్ కి ఈ Liquid Cooling System పని చేస్తుంది .

మొబైల్ కి ఇది ఎలా పని చేస్తుందంటే....

మొబైల్ కి ఇది ఎలా పని చేస్తుందంటే....

CPU మరియు GPU ఏదైతే ప్రాసెసర్ ఉంటుందో దానికి ఒక థర్మల్ ప్లేట్ ను ఫిట్ చేయబడుతుంది. ఆ ప్లేట్ మీద నుంచి చిన్న కాపర్ ట్యూబ్ ను సెట్ చేస్తారు.ఆ ట్యూబ్ లో లిక్విడ్ ని నింపుతారు. ఆ కాపర్ ట్యూబ్ ను ప్రాసెసర్ మీద ఉన్న థెర్మల్ ప్లేట్ కి అటాచ్ చేయబడుతుంది.ఎప్పుడైతే ప్రాసెసర్ హీట్ అవుతుందో ఈ థర్మల్ ప్లేట్ హీట్ ను తీసుకుంటుంది.ఆ హీట్ ను తీసుకొని సెట్ చేసిన కాపర్ ట్యూబ్ లో ఉన్న లిక్విడ్ కి అందిస్తుంటుంది. ఈ విధంగా ప్రాసెసర్ కు ఉన్న వేడిని థర్మల్ ప్లేట్ తీసుకోగానే అక్కడి నుంచి ట్యూబ్ లోకి వెళ్లిపోతుంటుంది.ట్యూబ్ ఒక సైడ్ నుంచి హీట్ వస్తుంటే మరొక సైడ్ నుంచి హీట్ అంత వెళ్లిపోతుంటుంది. ఈ విధంగా మొబైల్ కి Liquid Cooling System పని చేస్తుంది .

Best Mobiles in India

English summary
How Liquid Cooling System works In Mobile Phones and Computers.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X