డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ఫోన్ ముట్టుకోకుండా మెసేజ్‌కు రిప్లై ఇవ్వటం ఎలా..?

|

డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ఫోన్ టెక్స్టింగ్ చాలా ప్రమాదకరమని పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని చాలా మంది పెడచెవిన పెట్టేస్తున్నారు. డ్రైవింగ్ చేస్తున్నసమయంలో స్మార్ట్‌ఫోన్‌లను వాడటం కారణంగా డ్రైవింగ్ పై ఏకాగ్రత దెబ్బతింటుంది, ఈ కారణంగా ఎటువంటి అనర్థాలైనా జరగొచ్చు.

డ్రైవింగ్ సమయంలో ఫోన్ ముట్టుకోకుండా మెసేజ్‌కు రిప్లై ఇవ్వటం ఎలా..?

Read More : స్మార్ట్‌ఫోన్‌ల పై పండుగ ఆఫర్.. 20 డిస్కౌంట్ డీల్స్ ఇవే!

కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రాణ నష్టం కూడా సంభవించే అవకాశముంది. కాబట్టి డ్రైవింగ్ సీటులో కూర్చున్నప్పుడు సాధ్యమైనంతవరకు వరకు ఫోన్ టెక్స్టింగ్ లకు దూరంగా ఉండండి.

డ్రైవింగ్ సమయంలో ఫోన్ ముట్టుకోకుండా మెసేజ్‌కు రిప్లై ఇవ్వటం ఎలా..?

Read More : స్మార్ట్‌ఫోన్‌లలో ఉండే 9 సెన్సార్లు, వాటి ప్రత్యేకతలు మీకు తెలుసా..?

అత్యవసర పరిస్థితుల్లో కొన్ని ముఖ్యమైన మెసేజ్‌లకు వెంటనే స్పందించాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో హ్యాండ్స్- ఫ్రీ మెసేజింగ్ ఆప్షన్‌ను మీరు ఎంపిక చేసుకున్నట్లయితే రిస్క్ కాస్త తగ్గుతుంది. ఆండ్రాయిడ్ అలానే ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లలో వాయిస్ కమాండ్స్ ఆధారంగా మెసెజ్‌లను టాకిల్ చేసే విధానాన్ని ఇప్పుడు చూద్దాం...

టిప్ 1

టిప్ 1

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం గూగుల్ ‘Google Now' పేరుతో శక్తివంతమైన టూల్‌ను లాంచ్ చేసింది. వాయిస్ కమాండ్స్ ఆధారంగా స్పందించే ఈ హ్యాండ్స్ - ఫ్రీ టూల్ మీ వాయిస్ కమాండ్స్ ఆధారంగా పనిచేస్తుంది.

టిప్ 2

టిప్ 2

ఇంటర్నెట్ యాక్టివేట్ చేసి ఉన్న మీ ఆండ్రాయిడ్ ఫోన్ మైక్రోఫోన్‌కు వినిపించేలా "OK, Google" అని చెప్పండి. వెంటనే ‘Google Now' మీ మాటలు వినే ప్రయత్నం చేస్తుంది. తాజాగా పొందుపరిచన అప్‌డేట్‌లో భాగంగా గూగుల్ నౌ వాయిస్ కమాండ్ ఫీచర్ మెసేజ్‌లను కూడా చదువుతోంది.

టిప్ 3

టిప్ 3

‘Google Now' వాయిస్ టూల్‌ను ఉపయోగించుకుని మీ ఫోన్‌కు వచ్చిన చివరి సందేశాన్ని చెక్ చేసుకోవాలనుకుంటే ఫోన్ మైక్రోఫోన్ కు వినిపించేలా "OK, Google" show my last messages on phone అని కమాండ్ ఇవ్వండి.

టిప్ 4

టిప్ 4


వెంటనే గూగుల్ మీ ఫోన్ చివరిగా వచ్చిన 5 మెసేజ్‌లను చూపిస్తుంది. ఆ మెసేజ్‌లను మీరు వినాలనుకుంటే ‘గూగుల్ నౌ' ఆ మెసెజ్‌లను చదివి వినిపించటంతో పాటు రిప్లై ఇవ్వమంటారా అని కూడా అడుగుతుంది.

టిప్ 5

టిప్ 5

గూగుల్ నౌ తరహాలోనే యాపిల్ కూడా తన ఐఫోన్‌లకు సిరి (Siri) పేరుతో పర్సనల్ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్‌ను అందిస్తోంది.

టిప్ 6

టిప్ 6

ఈ హ్యాండ్స్ ఫ్రీ టూల్ ద్వారా ఐఫోన్ యూజర్లు వాయిస్ కమాండ్స్ ఆధారంగా మెసేజ్‌లకు రిప్లై ఇవ్వొచ్చు. ఈ సౌకర్యాన్ని యూజర్లు ఉపయోగించుకోవాలంటే ముందుగా ఈ ఫీచర్‌ను తమ ఫోన్‌లలో ఎనేబుల్ చేసుకోవల్సి ఉంటుంది.

టిప్ 7

టిప్ 7

సిరి ఎనేబుల్ అయిన తరువాత యాక్టివేట్ చేసుకునేందుకు ఫోన్ మైక్రోఫోన్ కు వినిపించేలా "Hey, Siri" Read my text messages అని వాయిస్ కమాండ్ ఇస్తే చాలు, వెంటనే మీ ఫోన్ మెసెజ్ లను లొకేట్ చేసి Siri వాటిని చదవటం ప్రారంభిస్తుంది.

టిప్ 8

టిప్ 8

ముందుగా మొదటి మెసేజ్‌ను చదివి రిప్లై ఇవ్వమంటారా అని అడుగుతుంది. మీరు సింపుల్‌గా YES లేదా NO అని చెప్పటం ద్వారా సిరి ఫీచర్ ముందుకు ప్రొసీడ్ అవుతుంది.

Best Mobiles in India

English summary
How to listen and reply to text messages on Phone while Driving with Saftey. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X