ఐపీఎల్ 2015ను మీ స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ ఇంకా పీసీలో వీక్షించటం ఏలా..?

Posted By:

క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తూ ఐపీఎల్ 2015 ఎడిషన్ బుధవారం ప్రారంభమైంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఆరంభ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై కోల్ కతా నైట్ రైడర్స్ విజయఢంకా మోగించింది.

 ఐపీఎల్ 2015ను మీ స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ ఇంకా పీసీలో వీక్షించటం ఏలా..

నవ్వా-నేనా అంటూ సాగుతున్న ఈ మ్యాచ్‌లను ఇంటల్లిపాది ఉత్కంఠభరితంగా వీక్షిస్తున్నారు. సరిగ్గా మ్యాచ్ సమయంలోనే బయటకు వెళ్లాల్సి వస్తే..?, ఆ ఉత్కంఠ భరిత క్షణాలను మిస్ కావల్సి వస్తుందని ఫీల్ అవకండి. ఆన్‌లైన్ ద్వారా ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించే సౌలభ్యతను పలు ఆన్‌లైన్ సంస్థలు కల్పిస్తున్నాయి. ఈ సౌలభ్యతతో మీ స్మార్ట్ ఫోన్ స్ర్కీన్ పైనే స్కోరును తెలుసుకోవచ్చు. ఒకవేళ మ్యాచ్‌స్టార్ట్ అయ్యే సమయానికి మీరు ఆఫీస్‌లోనే ఉండాల్సి వస్తే మీ ఆఫీసులోని పీసీ ఇంటర్నెట్ సౌకర్యాన్ని కలిగి ఉన్నట్లయితే ఆన్‌లైన్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఎంచక్కా మ్యాచ్‌ను వీక్షించవచ్చు.

ఐపీఎఎల్ 2015 ఎడిషన్‌ పోటీలను స్మార్ట్‌ఫోన్‌లో వీక్షించాలనుకుంటున్నారా..?

 ఐపీఎల్ 2015ను మీ స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ ఇంకా పీసీలో వీక్షించటం ఏలా..

హాట్‌స్టార్ అనే యాప్ ద్వారా ఐపీఎఎల్ 2015 ఎడిషన్‌ టీ20 క్రికెట్ మ్యాచ్ లను ఉచితంగా వీక్షించవచ్చు. ఈ యాప్ ఆండ్రాయిడ్ , ఐఓఎస్  ఇంకా విండోస్ ఫోన్‌ల కోసం అందుబాటులో ఉంది. ఏ విధమైన సబ్ స్ర్కిప్షన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఐపీఎఎల్ 2015 ఎడిషన్‌ పోటీలను టాబ్లెట్‌లో వీక్షించాలనుకుంటున్నారా..?

 ఐపీఎల్ 2015ను మీ స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ ఇంకా పీసీలో వీక్షించటం ఏలా..

స్టార్‌స్పోర్ట్స్ పెప్సీ ఐపీఎల్ 2015 ఆన్ ఆండ్రాయిడ్  లేదా స్టార్‌స్పోర్ట్స్ : లైవ్ స్కోర్స్ అండ్ స్ట్రీమింగ్ ఫర్ పెప్సీ ఐపీఎల్ 2015
యాప్‌లను మీ టాబ్లెట్ పీసీలో ఇన్‌స్టాల్ చేసుకున్నట్లయితే ఐపీఎఎల్ 2015 ఎడిషన్‌ పోటీలను ఎంచక్కా ఆస్వాదించవచ్చు.

ఐపీఎఎల్ 2015 ఎడిషన్‌ పోటీలను కంప్యూటర్ లో వీక్షించాలనుకుంటున్నారా..?

హాట్‌స్టార్ వెబ్‌సైట్‌లోని పెప్సీ ఐపీఎల్ లైవ్‌స్ట్రీమ్ పేజ్ ద్వారా ఐపీఎఎల్ 2015 ఎడిషన్‌ పోటీలను కంప్యూటర్‌లో వీక్షించవచ్చు.

English summary
How to Live Stream IPL 2015 Free on Your Smartphone, PC, or Tablet.Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot