ఆన్ లైన్ లో ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ గుర్తించడం ఎలా?

Posted By: Madhavi Lagishetty

ఆధారే అన్నింటికి ఆధారం. మొబైల్ నెంబర్స్, బ్యాంక్ అకౌంట్, డ్రైవింగ్ లైసెన్స్ ...చివరికి ఫేస్ బుక్ వాడాలన్నా ఆధార్ తప్పనిసరి. ఇండియాలో నివసిస్తున్న ప్రతి పౌరుడికి 12 అంకెలు గల ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలని భారత ప్రభుత్వం ఎప్పుడో తేల్చి చెప్పింది.

ఆన్ లైన్ లో ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ గుర్తించడం ఎలా?

గతంలో నానా ఇబ్బందులు పడి ఆధార్ అప్లై చేయాల్సి వచ్చేది. కానీ అందులోతప్పులు ఉంటే... ఆ తప్పులను సరిదిద్దుకోవడం చాలా కష్టమయ్యేది. కానీ ఇప్పుడు అది చాలా సులభం. మీ పేరు, అడ్రెస్ లేదా ఇతర వివరాలతో ఏదైనా తప్పులు వాటిని సరిచేసుకోవచ్చు. అయితే ఆధార్ సెంటర్లు మీ ప్రాంతానికి సమీపంలో ఎక్కడున్నయో తెలుసుకోవచ్చు.

ఇండియాలో బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్లతో సహా 25,000కేంద్రాలు ఉన్నాయి. DIDAI వెబ్ సైట్ (https://uidai.gov.in/) ను ఫాలో అవ్వండి. మీకు కావాలసిన ఎన్రోల్మెంట్ సెంటర్ ను సెర్చ్ చేయవచ్చు. తర్వాత అప్ డేట్ సెంటర్స్ పై క్లిక్ చేయండి. మీరు మీకు మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిని ద్వారా మీరు సెర్చ్ చేయవచ్చు.

1. రాష్ట్రం నుంచి సెర్చ్ చేయడం.

2. పిన్ కోడ్ సహాయంతో సెర్చ్ చేయడం

3. సెర్చ్ బాక్స్ ను ఉపయోగించడం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Search Criteria – State

మీరు రాష్ట్రం నుంచి సెర్చ్ చేయడాన్ని సెలక్ట్ చేసుకున్నట్లయితే..మీరు రాష్ట్రం, జిల్లా, సబ్ డిస్ట్రిక్, VTC(గ్రామం, టౌన్, సిటీ) కావాల్సిన ఆప్షన్ సెలక్ట్ చేసుకోవల్సి ఉంటుంది. దీనికోసం డ్రాప్ డౌన్ మెను జాబితా కనిపిస్తుంది. పర్మినెంట్ సెంటర్స్ కోసం మీరు వెతుకుతున్నట్లయితే..మీరు చెక్ బాక్స్ ను తనిఖీ చేయండి. పూర్తి చేసిన తర్వా...వెరిఫికేషన్ కోడ్ను ఎంటర్ చేసి సెర్చ్ పై క్లిక్ చేయండి.

Search Criteria - Pin Code

ఈ స్టెప్ చాలా సులభంగా ఉంటుంది. మీరు మీ పిన్ కోడ్ ద్వారా మీ ప్రాంతంలో ఆధార్ కేంద్రాన్ని గుర్తించవచ్చు. మీ లోకేషన్ను గుర్తించిన తర్వాత...వేరిఫికేషన్ కోడ్ను ఎంటర్ చేసి..సెర్చ్ పై క్లిక్ చేయండి. ఇఫ్పుడు పర్మినెంట్ కేంద్రాల గురించి మీరు వెతుకుతున్నట్లయితే...చెక్ బాక్స్ ను సెర్చ్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత...జీమ్యాప్స్ నుంచి లొకేషన్ తోపాటు కాంటాక్ట్ పర్సన్, ఫోన్ నెంబర్, అడ్రెస్ ను పొందుతారు.

ఐఫోన్ బ్యాటరీ మార్చడం ఎంత కష్టమంటే?

Search Criteria - Search box

పైన పేర్కొన్న వివరాల గురించి మీకు ఖచ్చితంగా తెలియకపోయినట్లయితే...డైరెక్టుగా సెర్చ్ బాక్స్ కు వెళ్లి...నగరం పేరు లేదా మీ ప్రాంతాన్ని టైప్ చేయండి. ఇప్పుడు వెరిఫికేషన్ కోడ్ను ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ పై క్లిక్ చేయండి. పర్మినెంట్ కేంద్రాల్లో మీరు వెతుకుతున్నట్లయితే...చెక్ బాక్స్ను సెర్చ్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
As Aadhar is becoming mandatory now carrying a various number of tasks in India.So, in this article, we help you to locate the nearest Aadhaar enrolment center online.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot