ఆధార్ బయోమెట్రిక్ డేటాను లాక్ చేయటం ఎలా..?

|
How to lock your online aadhaar biometrics data (TELUGU GIZBOT)

ప్రతి భారతీయుడి జీవితంలో ఆధార్ అనేది కీలక గుర్తింపుగా మారిపోయింది. ఆధార్ కార్డ్ తీసుకునే ప్రతిఒక్కరూ (వయసును బట్టి) తప్పనిసరిగా తమ మీ వేలిముద్ర అలానే రెటీనల్ స్కాన్ డేటాను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ విధమైన డేటాను టెక్నికల్ పరిభాషలో బయోమెట్రిక్ డేటా అని పిలుస్తారు.

బయోమెట్రిక్ వివరాలను మరింత గోప్యంగా ఉంచుకోవాలంటే..

బయోమెట్రిక్ వివరాలను మరింత గోప్యంగా ఉంచుకోవాలంటే..

ఎంతో విలువైన ఈ బయోమెట్రిక్ వివరాలను తమ అనుమతి లేకుండా తీసుకుని దుర్వినియోగపరిచారంటూ కొందరు ఆరోపించటంతో ఆధార్ బయోమెట్రిక్ అంత సురక్షితం కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. UIDAI సర్వర్లలో లాక్ అయి ఉండే బయోమెట్రిక్ సమాచారాన్ని మరింత గోప్యంగా ఉంచుకోవాలంటే దానిని లాక్ చేసుకోవటం ఉత్తమమైన మార్గం.

ఇలా చేయటం ద్వారా మీ బయోమెట్రిక్ డేటాను వేరొకరు యాక్సిస్ చేసుకునే అవకాశం ఉండదు. మీకు అవసరమైనపుడు మాత్రమే అన్‌లాక్ చేసుకుని, అవసరం లేనపుడు లాక్ చేసుకోవచ్చు. యూజర్ తన Aadhaar biometric డేటాను లాక్ చేయటం ద్వారా ఆధార్ సంబంధిత లావాదేవీలు అలానే రిక్వస్ట్ లను one-time password ఆధారంగానే మేనేజ్ చేయగలుగుతారు.

వీళ్లకు సంబంధించిన వేలి ముద్ర అలానే ఐరిస్ స్కాన్ లాక్ చేయబడుతుంది. Aadhaar biometric authenticationను లాక్ చేసే విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం...

స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్...

స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్...

ముందుగా మీ బ్రౌజర్ నుంచి https://resident.uidai.gov.in/biometric-lockలోకి వెళ్లండి.

సంబంధిత పేజీ ఓపెన్ అయిన తరువాత 12 అంకెల ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తరువాత సెక్యూరీటీ కోడ్ కాలమ్ కనిపిస్తుంది. అక్కడ బాక్సలో కనిపించే సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్ చేయండి. పేజీలో క్రింద కనిపించే Generate OTP పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఆధార్‌తో రిజిస్టర్ అయిన మీ మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ రూపంలో one-time password అందుతుంది.

సమాచారం పూర్తిగా లాక్ కాబడుతుంది...

సమాచారం పూర్తిగా లాక్ కాబడుతుంది...

ఆ OTPని సంబంధిత కాలమ్‌లో ఎంటర్ చేసి Verify ఆప్షన్ క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తరువాత బయోమెట్రిక్ లాకింగ్‌ను ఎనేబుల్ చేసుకునేందుకు క్రింద కనిపించే 'Login' లింక్ పై క్లిక్ చేయండి. ఈ ప్రాసస్ కంప్లీ అయిన వెంటనే "Congratulations! Your Biometric data is locked అన్న మెసేజ్ స్ర్కీన్ పై కనిపిస్తుంది. దీంతో మీ Aadhaar biometric సమాచారం పూర్తిగా లాక్ కాబడుతుంది.

Airtel డబుల్ డేటా ప్లాన్లు వచ్చేశాయ్, మీకోసం పూర్తి వివరాలు !Airtel డబుల్ డేటా ప్లాన్లు వచ్చేశాయ్, మీకోసం పూర్తి వివరాలు !

Best Mobiles in India

English summary
Aadhaar number has become an integral part of our identities. From bank accounts to PAN Card, insurance policies to mobile number, we need Aadhaar for all this and much more now.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X