ఉచిత ఇంటర్నేషనల్ కాల్స్ పొందటం ఏలా..?

విదేశాల్లో ఉన్న మీ బంధవులు, మిత్రులతో మాట్లాడాలని ఉందా..? ఆ ఆలోచన మీలో ఉన్నట్లయితే అంతర్జాతీయ కాల్స్‌ను ఉచితంగా పొందే మార్గాలను ఈ శీర్షిక మీకు చూపుతుంది. పీసీ/ల్యాప్‌టాప్ నుంచి మొబైల్ ఫోన్‌లకు ఉచిత ఇంటర్నెషనల్ కాల్స్ చేసుకునేందుకు అందుబాటులో ఉన్న 5 అత్యుత్తమ ఆప్షన్‌లను ఇప్పుడు చూద్దాం...
మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి
Number Tank (నంబర్ ట్యాంక్):

ఈ వెబ్ సైట్ ద్వారా రోజుకు 30 నిమిషాల పాటు ఉచితం ఇంటర్నేషనల్ కాల్స్‌ను నిర్వహించుకోవచ్చు. పీసీ లేదా ల్యాప్‌టాప్ ద్వారా ఈ వెబ్‌సైట్ అకౌంట్‌లోకి లాగినై 30 నిమిషాల పాటు ఉచిత వాయిస్ కాలింగ్‌ను ఆస్వాదించవచ్చు.
Google Voice (గూగుల్ వాయిస్):

గూగుల్ అందిస్తోన్న అత్యుత్తమ సర్వీసుల్లో గూగుల్ వాయిస్ ఒకటి. ఈ ఉచిత కాలింగ్ సర్వీస్ ద్వారా పీసీ/ల్యాప్‌టాప్ నుంచి మొబైల్ ఫోన్‌లకు ఉచిత ఇంటర్నెషనల్ కాల్స్‌ను నిర్వహించుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఉచిత సర్వీస్ యూఎస్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. మిగిలిన దేశాల్లో కాల్ రేట్‌లకు అనుగుణంగా చార్జ్ చేస్తున్నారు.
Icall (ఐకాల్):

ఈ వెబ్‌సైట్ ద్వారా పీసీ/ల్యాప్‌టాప్ నుంచి మొబైల్ ఫోన్‌లకు ఉచిత ఇంటర్నెషనల్ కాల్స్‌ను నిర్వహించుకోవచ్చు. ఇండియా నుంచి యూఎస్ఏ, కెనడాలకు ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. ఐకాల్ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులో ఉంది. 5 నిమిషాల డ్యూరేషన్‌తో రోజుకు ఎన్నిసార్లు అయినా కాల్స్ చేసుకోవచ్చు.
Calltofriends(కాల్‌టూఫ్రెండ్స్):

ఈ వెబ్‌సైట్ ద్వారా ఒక నిమిషం కాల్ డ్యూరేషన్‌తో ఏ దేశానికైనా కాల్స్ చేసుకోవచ్చు.
GULFSIP (గల్ఫ్‌స్లిప్):

ఈ వెబ్‌సైట్ ద్వారా పీసీ నుంచి మొబైల్ కు, పీసీ నుంచి పీసీకు ఉచిత ఇంటర్నేషనల్ కాల్స్ నిర్వహించుకోవచ్చు.


Click it and Unblock the Notifications








