UPI ద్వారా...అమెజాన్ పేమెంట్స్!
అమెజాన్ ఇండియా పేమెంట్లను...ఇక నుంచి యూపీఐ ద్వారా కూడా చెల్లించవచ్చు. దీనికోసం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ స్పేస్ ను ప్రవేశపెట్టింది. ఈ పేమెంట్ విధానం డెస్క్ టాప్ ద్వారా షాపింగ్ చేసేవారికి ఈ సదుపాయం ఉండదు.అమెజాన్ మొబైల్ యాప్ కు మాత్రమే ఇది వర్తిస్తుంది. పదివేల రూపాయల వరకు లావాదేవీలు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఫ్లిప్ కార్ట్, పేటీఎం ఈ కామర్స్ సైట్ల ద్వారా యూపీఐ నగదు చెల్లింపు సేవలను అందిస్తున్నాయి.

ఇక నుంచి అమెజాన్ యాప్ ద్వారా కొనుగోళ్లు చేసే కస్టమర్లు...వారి చెల్లింపులు యూపిఐ ఐడిని ఉపయోగించి డెబిట్ , క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాకింగ్ తో సహా ఇతర మోడ్లతో కలిపి సెలక్ట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ ఒక ఆండ్రాయిడ్ లో మాత్రమే అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో మరిన్ని అప్ డేట్స్ తో ఐఓఎస్ కు రానుంది. యూపీఐ ద్వారా నేరుగా బ్యాంక్ అకౌంట్ నుంచి నగదు చెల్లించవచ్చు.
ఒకవేళ నగదును వాపస్ తీసుకోవాలనుకుంటే...అమెజాన్ నేరుగా కస్టమర్ అకౌంట్లోకి జమచేస్తుంది.
అమెజాన్ ఇండియాలో యూపిఐని ఎలా చెల్లించాలి?
స్టెప్1 మీరు మీ డివైసులో అమెజాన్ ఇండియా యాప్ యొక్క లెటేస్టు వెర్షను డౌన్ లోడ్ చేసుకోండి. దీనికోసం ప్లే స్టోర్ కు వెళ్లి అమెజాన్ కోసం సెర్చ్ చేయండి. అప్ డేట్ ఆఫ్షన్ను కలిగి ఉంటే...దానిపై నొక్కండి.
స్టెప్ 2. ప్రొడక్ట్ పదివేలు లేదా తక్కువ కొనుగోలు ఆప్షన్ పై నొక్కండి.
స్టెప్ 3..చెక్ అవుట్ స్క్రీన్లో, మీరు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాకింగ్, యూపిఐ వంటి చెల్లింపులకు సపోర్ట్ ను చూస్తారు.
స్టెప్ 4. ఇప్పుడు మీరు చెల్లింపు పద్దతిని యూపిఐని సెలక్ట్ చేసుకుంటే....యూపిఐ ఐడిని అందించమని అడుగుతారు.
స్టెప్ 5. వెరిఫికేషన్ తర్వాత, మీరు భీమ్ వంటి చెల్లింపు యాప్స్ కోసం యూపిఐ లైన్డ్ మొబైల్ యాప్ కు మళ్లించబడుతుంది.
స్టెప్ 6 మీ చెల్లింపులు పూర్తయిన తర్వాత, మీ మొబైల్ యాప్ లేదా బ్రౌజర్లో ఆర్డర్ను చూస్తారు. అలాగే విజయవంతమైన ప్లేస్ మెంట్ కోసం పదినిమిషాల్లో చెల్లింపును పూర్తి చేయడానికి నిర్దారించుకోండి.


Click it and Unblock the Notifications








