Home
How to

కంప్యూటర్‌లోని గేమ్స్ ఆండ్రాయిడ్ ఫోన్‌లలో స్ట్రీమ్ అవ్వాలా..?

విండోస్ పీసీలో ఇన్‌స్టాల్ అయిన మీ ఫేవరెట్ వీడియో గేమ్‌ను ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ లేదా టీవీలో పొందాలనుకుంటున్నారా?

విండోస్ పీసీలో ఇన్‌స్టాల్ అయిన మీ ఫేవరెట్ వీడియో గేమ్‌ను ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ లేదా టీవీలో పొందాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ ఫాలో అవ్వండి. పీసీ గేమ్స్‌ను ఆండ్రాయిడ్ డివైసెస్‌లో స్ట్రీమ్ చేసుకునేందుకు వీలుగా స్టీమ్ అనే సంస్థ 'స్టీమ్‌ లింక్’ (Steam Link) పేరుతో ఓ అఫీషియల్ గేమ్ స్ట్రీమింగ్ యాప్‌ను ఇంటర్నెట్‌లో లాంచ్ చేసింది. ఈ యాప్ ద్వారా పీసీలో లైబ్రరీలో ఉన్న గేమ్స్‌ను ఆండ్రాయిడ్ డివైసెస్‌లో స్ట్రీమ్ చేసుకునే వీలుంటుంది. ఈ సదుపాయం ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. స్టీమ్‌ లింక్ యాప్‌ను పీసీలో ఏ విధంగా సెటప్ చేసుకోవాలి అనేదాని పై స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్‌ను ఇప్పుడు తెలుసుకుందాం..

స్టెప్ 1

స్టెప్ 1

పీసీ గేమ్స్‌ను ఆండ్రాయిడ్ డివైసెస్‌లో స్ట్రీమ్ చేసుకునే క్రమంలో యూజర్లు ముందుగా స్టీమ్ లింక్ యాప్‌ను తమతమ ఆండ్రాయిడ్ డివైసెస్‌లోకి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. స్టీమ్ లింక్ యాప్‌ గూగుల్ ప్లే స్టోర్‌లో అఫీషియల్‌గా లభ్యమవుతోంది.

స్టెప్ 2

స్టెప్ 2

ఇదే సమయంలో మీ మీ పీసీల్లోనూ ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది. వెబ్ వెర్షన్ యాప్‌కు సంబంధించిన డౌన్‌లోడ్ లింక్‌ను Steam వెబ్‌సైట్‌ ద్వారా అఫీషియల్‌గా పొందవచ్చు. యాప్‌ను లాంచ్ చేసిన తరువాత లాగిన్ అయ్యేందుకు మీ పేరుతో స్టీమ్ అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవల్సి ఉంటుంది.

 

 

 

 

స్టెప్ 3

స్టెప్ 3

అకౌంట్ క్రియేట్ అయిన తరువాత ‘Preference' సెక్షన్‌లోకి వెళ్లి ‘In-Home Streaming' అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి.

స్టెప్ 4

స్టెప్ 4

తదుపరి స్టెప్‌లో భాగంగా ‘Enable Streaming' చెక్‌బాక్స్‌ను చెక్ చేయవల్సి ఉంటుంది.

స్టెప్ 5

స్టెప్ 5

మీ పీసీలో Nvidia graphics కార్డ్ ఉన్నట్లయితే ‘Advanced Host Options' పై క్లిక్ చేసి అందులోని ‘Use NVFBC capture on NVIDIA GPU' అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్నట్లయితే, గేమ్స్ స్ట్రీమ్ అవుతోన్న సమయంలో బెస్ట్ ఫ్రేమ్ రేట్‌లను మీరు ఆస్వాదించే వీలుంటుంది.

స్టెప్ 6

స్టెప్ 6

తదుపరి చర్యలో భాగంగా స్టీమ్ లింక్ యాప్‌ను సెటప్ చేసుకోవల్సి ఉంటుంది.

స్టెప్ 7

స్టెప్ 7

స్టీమ్ లింక్ యాప్‌ను సెటప్ చేసే సమయంలో మీ పీసీ అలానే ఆండ్రాయిడ్ డివైస్ ఒకే వై-ఫై నెట్‌వర్క్‌తో కనెక్ట్ అయి ఉండాలి.

స్టెప్ 8

స్టెప్ 8

స్టీమ్ లింక్ యాప్‌ను సెటప్ చేసే క్రమంలో ముందుగా యాప్‌ను ఓపెన్ చేసి అన్ని ఇనీషియల్ పాపప్స్‌ను కంప్లీట్ చేయవల్సి ఉంటుంది.

 

 

స్టెప్ 9

స్టెప్ 9

యాప్‌ సెటప్ అయ్యే క్రమంలో కంట్రోలర్‌ను పెయిర్ చేయమని అడుగుతుంది. వాస్తవానికి పీసీ గేమ్స్‌ను టచ్ కంట్రోల్స్‌తో ఆడటమనేది దాదాపుగా అసాధ్యం.

 

 

స్టెప్ 10

స్టెప్ 10

తరువాతి స్టెప్‌లో భాగంగా స్టీమ్ లింక్ యాప్ మీ కంప్యూటర్‌ను ఆటోమెటిక్‌గా స్కాన్ చేసే ప్రయత్నం చేస్తుంది.

 

 

స్టెప్ 11

స్టెప్ 11

స్కానింగ్ ప్రాసెస్ పూర్తయిన వెంటనే యాప్ నెట్‌వర్క్ టెస్ట్‌ను రన్ చేస్తుంది. ఈ క్రమంలో అంతరాయంలేని స్ట్రీమింగ్‌కు అవసరమైన ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడ్ ఇంకా ఇతర అంశాలను చెక్ చేసుకుంటుంది. స్టీమ్ యాప్ రికమెండ్ చేస్తున్న దాని ప్రకారం పీసీ గేమ్స్‌ను ఆండ్రాయిడ్ డివైసెస్‌లో స్ట్రీమ్ చేసే సమయంలో 5GHz వై-ఫై కనెక్షన్ తప్పనిసరి. ఒకవేళ మీరు 2.4GHz వై-ఫై కనెక్షన్‌ను ఉపయోగిస్తున్నట్లయితే ఎర్రర్ మేసేజ్ వచ్చేస్తుంది.

స్టెప్ 12

స్టెప్ 12

స్ట్రీమ్ క్వాలిటీ సెట్టింగ్స్‌ను యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లటం ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు.

 

 

స్టెప్ 13

స్టెప్ 13

అంతా పూర్తయిన తరువాత ‘Start Playing' బటన పై క్లిక్ చేసినట్లయితే పీసీలోని గేమ్ నేరుగా మీ ఆండ్రాయిడ్ డివైస్‌లో స్ట్ర్రీమ్ అవుతుంది.

 

 

More from GizBot

Best Mobiles in India

English summary
How to play PC games on your Android smartphones, tablets and Android-powered televisions.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X