మీ హోం నెట్ వర్క్ ను ఎలా కాపాడుకోవాలి?

By: Madhavi Lagishetty

మాల్వేర్ దాడులు...అన్ సెక్యూర్డ్ IOT ఎండ్ పాయింట్ ను లక్ష్యంగా చేసుకుంటున్నాయి.ఇంట్లో, ఆఫీస్ కోసం ఉపయోగించే నెట్ వర్ల్కు హ్యాకర్ల నుంచి సైబర్ దాడులను ఎదుర్కొవల్సి వస్తుంది.

మీ హోం నెట్ వర్క్ ను ఎలా కాపాడుకోవాలి?

నిజానికి..ప్రతి ఒక్కరూ ఈ మాల్వేర్ దాడులకు గురవుతారు. మీ నెట్ వర్క్, హ్యాకర్లు మరియు ఫ్రీ లోడర్స్ అలైక్ ను ఉపయోగించకుండా ఇతరులను కూడా మీరు నిరోధించవచ్చు. మీ హోం నెట్ వర్క్ ను సురక్షితంగా ఉంచడానికి, అనామక హ్యకర్ల నుంచి రక్షించడానికి ఈ చిట్కాలను అనుసరించండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పేరు మార్చండి...

ఫస్ట్ ఈజ్ ఫస్ట్ ! మీ వై-ఫై నెట్ వర్క్ పేరును మార్చండి. ఇది కూడా SSID (సర్వీస్ సెట్ ఐడెంటిఫైయర్)గా పిలువబడుతుంది. మీరు ఉపయోగించే రౌటర్ పేరు మార్చినట్లయితే...హ్యాకర్లకు పేరు తెలుసుకోవడం చాలా కష్టం. హ్యాకర్లు మీ రౌటర్ యొక్క తయారీదారు గురించి తెలుసుకుంటే..ఆ మోడల్ యొక్క ఎక్స్ ప్లోయిట్ చాలా కష్టంగా ఉంటుంది.

ఒకే ఒక స్ట్రాంగ్ పాస్ వర్డ్ బెట్టర్...

మీరు ఒక రౌటర్ను కొనుగోలు చేసినప్పుడు, ఇది డిఫాల్ట్ పాస్ వర్డ్ తో వస్తుంది. ఇది ఆ రౌటర్ యొక్క తయారీదారికి తెలిస్తే..హ్యకర్లు ట్రాక్ చేయడం సులభం. కాబట్టి మీరు ఇరవై అక్షరాలతో వైర్లెస్ పాస్ వర్డ్ ను క్రియేట్ చేసుకోవడం బెట్టర్. పాస్ వర్డ్ లెటర్స్, నంబర్స్ తో కలిపి చేర్చినట్లయితే అంత ఈజీగా హ్యాక్ కు గురికాదు.

నెట్ వర్క్ ఎన్ర్కిప్షన్ ప్రారంభించండి...

వైర్లెస్ నెట్ వర్క్స్ WEP,WPA లేదా WPA2 వంటి మల్టీపుల్ ఎన్ర్కిప్షన్ లాంగ్వేజెస్ తో వస్తాయి. WEP 1990లో మొట్టమొదటిసారిగా డెవలప్ చేయబడింది. మీ వై-ఫై రక్షణను పెంచడానికి బెస్ట్ ఎన్ర్ర్కిప్షన్ సెట్టింగ్స్ WPA2 AES. ఇది ఇప్పుడు ఒక ప్రామాణిక భద్రతా వ్యవస్థ. ఇక్కడ అన్ని వైర్లెస్ నెట్ వర్స్క్ కు అనుకూలంగా ఉంటాయి.

జియోకి కౌంటర్: Airtel నయా అన్‌లిమిటెడ్ ఆఫర్

రౌటర్ ప్లేస్మెంట్....

వై-ఫై స్థానం అనేది చాలా ఇంపార్టెట్ రోల్ పోషిస్తుంది. ఇది మీ ఇంటి మధ్యలో వైర్లెస్ రౌటర్ను ఉంచడానికి రెకమండ్ చేస్తుంది. మీ రూమ్స్ అన్నింటిలో ఒకే సిగ్నల్ స్ట్రెంత్ పొందుతారు. మీరు సిగ్నల్ రేంజ్ ను దాటి బయటకు వెళ్తే సిగ్నల్స్ మిమ్మల్ని చేరుకోలేవు.

రిమోట్ యాక్సెస్ను ఆపివేయుట...

రౌటర్లు అనుసంధాన డివైస్ నుండి తమ ఇంటర్ ఫేస్ను యాక్సెస్ చేయడానికి అనుమతించేటప్పుడు...రిమోట్ సిస్టమ్స్ నుంచి కూడా అనుమతిస్తాయి. హ్యాకర్లు మీ సిస్టమ్లోకి ప్రవేశించడానికి ఇది ఈజీ అవుతుంది.

అందుకే రిమోట్ యాక్సెస్ నిలివేసిన తర్వాత, మీ నెట్ వర్క్ కనెక్ట్ చేయని డివైస్ తో మీ రౌటర్ ప్రైవేట్ సెట్టింగ్ను ఎవరూ యాక్సెస్ చేయలేరు. మీరు వెబ్ ఇంటర్ ఫేస్ను యాక్సెస్ చేసి రిమోట్ యాక్సెస్ లేదా రిమోట్ అడ్మినిస్ట్రేషన్ కోసం సెర్చ్ చేయడం ద్వారా దీన్ని మార్చవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
These days, malware attacks are in rising targeting the unsecured endpoints. In order to keep your home network secure, follow these tips to protect from anonymous hackers.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot