పొరపాటున పంపిన Emailను వెనక్కి తీసుకోవటం ఎలా..?

Posted By: BOMMU SIVANJANEYULU

కాగితం, కలం అందుబాటులోకి రాక ముందు నోటిమాటనే శాసనంగా భావించే వారు మన పూర్వీకులు. ఇచ్చిన మాట, చేసిన వాగ్థానం కోసం ఎంతటి త్యాగానికైనా వీరు ఒడిగట్టే వారు. వెర్బల్ కమ్యూనికేషన్స్
విభాగంలో నోటిమాటకు ఎంతైతే ప్రాధాన్యత ఉందో, రిటన్ కమ్యూనికేషన్స్ విభాగంలోనూ లెటర్స్ అలానే మెయిల్స్‌కు అంతే ప్రాధాన్యత ఉంది.

పొరపాటున పంపిన Emailను వెనక్కి తీసుకోవటం ఎలా..?

ఒక్కసారి పంపిన మెయిల్ లేదా లెటర్‌ను వెనక్కి తీసుకోవటమనేది దాదాపుగా సాధ్యపడదు. గూగుల్‌కు సంబంధించిన జీమెయిల్ సర్వీస్ మార్కెట్లో లాంచ్ అయిన నాటి నుంచి కోట్లాది మంది యూజర్లు ఈ సర్వీసుకు కనెక్ట్ అయి ఉన్నారు.

ఆన్‌లైన్ మెయిల్ సర్వీసింగ్ విభాగంలో అత్యధికమంది యూజర్లను కలిగి ఉన్న జీమెయిల్, కొత్త ఫీచర్లను యాడ్ చేయటంలో ఇతర మెయిలింగ్ సర్వీసులతో పోలిస్తే వెనుకబడి ఉంది. ఇందుకు ఉదాహరణే రీకాల్ ఈమెయిల్ ఫీచర్.

ఈ ఫీచర్‌ను అవుట్‌లుక్ వంటి ఇతర మెయిలింగ్ సర్వీసులు అప్‌డేట్ చేసిన తరువాత జీమెయిల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. జీమెయిల్ ఆఫర్ చేస్తున్న Undo send ఫీచర్ ద్వారా పొరపాటున పంపిన మెయిల్‌ను వెనక్కి తీసుకునే వీలుంటుంది. జీమెయిల్ అకౌంట్ ద్వారా పొరపాటున పంపే మెయిల్స్‌ను వెంటనే రీకాల్ చేసేందుకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్...

నోకియా స్మార్ట్ వాచ్ రూ.12,639లకే

జీమెయిల్‌లో మెయిల్ కంపోజ్ చేయటం పూర్తి అయిన తరువాత రిసిప్టెంట్ మెయిల్ ఐడీలతో పాటు సబ్జెక్ట్‌ను యాడ్ చేసి "Send" బటన్ పై హిట్ చేసినట్లయితే, ఆ మెయిల్ అవతలి వ్యక్తులకు చేరిపోతుంది. మెయిల్ సెండ్ అయిన తరువాత దానికి సంబంధించిన ఓ నోటిఫికేషన్ ఈ-మెయిల్ విండో టాప్ భాగంలో కనిపిస్తుంది.

ఈ నోటిఫికేషన్‌లో Undo పేరుతో అండర్‌లైన్ చేయబడిన ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. ఈ ఆప్షన్ 30 సెకన్ల పాటు మాత్రమే కనిపిస్తుంది. ఆ తరువాత ఆటోమెటిక్‌గా మాయమైపోతుంది. మీరు ఆ మెయిల్‌ను రీకాల్ చేయదలిచినట్లయితే మొదటి 30 సెకన్లలోపే స్పందించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌లో కనిపించే Undo ఆప్షన్ పై క్లిక్ చేయటం ద్వారా ఆ మెయిల్‌ను వెనక్కితీసేసుకోవచ్చు.

ఈ ఫీచర్ ద్వారా పొరపాటున పంపిన మెయిల్స్‌ను వెనక్కితీసకునే వీలుంటుంది. మీ జీమెయిల్ అకౌంట్‌లో "Undo send" ఆప్షన్‌ను సెటప్ చేసుకోవాలంటే మెయిల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి Undo Send ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవల్సి ఉంటుంది. ఇదే సమయంలో మెయిల్ క్యాన్సిలేషన్ పిరియడ్‌ను 30 సెకన్ల వరకు పెంచుకోవాలి.

మీకు తెలియని మరిన్ని జీమెయిల్ సంగతులు...

జీమెయిల్ నుంచి ప్రతి ఈమెయిల్‌కు 50MB సామర్థ్యం గల అటాచ్‌మెంట్స్‌ను జత చేసుకోవచ్చు. గతంలో ఈ సామర్థ్యం 25MB మాత్రమే. ఈ కొత్త అప్‌డేట్‌ను కొద్దినెలల క్రితమే గూగుల్ అందుబాటలోకి తీసుకువచ్చింది. జీమెయిల్ సెట్టింగ్స్ పేజీలోని కస్టమ్ కీబోర్డ్ షార్ట్‌కట్స్ ఫీచర్‌లోకి వెళ్లటం ద్వారా మీ మెయిల్ అకౌంట్‌కు సంబంధించి మీకు నచ్చినట్లు కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు.

జీమెయిల్ ప్రివ్యూ ల్యాబ్స్ ఫీచర్ ద్వారా వివిధ సర్వీసుల నుంచి మీ మెయిల్‌కు అందే వీడియోలు, డాక్యుమెంట్లు, వాయిస్ మెయిల్స్, ఈమెయిల్స్ ఇంకా మెసేజ్‌లను ప్రివ్యూ రూపంలో చూడొచ్చు. మెయిల్స్‌ను త్వరతిగతిన చెక్ చేసుకునేందకు వీలుగా ఆటో అడ్వాన్స్ పేరుతో సరికొత్త ఫీచర్‌ను జీమెయిల్ అందిస్తోంది.

మీ జీమెయిల్ అకౌంట్‌కు అదనపు సెక్యూరిటీని కోరుకుంటన్నట్లయితే టు-స్టెప్ వెరిఫికేషన్‌ను ఏర్పాటు చేసేకుంటే సరి. టూ స్టెప్ వెరిఫికేషన్ ప్రాసెస్‌లో భాగంగా యూజర్ తన మొబైల్ నెంబరును జీమెయిల్ అకౌంట్‌తో అనుసంధానించుకోవల్సి ఉంటుంది. ఆ తరువాత నుంచి, జీమెయిల్ అకౌంట్‌లోకి లాగిన్ అయ్యే ప్రతిసారి యూజర్ మొబైల్ నెంబర్‌కు 6 అంకెల వెరిఫికేషన్ కోడ్‌ వస్తుంటుంది. ఈ కోడ్‌ను సంబంధిత కాలమ్‌లో ఎంటర్ చేస్తేనే అకౌంట్‌లోకి లాగిన్ కాగలుగుతారు.

English summary
How to recall email in Gmail. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot