వాట్సాప్, ఫేస్‌బుక్ వీడియో కాల్స్‌ను రికార్డ్ చేయటం ఎలా..?

Posted By: BOMMU SIVANJANEYULU

నేటి ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచంలో వీడియో కాల్స్ అనేవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. సామాజిక సంబంధాల వెబ్‌సైట్‌ల ద్వారా ఇద్దరు వ్యక్తులు లేదా గ్రూప్స్ మధ్య జరుగుతోన్న సంభాషణలకు వీడియో కాల్స్ మరింత వాస్తవికతను తీసుకవస్తున్నాయి. వీడియో కాలింగ్ అందుబాటులోకి రాకముందు కేవలం వాయిస్ కాల్స్ ద్వారా మాత్రమే సంభాషణలు సాగేవి.

వాట్సాప్, ఫేస్‌బుక్ వీడియో కాల్స్‌ను రికార్డ్ చేయటం ఎలా..?

ఈ క్రమంలో అవతలి వ్యక్తుల స్వరాన్ని మాత్రమే వినగలిగే అవకాశం ఉండేది. వీడియో కాల్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత అవతలి వ్యక్తులను ప్రత్యక్షంగా చూస్తూ మాట్లాడుకోగలుగుతున్నాం. ఈ క్రమంలో మనుషులు మధ్య కొత్తకొత్త ఎమోషన్స్ చిగురిస్తున్నాయి.

ఇద్దరి వ్యక్తులకు సంబంధించిన సంభాషణల దృశ్యాలను వారివారి ఫోన్ ఫ్రంట్ కెమెరాల ద్వారా లైవ్ వీడియో రూపంలో చిత్రీకరించి, ఆ విజువల్స్‌ను ఏకకాలంలో ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసే ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ ద్వారా ఒకరి విజువల్‌ను మరొకరికి ట్రాన్స్‌ఫర్ చేయటమే వీడియో కాలింగ్ ముఖ్య ఉద్దేశ్యం.

సెల్ఫీని చంపేస్తున్న బోథీ, ఫీచర్‌పై పూర్తివివరాలు ఇవే..

వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వెబ్‌సైట్‌లు డీఫాల్ట్‌గా వీడియో కాలింగ్ సదుపాయాన్ని ఆఫర్ చేస్తున్నప్పటికి, వాటిని రికార్డ్ చేసుకుని సేవ్ చేసుకునే ఆప్షన్‌ను మాత్రం ఇప్పటి వరకు ప్రొవైడ్ చేయలేకపోయాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏదైనా వీడియో కాల్‌ను రికార్ట్ చేయవల్సి వస్తే ఏం చేస్తారు..?

సోషల్ మీడియా వెబ్‌సైట్‌ల ద్వారా నిర్వహించుకునే వీడియో కాల్స్‌ను ఎప్పటికప్పుడు రికార్డ్ చేసుకునేందుకు కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. మీరు కూడా ఇలాంటి వాటి కోసమే ఎదురు చూస్తున్నట్లయితే ఈ కథనాన్ని చదవండి...

వాస్తవానికి వాట్సాప్, ఫేస్‌బుక్‌ల ద్వారా నిర్వహించుకునే వీడియో కాల్స్‌ను రెండు మార్గాలలో రికార్డ్ చేసుకోవచ్చు. ఈ పనిని పూర్తి చేయటానికి కోసం, రెండు ప్రత్యేకమైన స్ర్కీన్ రికార్డర్ యాప్స్ గూగుల్ ప్లే స్టోర్‌లో సిద్థంగా ఉన్నాయి. వాటి గురించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

వాట్సాప్, ఫేస్‌బుక్ వీడియో కాల్స్‌ను రికార్డ్ చేయటం ఎలా..?

డీయూ రికార్డర్ (DU Recorder)

యాప్‌కు సంబంధించిన ప్లే స్టోర్ డౌన్‌లోడ్ లింక్

ఈ అప్లికేషన్‌ను చాలా సింపుల్‌గా ఉపయోగించుకోవచ్చు. DU Recorder యాప్‌ను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్న తరువాత స్ర్కీన్ పై ఓ Floating Icon ప్రత్యక్షమవుతుంది. ఈ ఐకాన్ పై టాప్ చేసిన ప్రతిసారి అనేక ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. వీటిలో రికార్డ్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్నట్లయితే ఫోన్ స్ర్కీన్ పై జరిగే ప్రతి విషయం రికార్డ్ అయిపోతుంది. వీడియోలను రికార్డ్ చేసే సమయంలో సౌండ్‌ను కూడా ఈ యాప్ రికార్డ్ చేసి సేవ్ చేస్తుంది. ఈ యాప్ ద్వారా అన్ని రకాల వీడియో కాల్స్‌ను రికార్డ్ చేసుకునే వీలుంటుంది!.

వాట్సాప్, ఫేస్‌బుక్ వీడియో కాల్స్‌ను రికార్డ్ చేయటం ఎలా..?


AZ Screen Recorder (ఏజెడ్ స్ర్కీన్ రికార్డర్)

యాప్‌కు సంబంధించిన ప్లే స్టోర్ డౌన్‌లోడ్ లింక్

డీయూ రికార్డర్ మాదిరిగానే AZ Screen Recorder యాప్‌ను కూడా చాలా సింపుల్‌గా ఉపయోగించుకోవచ్చు. ఈ యాప్ మీ స్మార్ట్‌ఫోన్‌లో వర్క్ అయ్యేందుకు ఎటువంటి రూట్ యాక్సెస్ అవసరం ఉండదు.

నోటిఫికేషన్ ప్యానల్ నుంచే వీడియోలను రీకార్డ్ చేసుకునే వీలుంటుంది. ఈ యాప్ ద్వారా వాట్సాప్, ఫేస్‌బుక్ తదితర యాప్‌లకు సంబంధించిన వీడియో కాల్స్‌ను నిర్వహించుకోవచ్చు.ఈ స్ర్కీన్ రికార్డర్ యాప్, వీడియోలను రికార్డ్ చేసే సమయంలో సౌండ్‌ను కూడా చాలా క్లియర్‌గా క్యాప్చుర్ చేస్తుంది.

English summary
How to Record Video Calls on WhatsApp and Facebook. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot