మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను రికవర్ చేసుకోవటం ఏలా..?

అనుకోకుండా మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోని టెక్స్ట్ మెసేజ్‌లను డిలీట్ చేసేసారా..? కంగారుపడుకండి 99% వరకు వాటిని రికవర్ చేసుకునే అవకాశం ఉంది. అయితే మీరు వెంటనే స్పందించాల్సి ఉంటుంది. ఎందుకంటే డీలట్ కాబడిన డేటాలో కొంత మొత్తం మెమరీ మాత్రమే తిరిగి వ్రాయబడుతుంది. కాబట్టి, మెసేజ్‌లు డిలీట్ అయిన వెంటనే రకవరీకి సిద్ధంకండి.
మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి
డేటాను రకవరీ చేసేందుకు అనేక పోగ్రామ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో డీలీట్ అయిన ఎస్‌ఎంఎస్‌లను రికవర్ చేసుకునేందుకు కూల్‌మస్టర్ ఆండ్రాయిడ్ ఎస్ఎంఎస్ + కాంటాక్ట్స్ రివకరీ, ఆండ్రాయిడ్ డేటా రికవరీ వంటి యాప్స్ అందుబాటులో ఉన్నాయి.

image credits: wondershare
మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో కోల్పొయిన ఎస్ఎంఎస్ డేటాను రికవర్ చేసుకునే క్రమంలో వీటిలో ఏదో ఒక ప్రోగ్రామ్‌ను ముందుగా మీ కంప్యూటర్‌లో డౌన్‌లోడ్ చేసుకుని ఆ తరువాత ఇన్‌స్టాల్ చేయండి.

image credits: wondershare
ఇన్‌స్టాలింగ్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత స్మార్ట్‌ఫోన్‌ను యూఎస్బీ కేబుల్ సహాయంతో పీసీకి కనెక్ట్ చేయండి. ఆ తరువాత మీ ఫోన్‌లో యూఎస్బీ డీబగ్గింగ్‌ను ఎనేబుల్ చేయండి (Enable the USB debugging). ఇలా చేయటానికి మీరు ఫోన్ ప్రధాన సెట్టింగ్స్‌లోని డెవలపర్ ఆప్షన్స్‌ను యాక్సెస్ చేసుకోవల్సి ఉంటుంది. డీబగ్గింగ్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే మీ డివైస్ డిటెక్ట్ కాబడుతుంది.

image credits: wondershare
ఆ తరువాత రికవరీ ప్రోగ్రామ్‌లోని సూచనలను అనసరిస్తూ మీ ఆండ్రాయిడ్ ఫోన్ మెమరీని స్కాన్‌కు సిద్ధమవుతుంది. స్కాన్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే ఫోన్‌లో రికవర్ కాబడిన డేటా, ప్రివ్యూ రూపంలో డెస్క్‌టాప్ పై మీకు కనిపిస్తుంది.

image credits: wondershare
వాటిలో మీకు అవసరమైన మెసేజ్ ఫోల్డర్‌ను సెలక్ట్ చేసుకుని రికవర్ యాక్షన్ పై క్లిక్ చేసినట్లయితే సంబంధిత ఫోల్డర్ మీ పీసిలోకి సేవ కాబడుతుంది. ఈ విధంగా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో పోగొట్టుకున్న ఎస్ఎంఎస్‌లను రికవర్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








