పోగొట్టుకున్న డేటాను తిరిగి పొందటం ఏలా..?
అనుకోకుండా మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోని ఫోటోలు డిలీట్ కాబడ్డాయా..? కంగారుపడుకండి 99% వరకు వాటిని రికవర్ చేసుకునే అవకాశం ఉంది. అయితే మీరు వెంటనే స్పందించాల్సి ఉంటుంది. ఎందుకంటే డీలట్ కాబడిన డేటాలో కొంత మొత్తం మెమరీ మాత్రమే తిరిగి వ్రాయబడుతుంది. కోల్పొయిన డేటాను రకవరీ చేసేందుకు అనేక పోగ్రామ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో డీలీట్ అయిన డేటాను రికవర్ చేసుకునేందుకు ఆండ్రాయిడ్ డేటా రికవరీ టూల్ ను ఉపయోగించుకోండి. మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో పోగొట్టుకున్న డేటాను రికవర్ చేసుకునేందుకు అనుసరించవల్సిన చిట్కాలు...
మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

పోగొట్టుకున్న డేటాను తిరిగి పొందటం ఏలా..?
మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లోని డేటా డిలీట్ అయిన తరువాత ఏదైనా కొత్త డేటాను యాడ్ చేయటం గానీ, డిలీట్ చేయటం గానీ చేయకూడదు. ఎందుకుంటే డేటా రికవరీ టూల్ కొంత మెమరీని మాత్రమే రికవర్ చేయగలుగుతుంది.

పోగొట్టుకున్న డేటాను తిరిగి పొందటం ఏలా..?
ఆండ్రాయిడ్ డేటా రికవరీ ప్రోగ్రామ్‌ను మీ కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేయండి.

పోగొట్టుకున్న డేటాను తిరిగి పొందటం ఏలా..?
పీసీలో ప్రోగ్రామ్ ఇన్‌స్టాల్ అయిన తరువాత యూఎస్బీ కేబుల్ సహాయంతో ఆండ్రాయిడ్ డివైస్‌ను పీసీకి కనెక్ట్ చేయండి.

పోగొట్టుకున్న డేటాను తిరిగి పొందటం ఏలా..?
ఇన్‌స్టాలింగ్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత స్మార్ట్‌ఫోన్‌ను యూఎస్బీ కేబుల్ సహాయంతో పీసీకి కనెక్ట్ చేయండి. ఆ తరువాత మీ ఫోన్‌లో యూఎస్బీ డీబగ్గింగ్‌ను ఎనేబుల్ చేయండి (Enable the USB debugging). ఇలా చేయటానికి మీరు ఫోన్ ప్రధాన సెట్టింగ్స్‌లోని డెవలపర్ ఆప్షన్స్‌ను యాక్సెస్ చేసుకోవల్సి ఉంటుంది. డీబగ్గింగ్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే మీ డివైస్ డిటెక్ట్ కాబడుతుంది.

పోగొట్టుకున్న డేటాను తిరిగి పొందటం ఏలా..?
లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ డేటా రికవరీ టూల్ ప్రత్యేకమైన ఫీచర్లను కలిగి ఉంది. కాబట్టి, మీరు ఎలాంటి ఫైల్స్ ను రికవర్ చేయాలనుకుంటున్నారో సెలక్ట్ చేసుకుని next బటన్ పై క్లిక్ చేయండి. ఒకవేళ డిలీట్ అయిన మొత్తం డేటాను రికవర్ చేయదలచుకుంటే ‘select all' పై టిక్ మార్క్ చేసి next బటన్ పై క్లిక్ చేయండి.

పోగొట్టుకున్న డేటాను తిరిగి పొందటం ఏలా..?
ఆ తరువాత ఓపెన్ అయ్యే విండోలో స్కాన్ మోడ్‌ను సెలక్ట్ చేసుకుని next బటన్ పై క్లిక్ చేయండి. మీ ఆండ్రాయిడ్ ఫోన్ మెమరీని స్కాన్‌కు సిద్ధమవుతుంది. స్కాన్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే ఫోన్‌లో రికవర్ కాబడిన డేటా, ప్రివ్యూ రూపంలో డెస్క్‌టాప్ పై మీకు కనిపిస్తుంది.

పోగొట్టుకున్న డేటాను తిరిగి పొందటం ఏలా..?
వాటిలో మీకు అవసరమైన ఫోల్డర్‌ను సెలక్ట్ చేసుకుని రికవర్ యాక్షన్ పై క్లిక్ చేసినట్లయితే సంబంధిత ఫోల్డర్ మీ పీసిలోకి సేవ్ కాబడుతుంది. ఈ విధంగా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో పోగొట్టుకున్న ఎస్ఎంఎస్‌లను రికవర్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications